Menu
BREAKING
Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?

Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ

Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి. దక్షితో పాటు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. హౌస్ నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం శాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అసలే శనివారం రోహిత్‌ను హోస్ట్ నాగార్జున ఎన్నడూ లేనంత దారుణంగా రోస్ట్ చేశారు. ఈ వారం రోహిత్‌కు పెద్దగా కోటింగ్ ఉండదని అంతా భావించారు. కానీ ఈసారి బ్లాక్ కార్డ్ ఇచ్చి మరీ ఏకిపారేశారు. అతను ఎంతలా డల్ అయిపోయాడంటే మోకాళ్లపై కూర్చొని మరీ నాగ్‌ను వేడుకున్నాడు. రెండు వారాల పాటు కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఉండదని నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు.

శనివారంతో రోహిత్ బాగా డల్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే.. అతను నోటి వెంట ఏం మాట్లాడినా తప్పే. అంతకు ముందు జరిగిన పరిణామాలు బిగ్‌బాస్ టీంకి అనవసరం. హోస్ట్ నాగార్జునదేముంది? స్క్రిప్ట్ ప్రకారం వెళ్లిపోతారు. కానీ రోహిత్‌ను ఎంతలా తొక్కాలో అంతలా తొక్కారు. ఇక మీదట అతను నోరు తెరవాలన్నా భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఇక ముందు అతనికి బిగ్‌బాస్ హౌస్‌లో సపోర్ట్ ఉండదు సరికదా.. త్రిగుణ్, దేబ్జాని, వర్షిణి, ముఖేష్ తదితరులంతా దారుణంగా బ్లాక్ కార్డ్ విషయం తీసి హ్యుమిలియేట్ చేసే అవకాశం ఉంది. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న అంశాన్ని తీసి ఒకరకంగా బయటకు వెళ్లిపోతే బాగుంటుందనే పరిస్థితికి తీసుకొస్తారు. ఈ పరిణామాలను తట్టుకోవడం చాలా కష్టమైతే ఇప్పటి వరకూ రోహిత్‌కు అండగా నిలిచిన ఒకే ఒక సపోర్ట్ శాలినిని బయటకు పంపించడం మరో ఎత్తు.

ఇది అతన్ని మరింత కుంగదీసే అవకాశం ఉంది. పైగా ‘నీ పక్కనున్న వారంతా బయటకు వెళ్లిపోతున్నారు’ అంటూ ఇప్పటికే త్రిగుణ్ గ్రూప్ అతడిని దారుణంగా హింసిస్తోంది. ఇంతకు ముందు శాలిని అతని గేమ్‌కు ప్రధాన అడ్డంకి. కానీ సపోర్ట్ అవసరమైన తరుణంలో ఆమె వెళ్లిపోవడం అతనికి మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. మరి వీటన్నింటినీ రోహిత్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక మరోవైపు నిన్నటి ఎపిసోడ్‌పై సోషల్ మీడియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. రోహిత్‌కు బీభత్సమైన సింపతి వచ్చేసింది. గత వారం రోహిత్‌ ఓటింగ్‌ను త్రిగుణ్ దాటేశాడు. మరి ఈ వారం ఎలా ఉండనుందో చూడాలి.

Pranav

Writer and contributor at Telugu Cinema 360