
బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని టాక్. వాస్తవానికి ఇంకా ఆదివారం షో పూర్తవలేదు కానీ ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ పక్కా అన్నట్టుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి 99.9 శాతం నిజమే. దీనికి కారణం.. ఆమెను బయటకు తీసుకురావడానికి రోహిత్ ఫ్యాన్సే బాగా వర్కవుట్ చేసినట్టుగా తెలుస్తోంది.
హౌస్‌లోని వారంతా షాలిని బయటకు వెళితే రోహిత్‌ను భరించడం కష్టమవుతుందని.. ఆమె ఉంటే అతనికి నెగిటివిటీ పెరుగుతుందని.. తద్వారా విన్నింగ్ రూట్ క్లియర్ అవుతుందని త్రిగుణ్ తదితరులు పక్కాగా స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే పలుమార్లు త్రిగుణ్ కూడా మీ జంట చూడముచ్చటగా ఉందని.. మిమ్మల్ని విడదీసేందుకు నీతూ యత్నిస్తోందని చెబుతూ వచ్చాడు.
మొత్తానికి రోహిత్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా చేసిన కృషి ఫలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రోహిత్ ఒంటరి వాడయ్యాడు. అమన్ కూడా రోహిత్‌కు దూరమవుతున్నాడు. ప్రస్తుతం అతనికి అంతో ఇంతో వైల్డ్ కార్డ్స్ కాస్త దగ్గరవుతున్నారు. అంతకు మించి హౌస్‌లోని సెలబ్రిటీస్ అంతా శత్రువులా చూస్తున్నారు. కేవలం రోహిత్ కెప్టెన్ కాకూడదని స్కెచ్ గీసి మరీ త్రిగుణ్, సుధీర్ నిన్న టాస్క్ ఆడారు. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది.
త్రిగుణ్, సుధీర్‌లకు విపరీతమైన నెగిటివిటీ.. రోహిత్‌కు బీభత్సమైన సింపతి వచ్చేసింది. అది చాలదన్నట్టుగా త్రిగుణ్ ఏదో ఒకరకంగా రోహిత్‌ను ట్రిగ్గర్ చేసే పనిలోనే ఉన్నాడు. ఇవాళ కూడా రోహిత్ బట్టలను తీసి కిందేసి హంగామా చేశాడు. ఇక వీకెండ్లో నాగార్జున సైతం వచ్చి త్రిగుణ్‌ని ఏమీ అనలేదు కానీ రోహిత్‌పై మాత్రం ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.
మొత్తంగా షాలిని బయటకు వెళ్లిపోయిందంటే.. రోహిత్‌ని విన్నర్‌ని కాకుండా అడ్డుకుంటున్న ఒక్కగానొక్క అడ్డంకి తొలగిపోయినట్టే. ఇక వార్ వన్ సైడ్ అవుతుందనడంలో సందేహమే లేదనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
