Menu
BREAKING
ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?   |   నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..   |   ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?   |   Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..   |   Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?   |   నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?   |   ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!   |   అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!   |   ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!   |   Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి   |   Biggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..   |   Biggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..   |   Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…   |   Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ   |   Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?

ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?

హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకప్పుడు తమ సినిమా రిలీజ్ రోజున హీరోలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి చూడాలని ముచ్చటపడ్డాడు. దీనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. సీఎం ఆ విషయాన్ని పోలీసులకు చెబితే, వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్ వైపు నెట్టేసి ఒకరి మీద ఒకరు బాల్ పాస్ చేసుకున్నారు. ఫైనల్ గా ఈ తతంగం అంతా చూసి విసిగిపోయిన నాని, మీ ప్రెజర్ నాకు అర్థమైంది నేను సినిమా చూడనులే అంటూ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్టార్ హీరో తన సినిమా తను చూసుకోవడానికి ఇంతలా బతిమిలాడుకోవాలా అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నాయి.

అసలు పోలీసుల్లో, ప్రభుత్వంలో ఈ రేంజ్ లో భయం మొదలవ్వడానికి మెయిన్ రీజన్ పుష్ప 2 టైమ్ లో జరిగిన ఆ చేదు ఘటనే. పుష్ప 2 రిలీజ్ సమయంలో థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి పెను దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క ఇన్సిడెంట్ తో పోలీసుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా కూడా ఈ ఘటన పెద్ద ఇష్యూ అవ్వడంతో, అల్లు అర్జున్ ఏకంగా ఒక రోజు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి ఒక ప్రాణనష్టం జరిగిన తర్వాత పోలీసులు అలర్ట్ అవ్వడంలో 100 శాతం న్యాయం ఉంది. మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోవడానికి ఏ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా లేదు. అందుకే ఇప్పుడు పర్మిషన్లు అడిగితే పోలీసులకు చెమటలు పడుతున్నాయి.

అయితే ఇక్కడ వస్తున్న అసలు డౌట్ ఏంటంటే, హీరోలు థియేటర్లకు రావడం ఇదేమి మొదటిసారి కాదు కదా? గతంలో ఎంతోమంది స్టార్లు వచ్చి ఫ్యాన్స్ తో పాటు సెలబ్రేట్ చేసుకున్నారు కదా? మరి ఇప్పుడే ఎందుకు ఇన్ని తిప్పలు వస్తున్నాయి? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ప్రాబ్లమ్ అంతా హీరోలు రావడంలో లేదు, వాళ్ళు వచ్చే విధానంలో, చేసే హడావిడిలో ఉంది. మొన్నటికి మొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ది సినిమాను ఎలాంటి హడావిడి లేకుండా నైట్ టైమ్ సైలెంట్ గా థియేటర్ కు వచ్చి చూసుకుని వెళ్ళాడు కదా. అక్కడ ఏ ప్రాబ్లమ్ రాలేదే? ఎవరూ పర్మిషన్లు అడగలేదే? ఎప్పుడైతే హీరోలు ఎలాంటి సందడి లేకుండా వస్తారో, అప్పుడు క్రౌడ్ కంట్రోల్ తప్పుతుందనే భయం ఉండదు, పోలీసులకు టెన్షన్ ఉండదు. ఫ్యాన్స్ తో చూడాలనే ఆరాటం మంచిదే కానీ, ఆ క్రమంలో జరిగే ఓవర్ హడావిడే అసలు సమస్యలకు కారణం అవుతుంది.

పుష్ప 2 ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ చేసిన తప్పు కూడా అదే. విపరీతమైన పబ్లిసిటీతో, వందలాది మంది బౌన్సర్లతో భారీ హడావిడి చేయడం వల్లే అప్పటి పరిస్థితి చేజారిపోయి ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు నాని ప్యారడైజ్ సినిమా కోసం అడిగింది మంచి ఉద్దేశ్యంతోనే అయినా, సిస్టమ్ మాత్రం పాత సంఘటనను మర్చిపోలేకపోతుంది. నాని వస్తే మళ్ళీ ఫ్యాన్స్ ఎగబడతారని, ఇంకో చిన్న ఇన్సిడెంట్ జరిగినా తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందని పోలీసులు భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య ఈ పర్మిషన్ల గేమ్ నడిచింది. ఒకరు ఒకరిపై నెపం నెట్టుకుంటూ ఫైనల్ గా హీరోకే నో చెప్పే పరిస్థితి క్రియేట్ చేశారు. ఒక రకంగా చూస్తే సిస్టమ్ భయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ, ఒక కరెక్ట్ ప్లానింగ్ లేకుండా హీరోలందరికీ నో ఎంట్రీ బోర్డు పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాల్సిన విషయం.

హీరోలకు నిజంగా తమ సినిమాకు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో థియేటర్లలో చూడాలని ఉంటే, ఈ పర్మిషన్లు, ప్రభుత్వాలు, పోలీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. సినిమా స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలకు, థియేటర్ లో అంతా సైలెంట్ అయిపోయి లైట్స్ ఆఫ్ చేశాక, గుట్టుచప్పుడు కాకుండా లోపలికి వెళ్లి కూర్చోవాలి. హాయిగా చీకట్లో సినిమా చూస్తూ ఆడియన్స్ వేసే విజిల్స్, ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఫీల్ అవ్వాలి. ఇక క్లైమాక్స్ కు ఒక 10 నిమిషాల ముందే, లైట్స్ ఆన్ అయ్యే లోపే సైలెంట్ గా బయటకు వెళ్లిపోతే ఏ గొడవా ఉండదు కదా? ఈ చిన్న కామన్ సెన్స్ లాజిక్ వదిలేసి, నేను వస్తున్నాను అంటూ వారం ముందు నుంచి సోషల్ మీడియాలో డప్పు కొట్టి, ఈవెంట్ లాగా మార్చేస్తే కచ్చితంగా ఇలాంటి పర్మిషన్ల తిప్పలు తప్పవు. సైలెంట్ గా వస్తే హీరోలు హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ, పోలీసులకు ప్రశాంతత.. ఈ లాజిక్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.

Pranav

Writer and contributor at Telugu Cinema 360