Menu
BREAKING
Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది. గత వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. రెండు బాక్సులు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టారు. ఎవరు వచ్చి ముందుగా ఆ బాక్సులను ఫస్ట్ ఎవరు ముట్టుకుంటారో వారిని పట్టుకునే వెళ్లే స్కెచ్‌తో వచ్చారు. అది తెలియని షాలిని బాక్సులను ముందుగా ముట్టుకుంది. ఆ వచ్చిన వారు ఆమెను బయటకు తీసుకుని వెళ్లిపోయారు. హౌస్‌లోని వారంతా నోరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. ఇది నిజమా? అంటే జరగడమైతే నిజంగానే జరిగింది కానీ దీనికి పెద్ద స్కెచ్చే ఉందని తెలుస్తోంది.

ఇవాళే చరణ్ మహాదేవ్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీనికోసం చేసిన సన్నాహమే ఇదంతా అని తెలుస్తోంది. షాలినిని బయటకు తీసుకెళ్లి ఆమె ద్వారా చరణ్‌ను హౌస్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అందుకే హౌస్‌లోని వారికి ఏమీ అర్థం కాకుండా అలా తీసుకెళ్లి పోయారు. అయితే హౌస్‌లోని వారు దీనిని కనిపెట్టలేరా? అంటే గత వారం నిజంగానే రెండు ఎలిమినేషన్స్ జరిగాయి కాబట్టి ఈవారం కూడా అలాగే జరిగిందని అనుకునే అవకాశం ఉంది. అసలే ఈసారి షో అన్‌ప్రిడిక్టబుల్ కదా. మొత్తానికి ప్రోమో అయితే బయట చూసే వారికి ఏం జరగబోతోందనేది తెలుస్తూనే ఉంది కానీ హౌస్‌లోని వారికి మాత్రం బిగ్ కన్ఫ్యూజన్ అని చెప్పాలి. ఒక్కొక్కరినీ అయోమయంలో పడేసింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360