
ఇవాళ షోను సింపుల్‌గా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో దేబ్జానిని ముందుగా సేఫ్ చేశారు. కృష్ణార్జునులా.. శకుని, దుర్యోధనులా అనేది తేల్చేద్దామని త్రిగుణ్, వంశీలను గార్డెన్ ఏరియాకు పిలిచారు. ఈ టాస్క్‌కు వర్షిణిని సంచాలక్‌గా పిలిచారు. బ్యాటిల్ రోప్స్ ఇచ్చారు. ముందుగా ఎవరు వదిలేస్తే వారు కెప్టెన్సీ కంటెండర్‌షిప్ నుంచి తొలగుతారు. వంశీ ముందుగా రోప్ వదిలేశాడు. త్రిగుణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సేమ్ గేమ్‌ను ఫన్నీగా వర్షిణితో ఆడించారు. దానికి నరేష్ సంచాలక్. వర్షిణి కూడా బాగానే ఆడింది. అదేదో తనకు వచ్చిన టాస్క్‌ల్లో ఆడి ఉంటే ఆమెకు చాలా ప్లస్ అయ్యి ఉండేది. ఆ తరువాత తన సినిమా ‘మైసా’ ప్రమోషన్ కోసం రష్మిక వచ్చింది. మూవీ ట్రైలర్ చూశాక కంటెస్టెంట్స్ ముందుకు వెళ్లారు. వర్షిణి ఎన్ని నిమిషాల పాటు బ్యాటిల్ రోప్ చేసిందని అడిగి.. ఆమెను ఇన్స్పైర్ చేయడం కోసం హీరోయిన్ను తీసుకొచ్చానని చెప్పి రష్మికను కంటెస్టెంట్స్ ముందుకు తీసుకెళ్లారు.
ముఖేష్ కన్నడలో రష్మికతో మాట్లాడగా.. దేబ్జాని బెంగాలీలో మాట్లాడింది. అన్ని భాషల్లో విజయ్‌కు లవ్ యూ చెప్పానని రష్మిక చెప్పింది. అమన్ తమ ఫ్రెండ్స్ అంతా విజయ్ అన్న.. రష్మిక వదిన అని పిలుచుకుంటామని చెబితే ఆ డిస్టెన్స్ ఎందుకు రషి అని పిలవొచ్చుగా అని సరదాగా చెప్పింది. సండే ఫన్డేలో భాగంగా.. కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించి.. డైలాగ్ వస్తే ఆ సినిమా గురించి చెప్పాలన్న గేమ్ ఆడించారు. నీతూతో కలిసి ఆర్కే డ్యాన్స్ చాలా ఫన్నీగా చేశాడు. ఆ డ్యాన్స్ చూసి అంతా ఎంజాయ్ చేశారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను ‘గీత గోవిందం’ చేయడానికి ముందు చూశానని.. వామ్మో ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ రష్మిక చెప్పింది. నెక్ట్స్ ముఖేష్, వంశీని నామినేషన్స్ నుంచి సేఫ్ చేశారు. తరువాత రష్మిక వెళ్లిపోయింది. నెక్ట్స్ బాడీ అండ్ బ్రెయిన్ అంటూ రామ్ ప్రసాద్, నరేష్‌కు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు దేబ్జాని సంచాలక్. రామ్ ప్రసాద్ ఈ టాస్క్ విన్ అయి నెక్ట్స్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.

నెక్ట్స్ నామినేషన్స్ నుంచి శివ, రామ్ ప్రసాద్ సేఫ్ అయ్యారు. ఆ తరువాత అమన్, శివకు టాస్క్ ఇచ్చారు. నరేష్ సంచాలక్. జస్ట్ ఫ్యూ సెకన్స్ గ్యాప్‌తో టాస్క్ శివ విన్ అయ్యాడు. నెక్ట్స్ నామినేషన్స్ నుంచి రామకృష్ణ, వర్షిణి సేఫ్ అయ్యారు. నెక్ట్స్ నీతూ, దేబ్జాని మధ్య టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో దేబ్జాని విన్ అయ్యింది. ఆ తరువాత నామినేషన్స్ నుంచి అమన్ సేవ్ అయ్యాడు. ఇవాళ అమన్ సేవ్ అవడంతో నేరుగా టికెట్ టు ఫినాలేకు వెళ్లాడు. ఇక ఆర్కే, సుధీర్ మధ్య టాస్క్ జరిగింది. దీనికి వర్షిణి సంచాలక్. ఈ టాస్క్‌లో ఆర్కే గెలిచి నెక్ట్స్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. నెక్ట్స్ నామినేషన్స్‌లో ఉన్న నీతూ, సుధీర్లను డాన్యూబ్ రూమ్‌లోకి పిలిచారు. ఇద్దరికీ కళ్లకు గంతలు కట్టారు. ఆ తరువాత ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు తీసుకొచ్చారు. అందరూ బాగా ఆడాలని సుధీర్ చెప్పాడు. గతంలో అయితే బాధపడ్డాను కానీ ఇప్పుడు బాధ లేదని ఆనందంగా వెళుతున్నానని సుధీర్ చెప్పాడు. నీతూ కూడా అందరికీ బాగా ఆడాలని చెప్పింది. ఇక హౌస్‌లోకి మారుతి సుజుకి విక్టోరియస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ హారర్ ఎడిషన్ వచ్చింది. దానిలో సుధీర్, నీతూలను కూర్చోబెట్టారు. వెహికిల్ బయటకు వెళ్లి ఒకరితోనే తిరిగి వస్తుందని నాగ్ చెప్పారు.

నరేష్‌ను ఇప్పుడేం జరుగుతుందని నాగ్ అడిగారు. సుధీర్ వస్తాడని చెప్పారు. వర్షిణి, ముఖేష్, దేబ్జాని, త్రిగుణ్, శివ్, అమన్, ఆర్కే వచ్చేసి నీతూ వస్తారని చెప్పారు. మిగిలిన వాళ్లలో నరేష్, వంశీ, రామ్ ప్రసాద్ సుధీర్ వస్తాడని చెప్పారు. సుధీర్ హౌస్‌లోకి వచ్చాడు. ఎంతకొట్టినా చావని పాము వాడని రామ్ ప్రసాద్ చెప్పాడు. నీతూ స్టేజ్‌పైకి వచ్చింది. హ్యాపీ టియర్స్తో వచ్చానని.. తను హౌస్‌లో ఉండలేకపోయానని… వెళ్లిపోదామనే కోరుకున్నట్టుగా నీతూ చెప్పింది. ఇక నీతూ జర్నీ చూశారు. ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్‌తో ఆమె జర్నీ ఉంది. హౌస్‌లో ఉన్నంత సేపు శివంగిలా ఆడావంటూ నాగ్ ఫుల్ బూస్ట్ ఇచ్చారు. ఫుల్ ట్యాంక్.. ఎమ్టీ ట్యాంక్ టాస్క్ నీతూకి నాగ్ ఇచ్చారు. అమన్, శివ, త్రిగుణ్‌లకు ఫుల్ ట్యాంక్, వర్షిణి, సుధీర్, ముఖేష్‌లకు ఎమ్టీ టాస్క్ ఇచ్చారు. గేమ్ ట్రాక్ తప్పుతున్నట్టుగా అనిపిస్తోందని.. ఎక్కడో ఆలోచిస్తున్నారని ముఖేష్‌కు నీతూ చెప్పింది. తాను ఉండలేకపోతున్నానని మనస్ఫూర్తిగా వెళ్లిపోవాలని కోరుకున్నట్టుగా నీతూ చెప్పి వెళ్లిపోయింది. ఇక నాలుగు వారాలే ఉందని.. కలబడండి.. నిలబడండి అని నాగ్ చెప్పారు. బిగ్‌బాస్ సీజన్ 10లో నెక్ట్స్ వీక్ దశావతారంలో ‘బడ్డీ అప్’.
