Menu
BREAKING
Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..

Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..

Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..

వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివ్‌కు ఎవరు సలహాలిచ్చారో ఏమో కానీ ఒక చెత్త గేమ్‌కు తెరదీశాడు. ముందుగా వచ్చినప్పుడు రోహిత్‌ను టార్గెట్ పెట్టుకుని వచ్చాడనేది క్లియర్. ఆ సమయంలోనే త్రిగుణ్‌తో జత కలిశాడు. త్రిగుణ్ టీంలోనే కొనసాగుతున్నాడు. రోహిత్ వెళ్లిపోయిన తర్వాత కూడా త్రిగుణ్ టీంలోనే ఉన్నాడు. వారితో మంచిగా ఉంటూనే అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడకు మోస్తూ హాట్ టాపిక్ అయిపోయాడు. అయితే అలా కొనసాగితే బాగానే ఉండేది కానీ త్రిగుణ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ‘రివార్డ్ అండ్ రివెంజ్’లో తను త్రిగుణ్‌పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నట్టుగా చెప్పి అతను ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హుడు కాదని అతని పేరు రాశాడు.

అమన్ కూడా త్రిగుణ్ పేరు రాశాడు కానీ నేరుగా వెళ్లి అతనితోనే చెప్పాడు. అయితే తన పేరు అమన్ రాశాడని తెలిసినప్పుడు త్రిగుణ్ వచ్చి శివతోనే నేరుగా ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత మరో సందర్భంలో కూడా చెప్పాడు. కానీ శివ మాత్రం తను కూడా త్రిగుణ్ పేరే రాశాననేది బయటకు రానివ్వలేదు. కానీ తాజాగా విషయం త్రిగుణ్‌కు తెలిసిపోయింది. తనతో శత్రుత్వమున్న ముఖేషే తన పేరు రాయలేదు కానీ శివ ఎలా రాస్తాడని.. తన కూతురి కోసం ఎంతగా తపిస్తున్నానో కూడా అతనికి తెలుసని కెమెరా ముందు ఫైర్ అయ్యాడు. ప్రస్తుతానికి కూల్‌గానే ఉన్నా తరువాత మాత్రం ఊరుకునేలా కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన శివ్ ఆడాల్సిన గేమ్ కాదది.

వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు. దీంతో అతనికి ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ తరుణంలో వచ్చిన అతని ప్రియురాలు ప్రియాంక జైన్ మాత్రం అతనికి రియాల్టీని వివరించలేదు. ‘నీ గేమ్ చాలా బాగుంది. అందరూ బాగా మెచ్చుకుంటున్నారు’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. తను ఆడుతున్నదే కరెక్ట్ అనుకుని శివ్ ఇదే గేమ్ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తే త్వరలోనే హౌస్ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చి అతని ఆటను ప్రియాంకే ప్రమాదంలోకి నెట్టేసింది. అసలే ఓటింగ్ పరంగా.. ఐసీయూలో ఉన్నాడు శివ్.. ఇదే కంటిన్యూ అయితే ఇక నెక్ట్స్ వెంటిలేటర్‌పైకే.. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Pranav

Writer and contributor at Telugu Cinema 360