Categories: Uncategorized

Biggboss10 Telugu: రచ్చ లేపిన ఫుడ్ గొడవ.. కెప్టెన్సీ టాస్క్ వేరే లెవల్..

బిగ్‌బాస్ 10 తెలుగు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు మిత్రులవుతారో.. ఎవరెవరు శత్రువులవుతారో తెలియకుండా ఉంది. ఇవాళ (బుధవారం) బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ లెవల్ టు జరిగింది. యానిమల్ బ్లాక్స్ ఇచ్చారు. వాటిని ఒకరు యాక్షన్ చేసి చూపిస్తే మరొకరు అదేంటో కనుక్కుని బ్లాక్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కెప్టెన్సీ రేస్‌లో నిలుస్తారు. ఓడిన వారిలో ఒకరిని తీసేసే అధికారం గెలిచిన వారికి ఉంటుంది. ముఖేష్, ఝాన్సీ ఒక జంట.. షాలిని, అమన్ జంటగా గేమ్ ఆడారు. ఝాన్సీ బాగా కన్వే చేసింది కానీ అమన్ కన్వే చేయలేకపోయాడు. దీంతో ఈ గేమ్‌లోఝాన్సీ, ముఖేష్ గెలిచారు. అమన్‌ను టాస్క్ నుంచి తొలగించారు.

అమన్ కరెక్ట్‌గా చెప్పకపోవడం వల్ల అమన్‌ను తొలగించారని చెప్పడంతో అతను షాలిని హైట్ కారణంగా.. అలాగే ఆమె అర్థం చేసుకోకపోవడం వల్ల ఓడిపోయి ఉండవచ్చుగా అన్నాడు. దీంతో షాలిని ఫైర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. త్రిగుణ్, వంశీ మధ్య నిన్న షాలిని వర్సెస్ వర్షిణి మధ్య జరిగిన గొడవ గురించి చర్చ జరిగింది. షాలినిని వర్షిణి టచ్ చేయడంపై తాను ప్రశ్నిస్తానని చెప్పాడు. మూడింటి వరకూ పక్కన పడుకుని గుసగుసలాడుకుంటున్నారని వంశీ అన్నాడు. వర్షిణి ఫేర్ గేమ్ ఆడలేదని త్రిగుణ్ చెప్పాడు. షాలినికి అక్కడ అన్‌ఫెయిర్ అయ్యిందని తాను ప్రశ్నించానని చెప్పాడు. వర్షిణి.. ముఖేష్‌కి సపోర్ట్‌గా ఆడుతోంది చూసుకోమని షాలినికి చెప్పానని సృష్టికి త్రిగుణ్ చెప్పాడు. అది కూడా గొడవకు దారి తీసిందనేది అతని భావన. ఉదయం త్రిగుణ్, వర్షిణి మధ్య ముఖేష్ గురించి చర్చ జరిగింది. రోహిత్‌కి సపోర్ట్ చేస్తే ఓకే.. షాలిని దూరం పెడుతోంది. సృష్టి నమ్మడం లేదు. దీంతో కొత్త గ్రూప్ తయారు చేయాలని రోహిత్ చూస్తున్నాడని వర్షిణికి త్రిగుణ్ చెప్పాడు. త్రిగుణ్‌కి అనుకూలంగా ఏదైనా జరిగితే అది కరెక్ట్ అని వర్షిణి.. త్రిగుణ్ గురించి ముఖేష్, దేబ్జానికి చెప్పింది. ఫ్లిప్ చేసే దానిలో స్ట్రాంగ్ అని ముఖేష్.. దొరికిపోతున్నాడని వర్షిణి చెప్పింది.

మొత్తానికి త్రిగుణ్‌పై హౌస్ మొత్తం దాదాపుగా నెగిటివిటీ నడుస్తోంది. ఫుడ్ అందరికీ సమానంగా రావాలని దేబ్జాని చెప్పింది. ఫుడ్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. నలుగురికి వెజ్ అని చెప్పడంతో వారి వరకే చేశామని వంశీ అన్నాడు. కృష్ణుడికి బాగోలేదని కాస్త ఇచ్చామని చెప్పాడు. ముఖేష్ ముందు చెప్పకుండా వచ్చి వెజ్ అడగటంతో లేదన్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది. ముఖేష్ తరుఫున వర్షిణి పంచాయతీకి వచ్చింది. వర్షిణి వర్సెస్ వంశీ పెద్ద గొడవ జరిగింది. ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తారని వర్షిణి.. ఎవరి మీదో ప్రేమ.. ఎవరి మీదో చూపిస్తారో అని వర్షిణి చెప్పింది. ఇక మీదట వెజ్, నాన్‌వెజ్ లేదని.. ఎవరికి ఆకలేస్తే వారు వండుకుని తినాలని వంశీ చెప్పాడు. ఆయిల్ పడేశాడని వంశీ అంటే తానేమీ కావాలని చెయ్యలేదని పొరపాటున పడిపోయిందని వంశీ బాగా ఫైర్ అయ్యాడు. మొత్తానికి ఫుడ్ కోసం గొడవ గట్టిగానే జరిగింది. తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నావని వర్షిణిని త్రిగుణ్ అడిగాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్.. ఉదయం ముఖేష్ తన గురించి ఏమైనా అడుగుతున్నాడా? అని త్రిగుణ్ అడిగాడని ముఖేష్, వర్షిణిలకు చెప్పాడు.

ఆడవాళ్లతో కూర్చొని మాట్లాడుతున్నాడని ముఖేష్‌ను త్రిగుణ్ అన్నాడు. దీనికి వెనుకాల నుంచి నడిపిస్తున్నావని ముఖేష్ అన్నాడు. దీంతో వంశీని పిలిచి ‘నిన్ను వెనుక నుంచి నేను నడిపిస్తున్నానా?’ అని త్రిగుణ్ అడిగాడు. వంశీ ఎవరన్నారు ఆ మాట.. అంటూ ఫైర్ అవుతూ వచ్చాడు. దేబ్జాని వచ్చి ఆయిల్ ప్రాబ్లమ్ ఉందని.. కాబట్టి ఆమ్లెట్ వద్దని ఎగ్ బాయిల్ చేసుకోమని ముఖేష్, వర్షిణికి చెప్పింది. లెవల్ 2లో మరో నలుగురికి కెప్టెన్సీ టాస్క్ బిగ్‌బాస్ నిర్వహించారు. లెవల్ 2లో ఫిజికల్ ఛాలెంజ్ ఎదుర్కోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. బజర్ మోగినప్పుడల్లా పై నుంచి బ్యాగ్స్ పడుతుంటాయి. వాటిని చేజిక్కించుకోవాలి. మళ్లీ బజర్ మోగే సమయానికి ఎవరి చేతిలో బ్యాగ్ ఉంటుందో వారు.. దానిలోని బాల్స్‌తో ఉపయోగించాలి. వాటితో ఫ్రేమ్‌లో అమర్చిన డిస్క్‌లను పడగొట్టాలి. ఎవరు ఎక్కువ పడగొడితే ఆ జంట విన్ అవుతారు. రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఒక టీమ్.. రోహిత్, దేబ్జాని ఒక టీమ్‌గా గేమ్ ఆడారు. ఫస్ట్ రోహిత్ పట్టుకున్నాడు. దేబ్జాని వచ్చేసి త్రిగుణ్‌ని హోల్డ్ చేసింది. రోహిత్ వదలకుండా బ్యాగ్ పట్టుకున్నాడు. రోహిత్, దేబ్జాని ఈ గేమ్‌లో అదరగొట్టారు. చాలా బాగా పోరాడారు. సెకండ్ రౌండ్‌లో త్రిగుణ్ టీం గెలిచింది. అయితే దేబ్జాని కూడా బ్యాగ్‌ను పట్టుకుంది. దీనికి వంశీని రోహిత్ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

టాస్క్ ప్రారంభానికి ముందే రోహిత్‌ను త్రిగుణ్ అడ్డగించాడు. రోహిత్ ఎంత చెబుతున్నా కూడా వంశీ వినలేదు. అదేంటంటే.. వంశీ గొడవకు దిగాడు. రోహిత్ మీద మీదకు వంశీ వెళ్లిపోయాడు. వాడికి నచ్చినట్టే ఆడాలి అనడంతో ఏయ్ అన్నావని.. ఆడరా అని వంశీ బాగా మాటలు బాగా జారాడు. అరిస్తే ఎనర్జీ పోతుందని రోహిత్‌కు అమన్ హితబోధ చేశాడు. ఆ తరువాత మళ్లీ బజర్ మోగింది. దేబ్జాని చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలా బాగా ఆడింది. కానీ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని హోల్డ్ చేయడమంటే మాటలు కాదు. అయినా కూడా ది బెస్ట్ ఇచ్చింది. మరోవైపు రోహిత్ కూడా చాలా బాధ పడ్డాడు. మరో బజర్ మోగింది. దేబ్జాని బ్యాగ్ పట్టుకుంది. జస్ట్ ఒకే ఒక్కటి తేడాతో ఓడిపోయారు. రోహిత్, దేబ్జాని పోరాడి ఓడారు.

ఇవాళ బిగ్‌బాస్‌లో ఫుడ్ కోసం తీవ్రంగా గొడవ జరిగింది. ఇక కెప్టెన్సీ టాస్క్ అయితే వేరే లెవల్. బీభత్సంగా గొడవ జరిగింది. మాటల యుద్ధమే కాదు.. ఫిజికల్‌గా కూడా గట్టిగానే గొడవ జరిగింది. దేబ్జాని, రోహిత్ టీం ఓడిపోవడంతో వారి నుంచి ఒకరు తప్పుకోవాలి. అయితే రోహిత్, దేబ్జాని నాకంటే నాకంటూ గొడవపడ్డారు. డెసిషన్‌ను బిగ్‌బాస్‌కు వదిలేశారు. బిగ్‌బాస్ వచ్చేసి గెలిచిన త్రిగుణ్, రామ్ ప్రసాద్ చేతిలో పెట్టడంతో వారు రోహిత్‌ను తప్పించి దేబ్జానిని కెప్టెన్సీ కంటెండర్ రేస్‌లో నిలిపారు. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విన్ అవుతారో చూడాలి.

Telugu Cinema 360

Recent Posts

నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?

నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్…

4 hours ago

నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?

బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…

14 hours ago

విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…

15 hours ago

Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..

బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు.…

15 hours ago

విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా…

16 hours ago

సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ ఎప్పుడూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది.…

16 hours ago