Categories: Uncategorized

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి చరణ్.. ఎంట్రీ ఎప్పుడంటే..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎవరూ బయటకు పోయింది దాదాపుగా లేదు. 10వ సీజన్‌లో మాత్రం ఆర్‌జే చరణ్ మహాదేవ్, చైత్ర ఇద్దరూ వెళ్లిపోయారు. అది కూడా తొలివారమే. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరిలో ఒకరిని ప్రేక్షకుల ఓటింగ్‌తో హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్‌బాస్ టీం భావించింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర ఇద్దరూ తమకు ఓటు చేయాలని సోషల్ మీడియాలో వీడియో సందేశాలు పెట్టారు. అయితే హౌస్‌లోకి వచ్చే ఛాన్స్ చరణ్‌కే ఉంది. కేవలం ప్రేక్షకుల ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే చరణ్ ఎంట్రీ ఖాయమే. లేదంటే హౌస్‌మేట్స్ ఓట్ల ద్వారా వెళితే చైత్ర ఇంట్లోకి అడుగు పెట్టవచ్చు.

అయితే ప్రేక్షకుల ఓటింగ్ తీసుకుని ఆ తరువాత కంటెస్టెంట్ల ఓట్స్‌తోనే అంటే బయట వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రేక్షకుల ఓట్లే ఫైనల్ అనుకోవాలి. ప్రస్తుతానికి హౌస్‌లో సెలబ్రిటీల కంటే కామనర్స్‌కే ఓటింగ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఓటింగ్‌లో టాప్‌లో రోహిత్ ఉన్నాడు. రోహిత్ ఫ్యాన్స్ అంతా చరణ్‌కు ఓటు చేస్తారు. అలాగే చరణ్‌కి కూడా ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. ఇది కూడా అతని ప్లస్ కానుంది. ఇవాళ రాత్రికే ఓటింగ్ పోల్స్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం 12 గంటల పాటే పోలింగ్ లైన్స్ తెరిచి ఉంటాయని టాక్. హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అది రేపటి వరకూ జరిగే అవకాశం ఉంది. చరణ్‌ని నేరుగా కెప్టెన్సీ కంటెండర్‌ని చేసి హౌస్‌లోకి పంపించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి చరణ్ ఎంట్రీ ఇస్తే రోహిత్‌కు ప్లస్ ఉన్నాయి.. మైనస్‌లు ఉన్నాయి.

చరణ్ హౌస్‌లోకి అడుగు పెడితే ఏదో ఒకరకంగా ప్రతి ఒక్కరికీ హింట్స్ అయితే అందుతాయి. అలా హింట్స్ అందుకున్న కామనర్స్.. బయట సెలబ్రిటీలకు యాంటీగా ఉందని తెలిస్తే రెచ్చిపోయే అవకాశం ఉంది. అలా రెచ్చిపోయారో మొదటికే మోసం వస్తుంది. లేదు.. హింట్స్ తీసుకుని తమ ఆట తీరును మార్చుకుని జాగ్రత్తగా స్టెప్స్ వేస్తే ప్లస్ కానుంది. ముఖ్యంగా ప్రస్తుతం రోహిత్ టాప్‌లో ఉన్నాడు. గత వారం తరువాత పరిస్థితులు మారుతున్నాయి. ఈ సమయంలో రోహిత్ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇష్టానుసారంగా.. ఆలోచన లేకుండా అడుగులు వేస్తే టాప్ నుంచి కిందకు పడిపోయే అవకాశం ఉంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Telugu Cinema 360

Recent Posts

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…

2 hours ago

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…

13 hours ago

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…

13 hours ago

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…

13 hours ago

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…

24 hours ago

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

2 days ago