సౌత్ ఇండియాలో సినిమాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే తెల్లవారుజామునే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒకప్పుడు తమిళనాడులో కూడా మన తెలుగు రాష్ట్రాల తరహాలోనే ఉదయం ఎర్లీ మార్నింగ్ షోలు ఉండేవి. ఫ్యాన్స్ అంతా కలిసి తెల్లవారుజామునే థియేటర్ల దగ్గర పెద్ద జాతర చేసేవారు. అయితే 2023 సంక్రాంతి బరిలో విజయ్ వారిసు, అజిత్ తునివు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య జరిగిన హంగామాలో దురదృష్టవశాత్తు ఒక అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి తమిళనాడులో ఈ ఎర్లీ మార్నింగ్ షోలకు బ్రేక్ పడింది.
అభిమాని మరణంతో కఠిన నిర్ణయాలు తీసుకున్న అప్పటి ప్రభుత్వం, తెల్లవారుజామున షోలను పూర్తిగా బ్యాన్ చేసింది. దాంతో అప్పటి నుంచి తమిళనాడులో ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా ఉదయం 9 గంటల తర్వాతే మొదటి ఆట పడేది. అయితే ఇప్పుడు దళపతి విజయ్ ఆధ్వర్యంలోని TVK ప్రభుత్వం సినీ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎర్లీ మార్నింగ్ షోల కోసం ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న కోలీవుడ్ సినీ ప్రియుల కలలను నిజం చేస్తూ తాజాగా ఒక కొత్త జీవోను పాస్ చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే, రిలీజ్ అయిన మొదటి వారం రోజులు ఉదయం 6 గంటల నుంచే షోలు వేసుకునేందుకు TVK ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2:30 వరకు థియేటర్లు రన్ చేసుకోవచ్చని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఈ GOతో కేవలం ఎర్లీ మార్నింగ్ షోలు మాత్రమే కాదు, థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లకు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది విజయ్ ప్రభుత్వం. మామూలుగా అయితే రోజుకు నాలుగు లేదా ఐదు షోలు మాత్రమే వేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు వీకెండ్స్ తో పాటు ఫెస్టివల్స్, పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో థియేటర్లలో ఏకంగా ఆరు షోలు వేసుకునేందుకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. దీనివల్ల పెద్ద సినిమాలకు మొదటి వారాంతంలోనే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ కు ఎర్లీ మార్నింగ్ షోల కిక్ ఇస్తూనే, ఇండస్ట్రీ బాక్సాఫీస్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చేలా టీవీకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి.
ఒక పక్క థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ షోలకు, ఆరు ఆటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ప్రభుత్వం, మరో విషయంలో మాత్రం సామాన్య ప్రేక్షకులకు అండగా నిలిచింది. అదేంటంటే, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ను విజయ్ ప్రభుత్వం నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. ఈ నిర్ణయం పట్ల సగటు సినీ ప్రియులు, ఆడియన్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. షోలు పెంచడం వల్ల నిర్మాతలకు, థియేటర్ల వాళ్లకు లాభం చేకూరితే, టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పడకుండా సేవ్ అవుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది రెండు వర్గాలకు సూపర్ న్యూస్ అని చెప్పాలి.
ఈ కొత్త GO వచ్చిన తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎర్లీ మార్నింగ్ షోల సందడి మళ్లీ మొదలుకాబోతోంది. చాలా గ్యాప్ తర్వాత ఈ ఉదయం 6 గంటల షోల ఫెసిలిటీని వాడుకోబోతున్న మొదటి స్టార్ హీరోగా సూర్య నిలవబోతున్నాడు. ఈయన హీరోగా నటించిన కొత్త సినిమా సీన్ ఈ GO పాస్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మేజర్ కోలీవుడ్ రిలీజ్. దీంతో సూర్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ దొరికినట్లు అయింది. ఉదయం 6 గంటలకే తమ అభిమాన హీరో సినిమాను సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామని వాళ్లంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. మొత్తానికి విజయ్ తీసుకున్న ఈ డైనమిక్ డెసిషన్ తో తమిళనాట థియేటర్ల దగ్గర మళ్లీ పాత కళ తిరిగి రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పెయిర్స్ మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున,…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఆయన రియల్ లైఫ్‌కు భలే సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్…
మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్…
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి…
బిగ్‌బాస్ 10 తెలుగు కంప్లీట్‌గా గ్రూప్‌ల మీదే నడుస్తోంది. ప్రస్తుతం అయితే పది మంది ఒక గ్రూప్ అదే త్రిగుణ్…
మెగా అభిమానులకు త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ…