టాలీవుడ్లో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం, స్టార్లుగా ఎదగడం చాలా కామన్. వారసత్వం అనగానే అందరి దృష్టి వెంటనే కొడుకుల వైపే వెళ్తుంది కానీ, కూతుర్ల విషయానికి వస్తే మాత్రం సీన్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సందర్భాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే అదొక పెద్ద సవాల్. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, సీనియర్ నటి ఊహల గారాల పట్టి మేధ మేక హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శ్రీకాంత్ వారసురాలిగా ఎంట్రీ ఇస్తున్న మేధ, గ్లామర్ ఫీల్డ్‌లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఆ పాత సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందిప్పుడు.
మేధ మేక ఎంట్రీ ఏదో చిన్న బ్యానర్లో కాకుండా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేతుల మీదుగా జరుగుతుండటం విశేషం. జై జాస్తి హీరోగా, మేధ మేక హీరోయిన్గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లాంచ్ అయింది. ఈ సినిమాతో పృథ్వీ వనం దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఈ కొత్త జంటపై మంచి క్యూరియాసిటీని పెంచింది. మైత్రీ లాంటి పెద్ద బ్యానర్ అండ, మంచి టెక్నికల్ టీమ్ ఉండటంతో మేధ ఎంట్రీ చాలా గ్రాండ్‌గానే ప్లాన్ చేశారని అర్థమవుతోంది.
అయితే టాలీవుడ్ హిస్టరీ చూసుకుంటే స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్లుగా సక్సెస్ అయిన ట్రాక్ రికార్డ్ పెద్దగా కనిపించదు. గతంలో నటశేఖర కృష్ణ కూతురు మంజుల, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి, నాగబాబు కూతురు నిహారిక లాంటి వాళ్లు సినిమాల్లోకి వచ్చారు. నటన పరంగా వాళ్లు మంచి మార్కులు వేయించుకున్నా, కమర్షియల్ హీరోయిన్లుగా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక్కడి ఆడియన్స్ మైండ్‌సెట్ కూడా మన స్టార్ హీరోల కూతుర్లను గ్లామరస్ రోల్స్‌లో చూడటానికి పెద్దగా యాక్సెప్ట్ చేయదు అనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. ఇలాంటి ఎన్నో లెక్కలు, సెంటిమెంట్స్ ఉన్న ఈ ఇండస్ట్రీలో మేధ ఎలాంటి కథలు ఎంచుకుంటుంది, తనకంటూ ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది అనేది ఆమె కెరీర్‌ను డిసైడ్ చేస్తుంది.
ఒకవైపు తెర మీద సక్సెస్ కోసం మేధ లాంటి వాళ్లు రెడీ అవుతుంటే, టాలీవుడ్లో మరో ట్రెండ్ కూడా సైలెంట్‌గా నడుస్తోంది. అదేంటంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసురాళ్లు ఇప్పుడు తెరవెనక తమ తండ్రులకు అతి పెద్ద బలంగా మారుతున్నారు. హీరోయిన్లుగా కెమెరా ముందుకు రాకపోయినా, ప్రొడక్షన్ వ్యవహారాలు, కథల ఎంపిక, స్టైలింగ్ లాంటి విషయాల్లో తమ తండ్రుల కెరీర్‌ను వాళ్లే దగ్గరుండి గైడ్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ స్టార్ హీరోల సక్సెస్‌లో ఈ వారసురాళ్లు కీ రోల్ ప్లే చేస్తున్నారు. బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా, తండ్రుల ఇమేజ్ మార్చడంలో, వాళ్ల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫైనల్ చేయడంలో ఈ కూతుర్లదే ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన టాలీవుడ్ సీనియర్ హీరోలే. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 నుంచి ఆయన స్టైలింగ్, కాస్ట్యూమ్స్ అన్నీ ఆయన పెద్ద కూతురు సుష్మితనే చూసుకుంటున్నారు. అలాగే నిర్మాతగా కూడా మారి నాన్న వెంటే ఉంటున్నారు. ఇక నటసింహం బాలకృష్ణ ఇమేజ్ను అఖండ నుంచి పూర్తిగా మార్చేసి, ఆయన కథల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తోంది ఆయన చిన్న కూతురు తేజస్విని. అటు మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే, ఆయన కూతురు మోక్షద కూడా ఇప్పుడు నాన్న వెంటే ఉంటూ కథల ఎంపికలో తన వంతు సాయం చేస్తోంది. రీసెంట్గా రవితేజ కొత్త సినిమా తులాభారం ఓపెనింగ్‌లో కూడా మోక్షద సందడి చేసింది. ఇలా వారసురాళ్లంతా తెరవెనక తండ్రులకు స్టార్డమ్ తీసుకొస్తుంటే, శ్రీకాంత్ కూతురు మేధ మాత్రం హీరోయిన్గా తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగింది. మరి ఈమె రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్…
సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ…
బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట…