సినిమా వార్తలు

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ZEE5 ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ప్లాట్‌ఫామ్ తెలిపింది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. హృదయాన్ని హత్తుకునే కథ, బలమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలను అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో తన కుటుంబం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఓ వితంతువు తల్లి కథను చూపించారు. నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె మరోసారి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటుంది. అయితే సమాజం, బంధువులు, గ్రామస్థుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. అలాంటి సమయంలో తన తల్లి ఆనందమే ముఖ్యమని భావించి ఆమె నిర్ణయానికి అండగా నిలిచే కుమారుడి పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

మాతృత్వం, త్యాగం, కుటుంబ బంధాలు, మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం విధించే పరిమితులు వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే భావోద్వేగ అనుభూతిని ఓటీటీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ‘పరిమళ & కో’తో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు ZEE5, ఇప్పుడు ‘వంద దేవుళ్లు’తో మరో హృదయాన్ని తాకే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రం ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pranav

Recent Posts

వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..

వీకెండ్ హడావిడి పూర్తయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలు నిజాలు మాట్లాడుకునే సమయం వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు…

5 hours ago

జనసేన మరోసారి 100 % స్ట్రైకింగ్.. పురం ఎన్నికల్లోనూ పవన్ ప్రభంజనం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది, అదే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సైలెంట్ గా…

5 hours ago

హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!

సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పెయిర్స్ మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున,…

1 day ago

ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!

సౌత్ ఇండియాలో సినిమాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా హీరోల సినిమాలకు…

1 day ago

మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఆయన రియల్ లైఫ్‌కు భలే సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్…

1 day ago

పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్…

1 day ago