
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు. ముఖేష్ చేసిన తప్పులను ఏదో టచ్ చేయాలన్నట్టుగా టచ్ చేశారు. పూర్తిగా తప్పులను సైతం ఎత్తి చూపలేదు. పైగా ప్రశంసలు కురిపించారు. దీంతో ముఖేష్‌కు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. తను చేస్తున్నంతా బయటకు చాలా పాజిటివ్‌గా వెళుతోందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. దీంతో నామినేషన్స్ విషయంలో చెలరేగిపోయాడు. మరోవైపు వర్షిణి కూడా ఏమాత్రం తగ్గలేదు. అసలు ఇప్పటి వరకూ వర్షిణి చేసిన తప్పులను నాగ్ ఎత్తి చూపించింది కూడా లేదు. ఎందుకో ఆమెను, దేబ్జానిని బిగ్‌బాస్ టీం బాగా వెనుకేసుకొస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి.
ఆ ప్రోమోలను బట్టి చూస్తే ముఖేష్, వర్షిణి ప్రవర్తన చాలా చిరాకు పెట్టించేలా ఉంది. డ్యాన్సులు చేస్తున్నాడు.. ఇష్టానుసారంగా మాట్లాడారు. అపూర్వను ముఖేష్ నామినేట్ చేశాడు. ఆమె డిఫెండ్ చేసుకుంటుంటే.. చాలా వెటకారంగా మాట్లాడుతూ.. డ్యాన్సులు చేస్తూ నానా హంగామా చేశాడు. అపూర్వ తనను తాను డిఫెండ్ చేసుకుంటుంటే వర్షిణి వెళ్లి అపూర్వకు ముఖేష్ కనిపించికుండా మధ్యలో నిలబడింది. అలాగే వర్షిణి.. రోహిత్‌ను నామినేట్ చేస్తూ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ‘నువ్వు నన్ను చాలా చాలా హర్ట్ చేశావు’ అని చెప్పింది. హ్యుమానిటీ బేసిస్‌లో నువ్వు ఆలోచించలేదు. అని చెప్పింది. ఈ సమయంలో వర్షిణి కూడా చాలా యాటిట్యూడ్‌తో బిహేవ్ చేసింది. రోహిత్‌తో మాట్లాడలేక.. పాయింట్స్ పెట్టలేక చాలా రూడ్‌గా అతని కుండను పగులగొట్టి.. నామినేషన్ చేసి వెళ్లెళ్లు.. కూర్చో అంటూ చాలా వెటకారంగా మాట్లాడింది. ఇద్దరిపై నెట్టింట ఇప్పటికే బీభత్సంగా ట్రోల్స్ వస్తున్నాయి. వీరిద్దరి ప్రవర్తన ఇలాగే ఉంటే బయటకు వచ్చేందుకు పెద్దగా సమయం పట్టనట్టే ఉంది.
