
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో రోహిత్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. జనాల్లో అతనికి ఏమాత్రం క్రేజ్ లేదని భావించినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా కామనర్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న భావనలో ఉన్నారు. సుధీర్, ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, ఝాన్సీలను నాగ్ అసలు ఏమీ అనలేదు. పైగా కొందరిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో నాగ్ మాటలు.. ప్రేక్షకుల మాటల్లా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నామినేషన్స్‌లో కామనర్స్‌ని అవమానించేందుకు కూడా ఏమాత్రం వెనుకాడ లేదు. ఇష్టానుసారంగా నోటికి పని చెబుతున్నారు.
అంతకు ముందు చాలా అమాయకుడిలా కనిపించిన సుధీర్ రెడ్డి.. ఇప్పుడు మరో త్రిగుణ్.. మరో ముఖేష్‌లా మారాడు. నామినేషన్స్‌లో అతను రెచ్చిపోయిన తీరును చూశాక నెట్టింట పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తోంది. నిలబడ్డా కుర్చున్నట్టే ఉందిలే అంటూ రోహిత్‌ను బాడీ షేమింగ్ చేస్తున్నాడు. అది చాలదన్నట్టుగా ‘నాగ్ సర్ నిన్నే గేట్లు తెరిచి బయటకు పొమ్మన్నారు. మమ్మల్ని ఎవర్నీ పొమ్మనలేదు’ అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా సృష్టి హౌస్ నుంచి వెళ్లిపోయాక తనకు చాలా పాజిటివిటీ వచ్చిందనే భ్రమలో ఉన్నట్టున్నాడు. అందుకే యాటిట్యూడ్ బాగా పెరిగింది. చాలా వెటకారం, ప్రతి ఒక్కరి నామినేషన్‌లో దూరడం వంటివన్నీ చేస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇంక ఇలాగే ఉంటే నామినేషన్స్‌లోకి వచ్చిన వెంటనే బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
