Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే లేకుండా పోయింది. ఏళ్ల తరబడి ఒకే సినిమాను సెట్స్‌పై ఉంచుతూ, తీరా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కనీసం పదిహేను రోజుల ముందు ఫస్ట్ కాపీ రెడీ చేయలేని దారుణమైన పరిస్థితిలో మన దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఒక పక్కా షెడ్యూల్, పర్ఫెక్ట్ రిలీజ్ ప్లానింగ్ ఉండాలి కదా అని సాధారణ ప్రేక్షకులకు సైతం డౌట్ వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పడుతూ, చివరికి సినిమాను వాయిదా వేస్తున్న తీరు చూస్తుంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఆరు నెలల్లోనే పెద్ద సినిమాలు కంప్లీట్ అయ్యేవి, కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ చేతిలో ఉన్నా కూడా కనీస ప్లానింగ్ లేక మేకర్స్ చేతులెత్తేస్తున్నారు.

ఇంత ప్లానింగ్ లేకుండా సినిమాలు ఎలా తీస్తున్నారు అని ఎవరైనా అడిగితే, వెంటనే విజువల్ ఎఫెక్ట్స్ లేట్ అవుతున్నాయి, వర్కింగ్ డేస్ లాగ్ అవుతున్నాయి, షూటింగ్ సమస్యల వల్ల లేట్ అవుతుంది అంటూ రకరకాల సాకులు చెబుతున్నారు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కోసం, వీఎఫ్ఎక్స్ కోసం ఎంత టైమ్ పడుతుంది అనేది ముందే ఒక అంచనా ఉండాలి కదా. విజువల్ ఎఫెక్ట్స్ పనులు సడెన్ గా వచ్చేవి కాదు, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ఎక్కడ ఏ గ్రాఫిక్స్ అవసరమో దర్శకులకు ఒక క్లారిటీ ఉంటుంది. అయినా కూడా పనులన్నీ చివరి నిమిషం వరకు పెండింగ్ పెట్టుకుని, తీరా రిలీజ్ డేట్ వచ్చాక క్వాలిటీ కోసం వాయిదా వేస్తున్నాం అని కవర్ చేసుకోవడం కచ్చితంగా ప్లానింగ్ లోపం కాకపోతే మరేంటి..? కనీసం ఆ మాత్రం బేసిక్ ప్లానింగ్ చేసుకోకుండా ఏళ్ల తరబడి షూటింగ్స్ చేస్తూ కూర్చోవడం వల్లే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి.

ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే, ఇన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు కూడా హీరోలను కనీసం షూటింగ్ కు కరెక్ట్ టైమ్ కి రమ్మని అడగలేకపోతున్నారు. హీరోల డేట్స్ చుట్టూ, వాళ్ళ మూడ్స్ చుట్టూ కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుండటం వల్లే ఇలాంటి వాయిదాలు పడుతున్నాయి. ఇది కేవలం ఒక ఆదర్శ కుటుంబం లేదంటే పారడైజ్ లాంటి సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు, ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి పెద్ద సినిమాకు ఇదే పెద్ద సమస్యగా మారింది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత హీరోలు తమకు నచ్చినట్లుగా గ్యాప్స్ తీసుకోవడం, దర్శకులు ఏళ్ళ తరబడి సీన్స్ మార్చుకుంటూ కూర్చోవడం వల్లే ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తోంది. పాపం ఎక్కడి నుంచో ఫైనాన్స్ తెచ్చి పెట్టుబడి పెట్టిన నిర్మాతలు మాత్రం, హీరోలను ఎదిరించి ఏమీ అడగలేక సైలెంట్ గా చూస్తుండిపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సిన టైమ్ లో, కనీసం ఒక ట్రైలర్ కూడా కట్ చేయడానికి టైం లేనంత దారుణమైన పరిస్థితుల్లో మన సినిమా ఇండస్ట్రీ ఉందా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఆదర్శ కుటుంబం పోస్ట్ పోన్ అయినప్పుడు అదేంటని అడిగితే, నిర్మాత నాగవంశీ మన ఇండస్ట్రీ డిసిప్లిన్ అలా ఉంది అంటూ ఓపెన్ గానే సెటైర్లు వేసారు. దీన్ని బట్టి చూస్తే నిజంగానే ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్ గా చేయట్లేదా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ మొదలయ్యాయి. వేల మందికి ఉపాధి కల్పించే ఒక పెద్ద ఇండస్ట్రీలో ఇంత కేర్ లెస్ గా పనులు జరుగుతున్నాయంటే, తెర వెనుక ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుందో నాగవంశీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఫస్ట్ కాపీ ఎప్పుడు వస్తుందో, సెన్సార్ కు ఎప్పుడు వెళ్తుందో తెలీని అయోమయ స్థితిలో ఎన్నో బడా ప్రాజెక్టులు ఇరుక్కుపోయాయి.

మరి ఇలాంటి తీవ్రమైన సమస్యలకు పరిష్కారం ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ ముందున్న పెద్ద సవాల్. హాలీవుడ్ తరహాలో లేదంటే కనీసం పక్కనున్న మలయాళ ఇండస్ట్రీ లాగా పక్కా బౌండ్ స్క్రిప్ట్ తో, కరెక్ట్ ప్రీ ప్రొడక్షన్ తో సెట్స్ మీదకు వెళితేనే ఈ సమస్యల నుంచి బయటపడగలం. షూటింగ్ మొదలయ్యే నాటికే ఏ రోజు ఏ సీన్ తీయాలి, హీరోలు ఏ రోజు రావాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే కార్పొరేట్ స్టైల్ ప్లానింగ్ టాలీవుడ్ కు చాలా అవసరం. అలా కాకుండా పాత పద్ధతిలోనే ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్తాం అంటే మాత్రం ఫ్యూచర్ లో ఇండస్ట్రీ చాలా పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. దర్శకులు తమ విజన్ కు తగ్గట్టుగా పక్కా షెడ్యూల్స్ వేసుకోవడం, హీరోలు నిర్మాతలకు అందుబాటులో ఉండి కరెక్ట్ టైమ్ కు సహకరించడం జరిగితేనే మన ఇండస్ట్రీలో మళ్లీ వర్క్ డిసిప్లిన్ వస్తుంది. లేదంటే సినిమా రిలీజులు ఎప్పటికీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లాగే మిగిలిపోతాయి.

Pranav

Writer and contributor at Telugu Cinema 360