బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో ఉండటమే అయి ఉండొచ్చు. తప్పదు.. ఎవరొచ్చినా కూడా రోహిత్‌తో పెట్టుకుంటేనే వాళ్లకు హైప్ వస్తుంది. ఇంకొకటేంటే.. రోహిత్ కూడా హౌస్‌లో పని విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు. పని చేసేందుకు బద్దకమా? మరో కారణమా? తెలియదు కానీ రోహిత్ మాత్రం పని అంటే వెనుకడుగు వేస్తుంటాడు.
పని కారణంగానే రోహిత్ టార్గెట్ అవుతున్నాడు. లేదంటే రోహిత్‌ను కార్నర్ చేయడానికి పెద్దగా కారణాలేమీ ఉండవు. ఇక ఇవాళ బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఇద్దరిని తొలగించమని మిథిలేష్, అపూర్వకు చెప్పారు. వీళ్లిద్దరూ సృష్టి, అమన్‌ను ఎంచుకున్నారు. దీనికి కారణాలు చెబుతుంటే మధ్యలో రోహిత్ ఇన్వాల్వ్ అయ్యాడు. అసలెందుకు రోహిత్ మధ్యలోకి వచ్చాడనేది షో చూస్తే కానీ తెలియదు. దీంతో రోహిత్ వర్సెస్ మిథిలేష్, అపూర్వ పెద్ద గొడవ జరిగింది. రోహిత్ అటెన్టివ్‌గా లేడని మిథిలేష్ అన్నాడు. దీంతో నిన్న ముఖేష్ అటెన్టివ్ కాదన్నావు.. ఇవాళ నేను అటెన్టివ్ కాదంటున్నావు.. ఇందులో ఏది నిజమంటూ రోహిత్ గొడవకు దిగాడు. మరోవైపు పని విషయంలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే త్రిగుణ్ కూడా తన వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత తన స్ట్రాటజీ మార్చేసి రోహిత్‌తో గొడవపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ కింగ్ గా,…
టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క…
మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్‌బాస్‌కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ…
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి…
ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా…
బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి…