నిన్న హోస్ట్ నాగార్జున వెళ్లిపోయాక షో ప్రారంభమైంది. షాలినితో సుధీర్ మాట్లాడాడు. ‘నువ్వు చిరుతలా ఆడతావు .. వచ్చిన వాళ్లంతా నువ్వు రోహిత్‌తోనే కనబడుతున్నావంటున్నావు. కాబట్టి చూసుకో.. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. అప్పుడే త్రిగుణ్ వచ్చి పక్కనబెట్టిన ఫుడ్ తీసేస్తున్నానని చెప్పాడు. అప్పుడు షాలిని అది తమదని చెప్పింది. ఆ తరువాత ఫుడ్ కోసం రోహిత్ వచ్చాడు. తన ఫుడ్ ఎవరు తీశారని అడిగాడు. మధ్యాహ్నం తిన్న దానిలో కాస్త పక్కనబెట్టుకున్నట్టుగా చెప్పాడు. శివ్ వచ్చినప్పుడు రైస్ లేకపోవడంతో వర్షిణి అతనికి కొంచెం ఇచ్చేసిందని త్రిగుణ్ చెప్పాడు. వర్షిణికి ఆకలేస్తోందని కొంచెం ఇచ్చినట్టుగా చెప్పాడు. తనను అడిగి తీసి ఉంటే బాగుండేదని రోహిత్ అన్నాడు. దీంతో పెద్ద గొడవ జరిగింది. రోజూ ఫుడ్ పడేస్తున్నారని త్రిగుణ్.. ఒక్కటే సారి పడేశానని రోహిత్. తను పాడైపోయినా తింటానని రోహిత్ చెప్పాడు. మధ్యలో సుధీర్ వచ్చాడు. తమకు నైట్ చపాతీలు సరిపోవడం లేదని.. మధ్యాహ్నం తినే రైస్‌లో కొంచెం పక్కనబెట్టుకున్నట్టుగా రోహిత్ చెప్పాడు. సుధీర్ వచ్చేసి ఫుడ్ పాడు చేస్తావని అన్నాడు. కానీ తను ఒక్కసారే పడేశానని చెప్పాడు.
అతి చెయ్యకు వెళ్లి పని చెయ్యి పో అని త్రిగుణ్ అన్నాడు. త్రిగుణ్ నోరు జారి ఆమెను తీసుకుని డాన్యూబ్ రూంకి పో అని అన్నాడు. దీంతో షాలిని అదేం మాట్లాడటమని అడిగింది.
మధ్యలోకి సుధీర్ పదే పదే వెళ్లడంతో ‘నీకు దణ్ణం పెడతానయ్యా మధ్యలోకి రాకు’ అని రోహిత్ చెప్పాడు. మనిషి లాగా మాట్లాడంటూ రోహిత్ ఫైర్ అయ్యాడు. ఆ తరువాత రోహిత్.. అమన్‌తో త్రిగుణ్ పవర్ పోయింది.. దూల తీరిందని చెప్పాడు. రోహిత్ కూడా బాగా నోరు జారుతున్నాడు. షాలిని దగ్గరకు వెళ్లి త్రిగుణ్ కావాలని చెయ్యలేదని సారీ చెప్పాడు. నీతూ తనను తమ్ముడు అని పిలిచిందని.. తనను అక్క అని పిలవమందని షాలినికి చెప్పాడు. ఆమె దానిని కూడా కామెడీ చేసింది. నీతూ డాన్యూబ్ రూంలో అడుగు పెడుతుంటే శివ్ హారతి ఇచ్చి మరీ పిలిచాడు. హౌస్‌లో ఎందుకు మింగిల్ అవడం లేదంటే.. రోహిత్ ఏదో చెప్పబోతుంటే.. మధ్యలో షాలిని చేరింది. అసలు రోహిత్‌ను మాట్లాడనివ్వలేదు. మధ్యలో శివ్ కన్విన్స్ చేసేందుకు యత్నిస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితి లేదు. రోహిత్‌ను నీతూ మాట్లాడు.. వినాలని ఉందన్నా కూడా అతను సైలెంట్. మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఊరుకున్నట్టుగా ఉన్నాడు. రోహిత్‌ను తమ్ముడు అని ఎందుకు పిలిచావని అడిగావంటూ షాలిని అడిగింది. హౌస్‌లో ఇంతమంది ఉండగా ఎందుకు రోహిత్‌నే అక్కను పిలవమని చెప్పావంటూ గొడవకు దిగింది.
నీతూ వెళ్లి.. త్రిగుణ్ దగ్గర కూర్చొంది. షాలిని వెళ్లి ముఖేష్ వాళ్లతో నీతూ గురించి చెబుతోంది. రోహిత్ కూడా షాలినినే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడటం దారుణం. తన ఆటకు తనే స్వయంగా ఘోరీ కట్టుకుంటున్నాడు. ఇక బిగ్‌బాస్ నామినేషన్స్‌ను ప్రారంభించారు. వైల్డ్ కార్డ్స్ ముందుగా నామినేషన్ అవకాశం ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాలి. అలా శివ్.. రోహిత్, త్రిగుణ్‌లను ఎంచుకున్నాడు. ముందుగా త్రిగుణ్ టాస్క్ గెలిచినట్టుగా శివ్ చెప్పాడు. రోహిత్‌ను అటెన్టివ్‌గా లేవంటూ స్టేట్మెంట్ పాస్ చేశాడు. కానీ బిగ్‌బాస్ శివ్‌ను కరెక్ట్ చేశారు. దీంతో రోహిత్ టాస్క్ గెలిచాడని ప్రకటించాడు. రోహిత్ నామినేషన్‌ను ప్రారంభించాడు. వంశీని నామినేట్ చేశాడు. గత నామినేషన్స్‌లో తనను మాట్లాడనివ్వకుండా కుండ పగులగొట్టడం కరెక్ట్ కాదన్నారు. తనకు ప్రక్రియ తెలియదన్నారని.. మీకు తెలుసు కదా.. అని వంశీతో త్రిగుణ్ అన్నాడు. ఫస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు మీ తెలివంతా ఉపయోగించి కొన్ని పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు కదా.. బిగ్‌బాస్ చెప్పినా కూడా అదే చేశారని రోహిత్ అన్నాడు. ఈ క్రమంలోనే వంశీని ఎవరైనా కాస్త ట్రిగర్ చేసినా చాలు కదా.. ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు. ఇప్పుడు కూడా పాయింట్స్ పెట్టకుండా దెప్పి పొడుపులు.. వెటకారంతో ఎలాగో నామినేషన్ ముగించాడు.
ఆ తరువాత రోహిత్.. ఝాన్సీని నామినేట్ చేశాడు. హౌస్‌లో అందరితో ప్రజల మాట.. రైతు మాట తీస్తుందని.. తన వాళ్లను గట్టెక్కించేందుకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకున్నారని తన ఫీలింగ్ అని చెప్పాడు. తను జనాలనే మాటే మాట్లాడుతానని.. బిగ్‌బాస్ రూల్స్ గురించి ‘నీ నోటి నుంచే వినాలి’ అని చెప్పింది. తనకు ఇమ్యూనిటీ వద్దని ముందే చెప్పానని.. కేవలం ఇంటి బాధ్యతలు చూసుకునేందుకే కెప్టెన్సీ కావాలనుకున్నానని చెప్పింది. తన ఎవిక్షన్ ఎప్పుడు యూజ్ చేయవద్దో చెప్పేందుకు నువ్వెవరని ఝాన్సీ అడిగింది. సుధీర్ మధ్యలోకి వచ్చాడు. శివ్.. వంశీ, ఝాన్సీలలో వంశీకి చెప్పిన పాయింట్స్ వాలిడ్ అనిపించాయని చెప్పి అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత ఝాన్సీ.. రామ్ ప్రసాద్, శివ్ దగ్గరకు వెళ్లి త్రిగుణ్ అన్నను అతను నామినేట్ చేయడని.. అలా చేసి లేపుతున్నామని చెప్పాడు. అప్పుడు ఝాన్సీ కూడా రోహిత్‌ను నామినేట్ చేయవద్దని రామ్ ప్రసాద్‌కి చెప్పింది. శివ్ కూడా రోహిత్ ఒక వైట్ పేపర్ అని మనమే లేపి అక్కడ పెడుతున్నామని చెప్పాడు. అలా చేయవద్దని శివ్, ఝాన్సీ ఇద్దరూ రామ్ ప్రసాద్‌కు చెప్పారు. మొత్తానికి శివ్ ఒక డిఫరెంట్ గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేశాడు. మరి అది అతనికి ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.
నెక్ట్స్ శ్వేత వచ్చేసి అమన్, ముఖేష్లను ఎంచుకుంది. తరువాత నిర్వహించిన టాస్క్‌లో ముఖేష్ గెలిచి అమన్‌ను నామినేట్ చేశాడు. ఎల్లో కార్డు చూపించినా కూడా ‘నీయమ్మ’ అని వాడావని చెప్పాడు. ‘నీకెలా బచ్చా అంటావో.. తను కూడా అమ్మ అంటానని.. తెలంగాణలో యాసలో అది తప్పు కాదు’ అని చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మొన్న కెప్టెన్సీ టాస్క్ ముఖేష్ తీశాడు. ‘నువ్వు బచ్చా అన్నందుకే నేను నీయమ్మ అన్నా’ అని అమన్ చెప్పాడు. మధ్యలోకి త్రిగుణ్ రావడంతో ‘నువ్వు మాట్లాడకు’ అని అమన్ చెప్పాడు. దీనిలో ఇద్దరూ ఫైర్ అయ్యారు. ‘నువ్వెవడురా’ అని త్రిగుణ్ అనడంతో అమన్ కూడా ‘నువ్వెవడురా’ అంటూ గొడవకు దిగాడు. ఒక టాస్క్‌లో వర్షిణిని అమన్ పట్టుకోవడాన్ని తీశాడు. దీనిపై అమ్మాయి, అబ్బాయి హౌస్‌లో లేదని నాగ్ చెప్పారని.. అయినా తీస్తున్నావని అమన్ అన్నాడు. రోహిత్‌ను పట్టుకుని ‘నువ్వు దాన్ని మెయిన్టైన్ చేస్తున్నావా?’ అని అడిగావు.. అది మంచి మాటా? అనడంతో ముఖేష్ కామ్ అయిపోయాడు.
నెక్ట్స్ ముఖేష్.. షాలినిని నామినేట్ చేశాడు. టాస్క్‌ల్లో ఎఫర్ట్ అయితే పెడుతున్నావు కానీ మరికాస్త ఎఫర్ట్ పెడితే బాగుంటుందని ముఖేష్ చెప్పాడు. తను ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదో చెప్పమని అడిగింది. బాల్ గేమ్‌లో పెట్టలేదని చెప్పింది. షాలిని అంతా వితండ వాదమే చేసింది. అయితే ముఖేష్ కంటే బాగానే ఆడినట్టుగా చెప్పింది. ఫజిల్ గేమ్‌లో ఎఫర్టే పెట్టలేదని ముఖేష్ అన్నాడు. అదే గేమ్‌లో మీది బుల్షిట్ గేమ్ అని షాలిని అన్నది. అన్నీ సైగలతో చెప్పిన తర్వాత కూడా చెయ్యలేకపోయారని చెప్పింది. మధ్యలో త్రిగుణ్ కూడా రావడంతో నామినేషన్స్ అసలు ఎవరెవరికి మధ్యో తెలియకుండా పోయింది. వంశీని ‘బుర్రుంటే అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తావు’ అని రోహిత్ నోరు జారాడు. ఏమన్నావంటూ వంశీ రావడంతో రోహిత్ సారీ చెప్పాడు. ఇక శ్వేత.. ముఖేష్ వచ్చేసి అమన్, షాలినికి చెప్పిన పాయింట్స్‌లో అమన్ కాస్త రూడ్‌గా అనిపించాడని అతడిని నామినేట్ చేసింది. మొత్తానికి షో బయటి నుంచి చూసి వచ్చారు కాబట్టి రోహిత్ గ్రాఫ్ దెబ్బతీయాలంటే షాలిని ఉండాల్సిందేనని ఉంచినట్టుగా అనిపించింది.
ఆ తరువాత శ్వేత వచ్చేసి వర్షిణి, షాలినికి టాస్క్ పెట్టింది. షాలిని అవలీలగా గెలిచి నామినేషన్ ప్రారంభించింది. షాలిని ఫస్ట్ దేబ్జానిని నామినేట్ చేసింది. అపూర్వ గురించి తను మాట్లాడిన మాటను దేబ్జాని మార్చేసిందని చెప్పింది. అలాగే హైట్‌ను బట్టి ఒక మనిషిని గేమ్ నుంచి తీసేయడం దారుణమని చెప్పింది. టీమ్ వర్సెస్ టీమ్ అన్ని గేమ్స్ చూశామని దేబ్జాని చెప్పింది. ఈ ఒక్క గేమ్ ప్రొబబులిటీ చూడమని చెప్పానని దెబ్జాని చెప్పింది. ఇవన్నీ మీకోసం మీరు ఆడేందుకు క్రియేట్ చేసిన స్టోరీ అని.. ఇది పర్సనల్ అని షాలిని చెప్పింది. టు డిఫరెంట్ థింగ్స్ చెప్పారు కాబట్టి సెల్ఫిష్ అన్నానని.. తనను ఎమోషనల్‌గా బ్రేక్ చేసి టీమ్ కోసమని చెప్పి గేమ్ ఆడారని దేబ్జానిని షాలిని చెప్పింది. ఇక మిగిలిన నామినేషన్స్ రేపు జరుగనున్నాయి. మొత్తానికి ఈవారమైనా షాలిని నామినేషన్స్‌లోకి వస్తుందేమో బయటకు లాగేయాలని రోహిత్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆమెను హౌస్‌లోని వారు బయటకు వెళ్లనిచ్చేలా లేరు. మొత్తానికి రోహిత్ విన్నర్ అవకుండా హౌస్మేట్స్ అంతా గట్టిగా ట్రై చేస్తున్నారు.
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్…
సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ…
టాలీవుడ్లో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం, స్టార్లుగా ఎదగడం చాలా కామన్. వారసత్వం అనగానే అందరి దృష్టి వెంటనే కొడుకుల…