బిగ్‌బాస్ ఆరు వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ తన రియాలిటీని పూర్తిగా బయటపెట్టని దేబ్జాని ఈవారం మాత్రం మాస్క్ తీసినట్టుగా అనిపిస్తోంది. ముందు నుంచి రోహిత్ అంటేనే మండిపడుతున్న దేబ్జాని.. ప్రస్తుతం రోహత్ పూర్తిగా నెగిటివ్ అయిపోయాడని ఫిక్స్ అయినట్టుగా ఉంది. అందుకే రోహిత్‌కు దగ్గరగా ఉన్న వాళ్లను సైతం దూరం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
గత రాత్రి డాన్యూబ్ చైర్మన్ వచ్చి కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్లారు. షో పూర్తైన తర్వాత ముఖేష్ ఆ స్వీట్స్‌ను అందరికీ పంచుతుంటే గొడవ ప్రారంభించింది. రేషన్ మేనేజరే పంచాలని గొడవ పెట్టింది. బయటి నుంచి వచ్చిన స్వీట్స్‌ను ఎవరైనా పంచవచ్చు. కానీ ముఖేష్ చెప్పినా వినకుండా గొడవ పెట్టింది.
అప్పుడు రోహిత్‌తో దేబ్జాని ‘రామన్న నువ్వు పంచు అన్నావుగా’ అని అంది. తను అనలేదని.. ముఖేష్‌ను తనకు కూడా ఇవ్వమని మాత్రమే అడిగానని చెప్పింది. రామ్ ప్రసాద్ ఎందుకు పంచాలి? ముఖేష్ ఎందుకు పంచకూడదో చూసేవారికి అర్థం కాలేదు. అసలు దానికి అంత గొడవ ఎందుకు చేసిందో కూడా తెలియదు. ఈ గొడవ అయ్యాక బయటకు వెళ్లి కూర్చొంది. నరేష్ వస్తే కూడా అతనితోనూ ఇదే పంచాయతి పెట్టింది.
ఇక ఆ తరువాత నీతూతో దేబ్జాని, త్రిగుణ్ సమావేశమయ్యారు. త్రిగుణ్ ఫస్ట్ ‘మీరు ఇండివిడ్యువల్ ప్లేయర్’ అని అర్థమైందని పొగిడాడు. ఎందుకు రోహిత్‌కు సపోర్ట్‌గా ఉంటున్నావని దేబ్జాని అడిగింది. రోహిత్‌కు తను వెల్ విషర్ అని చెప్పింది. ‘మొన్న నామినేషన్స్‌లో నీకు సపోర్ట్‌గా ఉన్నాడు కానీ ఇవాళ గొడవ అవుతుంటే తింటూ కూర్చున్నాడు కానీ రాలేదు.. నువ్వు షాలినికి సపోర్ట్ చేయలేదనేమో’ అని దేబ్జాని చెప్పింది. ఎలాగైనా శ్వేత, నీతూలను తమ వైపు లాక్కోవాలని వాళ్లతో రకరకాలుగా చెబుతోంది. మొత్తానికి రోహిత్‌ను ఒంటరిని చేసేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది.
ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే…
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి.…
బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…
ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…
ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…