నిన్న డాన్యూబ్ చైర్మన్ హౌస్‌లోకి వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్లారు. వాటిని ముఖేష్ అందరికీ పంచుతున్నాడు. మధ్యలో దేబ్జాని వచ్చి రచ్చ ప్రారంభించింది. అవి రేషన్ మేనేజర్ మాత్రమే పంచాలని ఆమె గొడవ పెట్టింది. బయటి నుంచి వచ్చిన స్వీట్స్ కదా.. వాటిని ఎవరైనా పంచవచ్చని ముఖేష్ వాదన. ‘వాడు క్లీనింగ్ డిపార్ట్మెంటులో ఉన్నాడు. ఏదైనా వస్తే రేషన్ మేనేజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అని చెప్పాను’ అని నరేష్‌కి వచ్చి దేబ్జాని చెప్పింది. ముఖేష్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని.. రోహిత్‌తో ఉండి ఇలా మాట్లాడుతున్నాడని ఆమె నరేష్‌కి చెప్పింది. ఆ తరువాత శివ్ వర్సెస్ ముఖేష్ గొడవ జరిగింది. అది ఎందుకు అనేది కూడా క్లారిటీ లేదు. ఆ తరువాత దేబ్జాని.. త్రిగుణ్‌కు మధ్య వాదన. ‘నువ్వు కనిపించాలి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు’ అని తనను ముఖేష్ అన్నాడని దేబ్జాని.. త్రిగుణ్‌కు చెప్పింది. జెంటిల్మాన్ అంటున్నారు.. ఇదేనా జెంటిల్మాన్ బిహేవియర్ అని త్రిగుణ్. అసలు త్రిగుణ్‌కు హ్యాండ్ కప్స్ లేవు.. జైలు లేదు.. మరి హోస్ట్ నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ ఏమైందో తెలియడం లేదు. అతన్ని వదిలేసి మనమే ఏ డెసిషన్ అయినా తీసుకుందామని దేబ్జానికి త్రిగుణ్ చెప్పాడు. త్రిగుణ్‌కు హ్యాండ్‌కప్స్ ధరించాలని బిగ్‌బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
షాలిని బెడ్ తీసుకుందామని అమన్‌కు రోహిత్ చెప్పాడు. దేబ్జానిని కెప్టెన్ రూంకి పంపిద్దామని చెప్పారు. ఈ విషయం నరేష్‌కి చెప్పారు. నరేష్ వెళ్లి దేబ్జానితో వన్ వీక్ కెప్టెన్ రూంకి వెళ్లమని చెప్పాడు. కానీ తను వెళ్లనని చెప్పేసింది. ఆ తరువాత ఎక్స్ట్రా ర్యాక్స్ గురించి మాట్లాడాలని ముఖేష్ చెప్పాడని దేబ్జానికి శివ్ చెప్పాడు. తను చెబితే ఊరుకోడని శివ్ అన్నాడు. ముఖేష్ వచ్చి దేబ్జానిని ‘నీ దగ్గర ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి?’ అని అడిగితే ఐదు అని చెప్పింది. అందరినీ అడిగితే దేబ్జాని దగ్గర తప్ప ఎవ్వరి దగ్గరా 4కు మించి లేవు. బెడ్లో ర్యాక్స్ ఉన్నాయి కదా ఇవెందుకు అన్నట్టుగా శివ్ అడిగాడు. సాల్వ్ చేయాలని చూస్తున్నానని నీకెందుకని ముఖేష్ అన్నాడు. ముఖేష్‌కి క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా.. మరి ర్యాక్స్‌తో ఏం పని అని శివ్ అడిగాడు. శివ్ వచ్చేసి రామకృష్ణకు ఇచ్చిన ర్ాక్ పెద్దగా ఉంది కదా ఇంకెందుకు ర్యాక్ అని అడిగాడు. అయితే శివ్‌ను చాలా రూడ్‌గా ముందు ఆ ర్యాక్ నుంచి బట్టలు తీసేయమని చెప్పాడు. ఈ ర్యాక్స్ గురించే రచ్చ అంతా జరిగింది.
వర్షిణితో కొంత మంది ఇక్కడ బాగా తింటారు కానీ పని చేయరని ముఖేష్ అంటున్నాడని శివ్ చెప్పాడు. రాష్ట్రం, దేశం నీటి కొరతను ఎదుర్కొంటోందని కాబట్టి నీరు, ఆహారాన్ని వృథా చేయవద్దని బిగ్‌బాస్ చెప్పారు. తన తదుపరి అవతారం అల్టిమేట్ గోట్ ప్రారంభమైందని చెప్పి బిగ్‌బాస్ ఎలిమినేషన్స్ ప్రారంభించారు. ఎల్లో, రెడ్ లెవల్లో ఉన్న సభ్యుల భవితవ్యాన్ని గ్రీన్ లెవల్లో ఉన్న సభ్యులు నిర్ణయించబోతున్నారని బిగ్‌బాస్ చెప్పారు. ఈ దశలో 7 నామినేషన్ స్లిప్స్ పెట్టారు. గోట్ సభ్యులు తమలో తాము మాట్లాడుకుని మంచి పాయింట్స్ ఉంటే మిగిలిన సభ్యులను ఒప్పించి ఎక్కువ నామినేషన్స్ స్లిప్స్ తీసుకోవచ్చు. అయితే ఒకరు ముగ్గురికి మించి నామినేట్ చేయడానికి లేదు. ముందుగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు. అలా తీసుకోగా రెండు స్లిప్పులు మిగిలాయి. త్రిగుణ్ తాను రెండు స్లిప్పులు తీసుకుంటానని చెప్పాడు. దేబ్జానికి బ్రెయిన్ వాష్ చేసి రెండు స్లిప్పులు తీసుకోమన్నాడు. కానీ దేబ్జానికి దానికి అంగీకరించకపోవడంతో త్రిగుణ్ మూడు స్లిప్పులు తీసుకున్నాడు.
ముందుగా నీతూ.. ఝాన్సీని నామినేట్ చేసింది. అగ్నిపరీక్షలో టఫ్ ఫైట్ ఇచ్చి ఫస్ట్ హౌస్‌లోకి అడుగు పెట్టావని చెప్పింది. ఈ ఇంటికి వచ్చాక ఓన్ ఐడెంటిటీ మిస్ అయ్యిందని చెప్పింది. రివర్స్ కౌంటర్స్ ఝాన్సీ ఇస్తుంటే తాను కష్టపడి ఆ పొజిషన్‌కి వచ్చి నామినేట్ చేస్తున్నానని.. నువ్వు కూడా కష్టపడి వచ్చి నామినేట్ చేయవచ్చని నీతూ చెప్పింది. దీంతో ఝాన్సీ సైలెంట్. త్రిగుణ్ వచ్చేసి రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేశాడు. ఇంట్లో అందరికంటే ఓ పెద్దరికం ఉందని.. అయితే కెప్టెన్సీ సమయంలో అందరూ మెచ్చే కెప్టెన్‌గా ఉన్నావని.. వాషింగ్ వంటి వన్నీ నువ్వే చేశావని త్రిగుణ్ చెప్పాడు. నీ ఏజ్‌కి నువ్వు ఆడే ఆటకు సంబంధం లేదని.. నీతో గేమ్‌లో ఎవరూ ఆడలేరని చెప్పాడు. అయితే తాను అందరి ప్రేమతో గెలుచుకున్నానని.. తను ఎవ్వరినీ నొప్పించకూడదని డిసైడ్ అయ్యానని రామ్ ప్రసాద్ చెప్పాడు. తను నెక్ట్స్ టైం కెప్టెన్ అయితే తప్పకుండా తన మాటలతో హర్ట్ చేస్తానని చెప్పాడు.
ముఖేష్ వచ్చి రామకృష్ణను నామినేట్ చేశాడు. ఇక్కడ మంచి అవకాశం గెలుచుకుని వచ్చి ఏయ్ అని అరవడం తప్ప తాను చూడలేదని చెప్పాడు. రామకృష్ణకు 4 ర్యాక్స్ ఇప్పించాలని తాను పోరాడితే తను మాత్రం 2 చాలని చెప్పాడని ముఖేష్ అన్నాడు. తను అమాయకుడినని.. తనకు ఇన్నోసెన్స్ అని ఎవరికి చెప్పానని రామకృష్ణ చెప్పాడు. టేటుల్పై గలీజ్ చేస్తున్నాడని ముఖేష్ చెప్పాడు. ఇక్కడ ఇన్నోసెన్స్ ఉన్నా బతకొచ్చని కానీ నీలాంటి మూర్ఖుడు వస్తే బతకడం కష్టమని ముఖేష్ చెప్పాడు. మూర్ఖత్వం అంటే అర్థమేంటో తెలియక ముఖేష్ ఇలా మాట్లాడి ఉంటాడని రామకృష్ణ చెప్పాడు. నామినేషన్ పాయింట్సే ముఖేష్ సరిగా పెట్టలేదు. ఇక త్రిగుణ్ వచ్చేసి రోహిత్‌ను నామినేట్ చేశాడు. ‘‘నిన్న నీ ఫ్యాన్ వీడియో (హోస్ట్ నాగార్జున వచ్చినప్పుడు రోహిత్ ఫ్యాన్ ఒకావిడతో మాట్లాడించారు) చూశానని నాకు కూడా అదే ఫీలింగ్. 10 సెకండ్స్ స్టార్ అని పదే పదే అంటుంటావు.. అది రావడం ఎంత కష్టమో నీకు తెలియదు. అది తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అహంకారం తలకెక్కేసిందా? తనకు తెలియడం లేదన్నాడు. మొహం మీద నీళ్లు పోస్తే వచ్చిన సహనం ఇక్కడ లేదన్నాడు. గేమ్స్‌లో తన వల్ల అయినంత ఆడానని.. తనకు అడుక్కుంటే వచ్చిన గోట్ కాదని.. ఆడితే వచ్చిందని చెప్పాడు. మోకాళ్ల దగ్గర కూర్చొని అడుక్కున్నావని.. ఎవరినీ రెస్పెక్ట్ చేయవని చెప్పాడు. అందుకే నువ్వు బయటకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
‘‘మణికొండ రోడ్లపై నేను తిరిగినా కూడా నువ్వెక్కడున్నావో.. నేనక్కడే ఉన్నానని చెప్పా. వాటిని మారుస్తున్నాడు. నీ స్థాయికి దిగి నేను మాట్లాడితే నాకు 3-4 ఎల్లో కార్డులు వచ్చేవి. ఒక జడ్జిగా అక్కడ కూర్చొని నా మొహంపై నీళ్లు కొడితే అదొక ప్రక్రియ కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అవలేదు. ఎవరైనా ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించే వ్యక్తిని నేను కాను. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దిగజారుడు మాటలు మాట్లాడింది నువ్వు. షాలినితో చెప్పాను.. బయటకు వెళ్లాక నేను బాండింగ్ పెంచుకోవాల్సిన వ్యక్తి త్రిగుణ్ అని చెప్పానన్నాడు. షాలిని బయటకు వెళ్లిపోతుంటే తన బుగ్గపై ముద్దు పెట్టా. ఆమె వెళ్లిపోతుందన్న బాధలో చేశా. షాలిని అంటే ఎందుకు నాకు అంత ఇష్టమంటే తనకు మూడు చపాతీలు వస్తే రెండు తిని ఒకటి నాకు ఇచ్చేది. నాకు తిండి పెట్టింది కాబట్టి నాకు తనంటే ఇష్టం. అలాంటిది మాపై దిగజారుడు కామెంట్స్ చేశావు’’ అని రోహిత్ చెప్పాడు. దీనికి త్రిగుణ్ ‘ముఖేష్ నడక గురించి దిగజారుడు కామెంట్స్ చేసింది నువ్వ’ని చెప్పాడు.
ముద్దు ముద్దు అని తెగ చేశావు కదా.. అక్కడ మీ చెల్లి ఉందనుకో.. ఆమె వెనుక నేను అలాగే మాట్లాడితే నువ్వు తీసుకుంటావా? ముద్దు అనేది రెండు టైప్స్ ఉంటాయి. నా దరిద్రం ఏంటంటే.. అనగానే రోహిత్‌ని మాట్లాడనివ్వకుండా త్రిగుణ్ అడ్డుపడ్డాడు. దీంతో తను మాట్లాడే దాకా ఆగమని.. నువ్వు మూర్ఖుడివా? అని అడిగాడు. మూర్ఖుడివైతే నన్ను మాట్లాడనివ్వకుండా ఆపమని చెప్పాడు. తన ఫ్యాన్ వచ్చి తన కొడుకు లాంటి వాడివని అంటే అక్కడే తాను గెలిచానని చెప్పాడు. తను ఎమోషనల్‌గా ఆలోచిస్తానని.. తనతో పాటు తన ఫ్రెండ్స్‌తో పాటు తనూ గెలవాలనుకుంటానని రోహిత్ చెప్పాడు. మధ్యలో ముఖేష్ వస్తే ఆపమని త్రిగుణ్ గొడవపడ్డాడు. ఒకవేళ వర్షిణి గారు తనకు మంచి ఫ్రెండ్ అయితే తన కోసం ఓడిపోయేందుకు కూడా సిద్ధమని రోహిత్ చెప్పాడు. మొత్తానికి ఈ నామినేషన్ ముగిసింది.
ఝాన్సీని దేబ్జాని నామినేట్ చేసింది. నీ ఆట తనకు చాలా బాగా నచ్చిందని.. బోన్ టాస్క్ చాలా బాగా ఆడావని కానీ ఎందుకు రెడ్‌లో ఉన్నావో తనకు అర్థం కావడం లేదని దేబ్జాని చెప్పింది. బోన్ టాస్క్‌లో తను ఒక్కదాన్ని చేసింది కాదని.. గ్రూప్‌గా ఆడామని ఝాన్సీ చెప్పింది. అది సింగిల్‌గా ఆడాలని చెప్పింది. తను తన గేమే ఆడిందని వంశీ చెప్పాడు. ఎందుకు మాట్లాడటం లేదని అడిగితే దానికి నీతో నాకు ర్యాపో లేదు అన్నావని చెప్పింది. అప్పుడు తాను ఎంతో ఏడ్చానని ఝాన్సీ చెప్పింది. నువ్వు చెప్పేంత వరకూ కూడా నాతో నీకు ర్యాపో లేదని తెలియలేదంది. అసలు నాతో ఇప్పటి వరకూ ఫేక్‌గా ఉన్నావని చెప్పింది. వేరే దగ్గర కోచింగ్ తీసుకుంటున్నావని దేబ్జాని చెప్పింది. నువ్వు బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నావని చెప్పింది. నా బెడ్ నాకు ఇచ్చేయమని అన్నావని దేబ్జాని చెప్పింది. శనివారం వస్తే అక్కా నాకు మేకప్ చేయవా? అని వస్తుందని దేబ్జాని అన్నదట. తనకు మేకప్ చేసుకోవడం రాదని అలా వచ్చి అడగడం తప్పా అని అడిగింది. వీకెండ్ వస్తే అవసరానికి వస్తుందని అనడమేంటని ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది. ఝాన్సీ తన గేమ్ తను ఆడుతోందని.. ఇక మీదట నా గేమ్ నేను ఆడతానని అన్నానని దేబ్జాని చెప్పింది. చాలా రూడ్‌గా దేబ్జాని తన నామినేషన్ ముగించింది.
అమన్.. సుధీర్‌ను నామినేట్ చేశాడు. ఫస్ట్ పప్పెట్ అనే మాట వచ్చిందని.. ఆ తరువాత తన ఆట తీరును మార్చుకున్నాడని చెప్పాడు. అయితే తనను, ఝాన్సీని సెలక్ట్ చేసినప్పుడు ఝాన్సీ.. రామన్నకు ఇచ్చావా? అని అడిగితే తర్వాత చేద్దాములే అని చెప్పానని కానీ సుధీర్‌కి ఇవ్వొద్దని చెప్పలేదన్నాడు. మనసులో ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్పమని.. షాడోలో ఆడవద్దని అమన్ చెప్పాడు. ఎవరి షాడోలో ఉన్నానో చెప్పమన్నాడు. మీ నలుగురు ఫ్రెండ్స్‌లో ముఖేష్ ఎందుకు గ్రీన్‌లో ఉన్నాడు.. నువ్వు ఎందుకు రెడ్‌లో ఉన్నావో ఆలోచించుకోమని సుధీర్‌కు అమన్ చెప్పాడు. అమన్‌కు ఎక్కువ వెయిట్ వేయమని రామ్ ప్రసాద్ చెప్పాడని కానీ తను వేయలేదని చెప్పాడు. ఆ తరువాత కూడా బాగా ఆడావని చెప్పాడు. మొహం మీద ఒకలా.. వెనుక ఒకలా ఉంటావని అమన్ చెప్పాడు. నిన్ను కెప్టెన్సీ నుంచి త్రిగుణ్ తీసేశాడని ఆ విషయం గుర్తు పెట్టుకోమని సుధీర్ చెప్పాడు. ఇక త్రిగుణ్ వచ్చేసి వర్షిణిని నామినేట్ చేశాడు. ఇంటికి వచ్చాక తను అన్ని విధాలుగా అండగా ఉన్నానని చెప్పాడు. కానీ తన గురించి ఆలోచించుకుని గోట్ టాస్క్‌లో తన గేమ్ తను ఆడానని.. అర్ధం చేసుకుంటావనుకున్నానని కానీ తనను హర్ట్ చేశావని అందుకే నామినేట్ చేస్తున్నానని త్రిగుణ్ చెప్పాడు.
నువ్వు నాకోసం ఉంటావన్న ధైర్యం తనకు ఉందని.. నీలో అలా వేరొకరున్నారని తనకు తెలియలేదని వర్షిణి చెప్పింది. తనకు బయట తెలిసిన త్రిగుణ్.. ఇక్కడ చూస్తున్న త్రిగుణ్ ఒకరు కాదని చెప్పింది. తను వచ్చి అడిగే లోపే శివతో మాట్లాడుకున్నావని.. తనకు రామ్ ప్రసాద్ సెకండ్ ఆప్షన్ అని వర్షిణి చెప్పింది. నువ్వే నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నానని చెప్పింది. తన పర్సనల్ లైఫ్ బయట కూడా ఎవరికీ తెలియదని.. కేవలం నీతోనే షేర్ చేసుకున్నానని చెప్పింది. ఎవరి మీద కోపం.. ఎవరిపై చూపిస్తున్నావో నాకు తెలుసని.. వేరొకరిపై కోపం తనపై చూపిస్తున్నావని చెప్పింది. తనపై కోపం తనపైనే చూపించమని వర్షిణి చెప్పింది. అసలు అదేనా నీ నామినేషన్ పాయింట్ అని వర్షిణి అడిగింది. నువ్వు వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అని త్రిగుణ్ చెప్పాడు. నీ పర్సనాలిటీ, రిలేషన్షిప్ అన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెప్పాడు. పస లేని పాయింట్స్ పెడుతున్నానని తనకు తెలుసని కానీ నువ్వు బయటకు వెళ్లవని తెలుసు కాబట్టి ఈ పాయింట్స్ పెడుతున్నానని చెప్పాడు.
బిగ్‌బాస్ ఆరు వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ తన రియాలిటీని పూర్తిగా బయటపెట్టని దేబ్జాని ఈవారం మాత్రం మాస్క్ తీసినట్టుగా అనిపిస్తోంది.…
ఇవాళ సండే ఫన్డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే…
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి.…
బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…
ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…