ఇవాళ సండే ఫన్డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే చెప్పారు. రెడ్ టీంలో ఉన్నవారిలో ఆడియెన్స్ ఎలిమినేషన్ లేదంటే సడెన్ ఎలిమినేషన్ జరగవచ్చని నాగ్ చెప్పారు. ఎల్లో టీంలో ఉన్నవారు మాత్రం ఆడియెన్స్ ఓటింగ్‌తోనే ఎలిమినేట్ అవుతారని చెప్పారు. శివ్, వర్షిణిని పిలిచారు. ఆడియెన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారో లేదో చూద్దామన్నారు. రోహిత్‌ను లేపి ఎవరుంటారని అడిగితే శివ్ ఉంటాడని.. వర్షిణి ఎలిమినేట్ అవుతుందని చెప్పాడు. అయితే ఇద్దరినీ సేవ్ చేశారు. నరేష్‌ను ఒక ప్రశ్న సూటిగా అడుగుతానని.. సూటిగా చెప్పాలని నాగ్ అన్నారు. వర్షిణి చేతికి డైమండ్ రాగానే ముఖేష్ ఫీలింగ్ ఏంటంటే.. బతికానురా అన్నట్టుగా ఉందని నరేష్ చెప్పాడు. దేబ్జాని ఏడు రోజుల్లో ఏడు రూల్స్ బ్రేక్ చేసిందని రోహిత్ ఫీలవుతున్నాడని నాగ్ చెప్పారు. తనకు అర్ధం కాలేదని దేబ్జాని చెప్పింది. నరేష్‌ని అడిగి తెలుసుకోమని నాగ్ చెప్పారు ఆ తరువాత డాన్యూబ్ ప్రాపర్టీస్ ఫౌండర్, చైర్మన్ రిజ్వాన్ సాజిద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్స్‌తో కాసేపు మాట్లాడి సండే ట్రీట్స్ అండ్ స్వీట్స్ ఇచ్చారు.
సన్డే ఫన్డేలో భాగంగా ‘ఫిక్షనరీ టు డిక్షనరీ’ అనే గేమ్ ఆడించారు. కంటెస్టెంట్స్‌ను రెండు టీములుగా విభజించారు. డిక్షనరీలోని సినిమా పేరు చూసి ఒకరికి చెబితే వాళ్లు దానిని డ్రా చేస్తే ఆ టీంలోని మరొకరు గెస్ చేయాలి. ఈ టాస్క్ ఏదో కాస్త సరదాగా సాగిపోయింది. నామినేషన్స్‌లో ఉన్న వారి నుంచి దక్షి ఎలిమినేట్ అయ్యింది. దక్షి క్విక్ జర్నీ చూపించారు. తరువాత దక్షిని ఒక ఐదుగురిని పిక్ చేసుకుని ఎవరేంటో చెప్పమన్నారు. ఈ హౌస్‌లో లిజన్ మోర్ నీతూకి ఇచ్చింది. అబ్జర్వ్ మోర్ అనేది అమన్‌కు ఇచ్చింది. యూజ్ యువర్ బ్రెయిన్.. రోహిత్‌కు దక్షి ఇచ్చింది. ఎమోషన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వలన గేమ్ డౌన్ అయ్యిందని రోహిత్‌కు చెప్పింది. జిప్ ఇట్ అనేది త్రిగుణ్‌కి ఇచ్చింది. స్పీక్ అప్.. శ్వేతకు ఇచ్చి వెళ్లిపోయింది. ఆ తరువాత విశ్వక్సేన్, గాయత్రి భరద్వాజ్.. కల్ట్ మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. ఎల్లో గ్రూప్‌లో ఉన్న నలుగురిని లేపి.. వారిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరినీ సేవ్ చేయాలని చెప్పారు. అలా శివ్ వచ్చేసి శ్వేతను.. రామ్ ప్రసాద్ వచ్చేసి ఝాన్సీని… వర్షిణి వచ్చేసి సుధీర్‌ని.. నరేష్ వచ్చేసి వంశీని సేవ్ చేశాడు. దీంతో నామినేషన్స్‌లో రోహిత్, షాలిని, రామకృష్ణ ఉన్నారు.
గ్రీన్ జోన్లో ఉన్న ఐదుగురికి ఐదు ఎగ్జిట్ బ్యాండ్స్ ఇచ్చారు. వారు నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు రోహిత్, షాలిని, రామకృష్ణలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక ఎగ్జిట్ బ్యాండ్ ఇవ్వాలి. దేబ్జాని, నీతూ.. షాలినికి అమన్, ముఖేష్ వచ్చేసి రామకృష్ణకు ఎగ్జిట్ బ్యాండ్ ఇవ్వడంతో త్రిగుణ్ ఓటు కీలకమైంది. త్రిగుణ్ వచ్చేసి షాలినికి ఎగ్జిట్ బ్యాండ్ ఇచ్చాడు. దీంతో షాలిని ఎగ్జిట్ అయ్యింది. రోహిత్ గుడ్ ప్లేయర్ అని.. రామకృష్ణ కూడా చాలా బాగా ఆడతాడని.. ముగ్గురిలో షాలిని డిజర్వ్ కాదని త్రిగుణ్ చెప్పడం విశేషం. రోహిత్‌కు ఐలవ్యూ చెప్పి మరీ షాలిని వెళ్లిపోయింది. షాలిని స్టేజ్ పైకి వచ్చింది. ఆమె జర్నీ గత వారం చూపించారు కాబట్టి మళ్లీ చూపించలేదు. షాలిని వెళుతుంటే నాగ్ వెనక్కి పిలిచారు. ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. రామ్ ప్రసాద్.. షాలినిని వెనక్కి పిలవడంతో ఏంటి కంగారు పడ్డావా? అని అడిగారు. కంగారేమీ లేదని చెప్పారు. జనాలు తగ్గితే బాగుంటుందని చెప్పడంతో వచ్చేయమని నాగ్ చెప్పారు. ఈవారం బిగ్‌బాస్ అవతారం వచ్చేసి ‘ది అల్టిమేట్ గోట్’ అని నాగ్ చెప్పారు. శివ్‌కు హ్యాండ్ కప్స్ వేసి జైలులో పెట్టమని నాగ్ చెప్పారు. ఇవాళంతా ప్రమోషన్స్‌తోనే గడిచింది. డాన్యూబ్ చైర్మన్‌తో ఒక అరగంట సరిపోయింది. ఆ తరువాత విశ్వక్సేన్ వచ్చేసి మరో పది నిమిషాలు.. సండే షోలో ఎలిమినేషన్స్ తప్ప పసలేదు.
ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి.…
బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…
ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…
ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…
సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ దక్కుతుందో, అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా…