సినిమా వార్తలు

Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..

ఇవాళ్టి (శుక్రవారం) షో అంతా వన్ సైడెడ్‌గా జరిగింది. పూర్తిగా సెలబ్రిటీలకు ఫేవర్‌గా జరిగింది. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసుకుందాం. దేబ్జాని.. నరేష్‌ను టీజ్ చేస్తుండగా ఎపిసోడ్ ప్రారంభమైంది. లీస్ట్ టు ఉన్న పెయిర్స్ ముఖేష్, ఝాన్సీ.. రోహిత్, షాలినిలు ఒక ఖటినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. జంటలో ఒకరు డేంజర్ జోన్‌లో ఉంటారని.. మరొకరు టాస్క్ ఆడతారని బిగ్‌బాస్ చెప్పారు. ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారో నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. హైడ్రామా తర్వాత రోహిత్ డేంజర్ జోన్‌లోకి వెళ్లాడు. ఝాన్సీ తన దగ్గర పవర్ ఉంది కాబట్టి దానిని వాడుకుంటానని.. కాబట్టి తాను ఎలిమినేషన్‌కి వెళతానని ఝాన్సీ చెప్పింది. ఇక టాప్‌లో ఉన్న చరణ్, అపూర్వ.. రామ్ ప్రసాద్, నరేష్ జంటలతో పాటు షాలిని, ముఖేష్‌లతో టాస్క్ ప్రారంభమైంది.

లీడర్ బోర్డులో టాప్ పొజిషన్‌కు వెళ్లేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. ఫ్లిప్ చెయ్యి..ఫేస్ చెయ్యి. ఈ ఛాలెంజ్‌లో పోటీదారులంతా బటర్‌ఫ్లై బ్లాక్స్ ఏర్పాటు చేశారు. వాటిపై నిలబడి.. అక్కడ ఉన్న బ్లాక్స్‌ను తిప్పి చూసి దానిలో ఏముందో అది డేంజర్‌ను ఫేస్ చేయాలి. ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. దేబ్జాని, ఝాన్సీ ఈ టాస్క్‌కు సంచాలకులు. ముఖేష్‌కు ఫైట్ ఇన్ స్లో మోషన్ అనే డేంజర్ వచ్చింది. వంశీతో ఆ టాస్క్‌ను ముఖేష్ కంప్లీట్ చేశాడు. త్రిగుణ్ కామెంట్ చేయడంతో ముఖేష్ ఫైర్ అయ్యాడు. ఆ తరువాత ముఖేష్‌కే డేంజర్ వచ్చింది. ఫైవ్ వియర్డ్ ఫేసెస్ పెట్టమంటే.. ముఖేష్ బాగా పెట్టాడు. అపూర్వకు ‘హౌస్ నుంచి ఒకరిని తొలగించాలి. అనగానే.. అంతా కలిసి అపూర్వనే గేమ్ నుంచి తొలగించారు. డైస్ వేయాలి. లీస్ట్ నంబర్ ఎవరికి వస్తే వాళ్లు సేఫ్. చివరకు చరణ్, ముఖేష్ మిగిలారు. ఆ తరువాత డైస్ వేయాలి. హయ్యస్ట్ నంబర్ వచ్చేలా వేయాలి. ఈ రౌండ్‌లో షాలిని ఎలిమినేట్ అయ్యింది. నెక్ట్స్ రౌండ్ వచ్చేసి యాక్ట్ లైక్ ఏ మస్కిటో టాస్క్‌ ముఖేష్‌కు వచ్చింది. దానిని అతను బాగానే చేశాడు. నరేష్ ఒకవేళ దోమ అయితే ఎలా చేస్తావో చేసి చూపించమని బిగ్‌బాస్ చెప్పడంతో నరేష్ చేశాడు.

ముఖేష్‌కు ఈసారి యూఆర్ ఎలిమినేటెడ్ వచ్చింది. చరణ్‌కు ‘ఫేక్ ప్రైజ్ యువర్ ఎనిమీ (మీ శత్రువుని ఫేక్‌గా ప్రశంసించాలి) దీనికి వంశీని ఎంచుకుని అద్భుతంగా ప్రశంసించాడు. ఝాన్సీని ఎలా అనిపించిందంటే తనకు పాయింట్ అవుట్ చేసినట్టుగా అనిపించింది కానీ పొగడలేదని చెప్పింది. చరణ్‌కు దేబ్జాని, ఝాన్సీ కలిసి చాలా అన్యాయం చేశారు. రామ్ ప్రసాద్‌కు ‘మీ మోచేతిని నాకాలి’ అని వచ్చింది. ట్రై చేశాడు కానీ అవలేదు. ఈ టాస్క్‌లో ఫెయిల్ అయినా కూడా దేబ్జాని, ఝాన్సీ కలిసి 8 ఇచ్చారు. చాలా పార్షియల్‌గా వాళ్లిద్దరూ సంచాలక్ చేశారు. ఆ తరువాత రామ్ ప్రసాద్‌కుపెద్దగా అరిచే టాస్క్ రావడంతో రామ్ ప్రసాద్ గట్టిగా అరిచాడు. రామ్ ప్రసాద్‌కి డ్యాన్స్ వేయడం టాస్క్ వచ్చింది. ఒకరిని ఎంచుకుని వారితో డ్యాన్స్‌లో పోటీ పడాలి. చరణ్ అద్భుతంగా చేశాడు కానీ సెలబ్రిటీలంతా రామ్ ప్రసాద్‌కు ఓటేయడంతో రామ్ ప్రసాద్ టాస్క్ గెలిచాడు. ఝాన్సీ కూడా రామ్ ప్రసాద్‌కు ఓటేసింది. ఝాన్సీ ఇవాళ చాలా పార్షియాలిటీ చూపించింది. తన గ్రాఫ్ మొత్తం పడగొట్టుకునేలా ఆడుతోంది.

చరణ్‌ని రమ్మని రోహిత్ పిలవడంతో షాలిని వద్దన్నది. షాలిని కూడా అక్కడకు రావడంతో మళ్లీ గొడవ జరిగింది. రోహిత్ కూడా ప్రతి దానికి షాలినితో గొడవ పడుతున్నాడు. షాలినికి నచ్చడం లేదని రోహిత్‌కు నచ్చడం లేదో అసలేం జరుగుతుందో తెలియడం లేదు. ‘నువ్వు లైట్ తీసుకో.. మానుంచి సపోర్ట్ ఆశించకు’ అని చెబుదామని షాలినికి రోహిత్‌కి చెప్పాడు. వీరిద్దరూ ఏమాత్రం కరెక్ట్‌గా అనిపించడం లేదు. షాలినితో చేరి రోహిత్ బాగా దారి తప్పుతున్నాడు. ఇక స్కోర్ బోర్డులో ఫస్ట్ ప్లేసులో రామ్ ప్రసాద్, నరేష్ ఉండగా రెండవ స్థానంలో రోహిత్, షాలిని జంట.. మూడవ స్థానంలో ముఖేష్, షాలిని ఉన్నారు. ఇక ఇప్పుడు రామ్ ప్రసాద్, నరేష్‌లను చర్చించుకుని ఎవరు డేంజర్‌లో ఉంటారో చెప్పమన్నారు. దీంతో నరేష్ డేంజర్‌‌ను ఎంచుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ప్రారంభమైంది. దీనికి ముందు ఝాన్సీకి తన పవర్‌ను యూజ్ చేసుకోమంటూ కీ పంపించారు. ఆమె తన పవర్‌ని యూజ్ చేసుకుని ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఆ తరువాత అసలు డ్రామా ప్రారంభమైంది.

ఝాన్సీ తన పవర్‌ని యూజ్ చేసుకోవడంపై రోహిత్, షాలినిలు తప్పుబట్టారు. 8వ వారంలో యూజ్ చేసుకుంటే బాగుంటుందనేది వారి భావన. సుధీర్, వంశీ, వర్షిణి, దేబ్జాని, త్రిగుణ్, అమన్, రామ్‌ప్రసాద్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా వారి నుంచి ఇద్దరిని తొలగించమని బిగ్‌బాస్ చెప్పారు. వాస్తవానికి త్రిగుణ్, అమన్ తనకు కెప్టెన్సీ ఛాన్స్ ఇస్తానంటేనే ఒప్పుకుంటానని ముందే చెప్పాడు. కానీ త్రిగుణ్ మాట తప్పాడు. ఓటింగ్ పెట్టడంపై అమన్ వచ్చేసి రోహిత్ వాళ్లకు చెప్పాడు. ఓటింగ్‌కు ఒప్పుకోవద్దని రోహిత్ చెప్పాడు. కానీ అక్కడున్నదంతా సెలబ్రిటీలే. మరి అమన్ మాట ఎక్కడ చెల్లుతుంది? ఫైనల్‌గా వర్షిణి, అమన్‌ను తప్పించారు. సెలబ్రిటీలు ఎక్కువ మంది ఉండటంతో కామనర్స్‌కు పదే పదే అన్యాయం జరుగుతోంది. ఓటింగ్ పెడితే సెలబ్రిటీలంతా తప్పొప్పులు ఆలోచించకుండా సెలబ్రిటీలకే ఓటేస్తున్నారు. ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోనూ అదే జరిగింది. బిగ్‌బాస్ కూడా మొదటి నుంచి సెలబ్రిటీలకే ఫేవర్‌గా ఉన్నాడు కాబట్టి వాళ్లకే టాస్క్ పెట్టాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఆడేవాళ్లంతా కలిసి ఇద్దరు సపోర్టర్స్‌ను ఎంచుకోమన్నారు. దీనికి అమన్, ఝాన్సీలను ఎంచుకున్నారు. ఈ టాస్క్‌కు అపూర్వ సంచాలక్.

కెప్టెన్సీ టాస్క్ వచ్చి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’. బీన్ బ్యాగులు పెట్టారు. వాటిలో షిప్‌కి సంబంధించిన పీసెస్ పెట్టారు. బీన్ బ్యాగుల్లోని పీసులతో సగం షిప్‌ను తయారు చేసిన మీదట మరో రెండు రౌండ్స్ ఆడాల్సి ఉంటుంది. అన్ని రౌండ్స్ చకచకా ఆడి సుధీర్ కెప్టెన్ అయ్యాడు. ఫ్రెండ్షిప్ మన ఆటను చెడగొట్టలేదు అనడానికి ఈ టాస్కే నిదర్శనమని ఝాన్సీ చెప్పింది. ఝాన్సీ మినహా కామనర్స్ ఫేస్‌లన్నీ వెలవెలబోయాయి. ఒక్కరి ఫేస్‌లోనూ నవ్వు లేదు. కెప్టెన్సీ బ్యాండ్‌ను కొత్త కెప్టెన్‌కు వర్షిణి పెట్టింది. సుధీర్ కెప్టెన్ అయినందుకు సెలబ్రిటీలంతా చర్చించుకుంటున్నారు. సుధీర్ వచ్చేసి కామనర్స్ మొహాలన్నీ మాడిపోయాయని చెప్పాడు. ఎవరికి వచ్చినా మన చేయి దాటి పోలేదని సుధీర్.. న్యాయం గెలవాలని నరేష్ అన్నాడు. అసలు న్యాయం ఎక్కడుందనేది అర్థం కాలేదు. వైట్ గోల్డ్ మెడల్ వచ్చింది. అందరం బాగా కలిసుందాం.. కలిసి ఆడుదామని సుధీర్ చెప్పాడు. అసలు ఈ విషయంలో ముందుగా సుధీరే సెలబ్రిటీలు, కామనర్స్‌ను సెపరేట్ చేస్తుంటాడు. మొత్తానికి కామనర్స్‌కు దారుణమైన అన్యాయం జరిగింది. సెలబ్రిటీలు ఇక ముందు కూడా మారే పరిస్థితే కనిపించడం లేదు. అమెజాన్ వచ్చేసి కంటెస్టెంట్స్‌కు గిఫ్ట్ పంపించింది. దీంతో ఎవరికి కావల్సిన గిఫ్ట్స్‌ను వాళ్లు ఎంచుకోవడంతో షో ముగిసింది.

Telugu Cinema 360

Recent Posts

నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?

బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…

7 hours ago

విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…

8 hours ago

Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..

బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు.…

9 hours ago

విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా…

9 hours ago

సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ ఎప్పుడూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది.…

9 hours ago

మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘రణబాలి’ చిత్ర ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్…

1 day ago