
బాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి అప్పుడే ఒరిజినల్ టాక్ బయటికి వచ్చేసింది. మేకర్స్ రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమాకు ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ షో చూసిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఓవరాల్ గా చూస్తే బాగుంది అంటున్నప్పటికీ, ఇది ఒక అద్భుతం అని మాత్రం ఎవరూ అనట్లేదు. జస్ట్ ఓకే అనే రేంజ్ లో మాత్రమే అక్కడి ఇంటర్నేషనల్ ఆడియన్స్ స్పందిస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ యవరేజ్ టాక్ కొద్దిగా టెన్షన్ పెడుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి పాజిటివ్ బజ్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక సినిమా చూసిన వాళ్ళు ప్రధానంగా చెబుతున్న కంప్లైంట్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఎమోషన్స్ గురించే. ఒక మైథలాజికల్ సినిమాలో ఆడియన్స్ ఆశించే రేంజ్ లో గ్రాఫిక్స్ లేవని, విజువల్స్ విషయంలో కొన్ని లోపాలు కచ్చితంగా ఉన్నాయని విదేశీ ప్రేక్షకులు స్పష్టంగా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మీద రాకింగ్ స్టార్ యశ్ ముందుగానే ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడు. అప్పుడు ఆయన చెప్పిందే ఇప్పుడు నిజమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిన కథే. కాబట్టి అందులో కొత్తదనం వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి ఒక ఎపిక్ స్టోరీని తెరకెక్కించినప్పుడు అందులో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డెప్త్ చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు ఈ సినిమాలో అదే మిస్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆత్మ లేని విజువల్స్ వల్ల సినిమాకు పెద్ద మైనస్ పడింది.
నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, లీడ్ పెయిర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు అనే కామెంట్స్ వస్తున్నాయి. శ్రీరాముడిగా నటించిన రణ్బీర్ కపూర్ అంతగా మెప్పించలేదనే వార్తలు వస్తున్నాయి. దేవుడి పాత్రలో ఆయన లుక్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ కాలేదని తెలుస్తోంది. అలాగే సీత పాత్రలో నటించిన మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సైతం ఈ సినిమాలో జస్ట్ సోసోగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన అద్భుతమైన యాక్టింగ్ తో అందరినీ కట్టిపడేసే సాయి పల్లవికి కూడా, ఈ రామాయణంలో తన మార్క్ చూపించే స్కోప్ దొరకలేదని టాక్. ఒక పౌరాణిక సినిమాలో మెయిన్ లీడ్ పెయిర్ పర్ఫార్మెన్స్ వీక్ గా ఉండటం, వాళ్ళ మధ్య సరైన కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోవడం సినిమా రిజల్ట్ మీద కచ్చితంగా చాలా పెద్ద నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.

ఇన్ని నెగెటివ్ పాయింట్స్ మధ్య ఈ సినిమాకు ఒకే ఒక్క మేజర్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాకింగ్ స్టార్ యశ్ మాత్రమే. రావణాసురుడి పాత్రలో ఆయన నటవిశ్వరూపం చూపించాడని, సినిమాను తన ఒంటిచేత్తో మోసాడని ప్రీమియర్ షో చూసిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ చెప్తున్నారు. తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో, బేస్ వాయిస్ తో, కళ్లు చెదిరే డైలాగ్ డెలివరీతో సినిమా రేంజ్ ను పెంచే ప్రయత్నం చేశాడు. నెగెటివ్ రోల్ లో ఆయన పండించిన ఎక్స్ప్రెషన్స్, ఆయన క్రూరమైన నవ్వు సినిమాకే అతిపెద్ద హైలైట్ గా నిలిచాయి. హీరో క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ ఈ స్థాయిలో ఎలివేట్ అవ్వడం ఈ రామాయణ పార్ట్ 1కి ఒక రకంగా అతిపెద్ద అసెట్. యశ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉండబోతుందని ఇట్టే అర్థం అవుతుంది.
ఇప్పుడు అందరి దృష్టి బాక్సాఫీస్ కలెక్షన్స్, ఈ సినిమా బడ్జెట్ లెక్కల మీదే ఉంది. దాదాపు 2 వేల కోట్ల కళ్ళు చెదిరే బడ్జెట్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూసుకుంటే రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వాలన్నా లేదా హిట్ అనిపించుకోవాలన్నా కనీసం 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. లాస్ ఏంజిల్స్ లో వచ్చిన ఈ ఓకే టాక్ గనక మన దగ్గర కూడా రిపీట్ అయితే మాత్రం, ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అసాధ్యం. ఇండియాలో విజువల్స్, ఎమోషన్స్ ఏమాత్రం వర్కవుట్ అవ్వకపోయినా కలెక్షన్స్ భారీగా డ్రాప్ అవుతాయి. ఇలాంటి మిక్స్డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర నిలబడటం చాలా కష్టం. మరి మన ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏ రకమైన తీర్పు ఇస్తారో తెలియాలంటే నవంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. చూడాలిక ఏం జరగబోతుందో.
