Menu
BREAKING
పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!   |   Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?   |   Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..   |   Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?   |   మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!

పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!

పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!

సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2021 అక్టోబర్ 29న కర్ణాటక రాష్ట్రం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. వాళ్ల పాలిట దేవుడు లాంటి మనిషి, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ఇక లేరనే వార్త విని కోట్ల మంది అభిమానుల గుండెలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అప్పటి వరకు ఎంతో యాక్టివ్ గా మన కళ్ళ ముందే తిరిగిన మనిషి సడన్ గా లేడు, ఇక ఎప్పటికీ రాడు అని తెలిసి ఫ్యాన్స్ తల్లడిల్లిపోయారు. ఆయన మరణవార్త తట్టుకోలేక షాక్ తో ఎంతోమంది ప్రాణాలు వదిలారు. కోట్లాది మంది గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్న ఆ మహామనిషి పునీత్ రాజ్ కుమార్ 5వ వర్ధంతి నేడు. ఈ రోజుకు కూడా ఆయన లేరు అనే నిజాన్ని కన్నడనాట ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చిరునవ్వు, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల మదిలో సజీవంగానే ఉంటాయి.

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉండొచ్చు కానీ, పునీత్ లాంటి రియల్ హీరోలు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. జీవితం అంటే కేవలం సినిమాలు యాక్టింగ్ మాత్రమే కాదు, ఇంకెంతో ఉందని తన చేతలతో నేర్పించాడు మన అప్పు. తను బతికిన 46 ఏళ్లు కేవలం తన కోసమే కాదు, సమాజం కోసం, తనను నమ్మిన ప్రజల కోసం కూడా బతికాడు. ఆయన ఒక గొప్ప ప్రకృతి ప్రేమికుడు. ఎన్నో మూగజీవాలను తన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. తన సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశాడు. ఎంతోమంది పేద వసతి లేని స్టూడెంట్స్ ను సొంత ఖర్చులతో చదివించాడు. ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపాడు. తన మరణం తర్వాత కూడా ఈ సేవలు ఏమాత్రం ఆగిపోకూడదని ముందే ఆలోచించి, ఏకంగా 5 కోట్ల రూపాయలు ట్రస్ట్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన అసలు సిసలైన మహామనిషి పునీత్ రాజ్ కుమార్.

పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!

ఇక పునీత్ సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఆయన చేసిన సినిమాల్లో దాదాపు 90 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండటం విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ గానే భక్త ప్రహ్లాద, బెట్టద హూవు లాంటి సినిమాలతో నేషనల్ అవార్డులు అందుకున్న ఆయన, హీరోగా కూడా బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. 2002లో అప్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పునీత్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అప్పు ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆయన పేరు కాస్తా అప్పుగా మారిపోయింది. ఆ తర్వాత అభి, వీర కన్నడిగ, మౌర్య, ఆకాశ్, అరసు, మిలాన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనదైన యాక్టింగ్, కళ్లు చెదిరే డాన్స్, పవర్ ఫుల్ ఫైట్స్ తో ఆడియన్స్ కు 100 పర్సెంట్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు.

కేవలం లవ్ స్టోరీలే కాకుండా, మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా పునీత్ చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. వంశీ, రామ్, జాకీ, పరమాత్మ, అన్నా బాండ్, పవర్, రణవిక్రమ, దొడ్డమనే హుడ్గా, రాజకుమార, నటసార్వభౌమ, యువరాత్న లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు. రాజకుమార సినిమా అయితే కన్నడ ఇండస్ట్రీ రికార్డులను అన్నింటినీ బద్దలుకొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లలో విజిల్స్ దద్దరిల్లిపోయేవి. ఇన్ని దశాబ్దాల క్యారియర్ లో ఏ రోజు కూడా చిన్న వివాదాల జోలికి వెళ్లకుండా, అందరివాడు అనిపించుకున్నాడు కన్నడ పవర్ స్టార్.

పునీత్ రాజ్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జేమ్స్ ఆయన మరణించిన ఆర్నెళ్లకు థియేటర్లలోకి వచ్చింది. ఆయన చనిపోయారనే బాధలో ఉన్న అభిమానులకు జేమ్స్ సినిమా ఒక ఎమోషనల్ ట్రీట్ లాగా అనిపించింది. ఈ సినిమా రిలీజ్ రోజున కర్ణాటక అంతటా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కంటతడి పెట్టుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి, ఆయనకు ఒక ఘనమైన సెండ్ ఆఫ్ ఇచ్చింది. దీని తర్వాత ప్రకృతి పై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ గంధద గుడి అనే డాక్యుమెంటరీ కూడా రిలీజై అందరి మన్ననలు పొందింది. మనిషిగా ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా, తన అద్భుతమైన సినిమాలతో, చేసిన గొప్ప సేవా కార్యక్రమాలతో అప్పు ఎప్పటికీ మన గుండెల్లో బతికే ఉంటాడు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360