Menu
BREAKING
దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి   |   ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల…   |   ‘ఓ.! సుకుమారి’ సెన్సార్ పూర్తి.. జూలై 17న పాన్ ఇండియా రిలీజ్   |   ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం   |   తలైవర్ 173 టైటిల్ రివీల్… ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’గా రజనీకాంత్ సరికొత్త అవతారం   |   ‘ఓజి 2’ నిర్మాణంపై కొత్త బజ్..   |   రవితేజ ‘ఇరుముడి’లో అసలు హైలెట్ ఆ ట్విస్టేనా?   |   ‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు చిరంజీవి అభినందనలు.. సమంత-రాజ్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్   |   ‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..   |   ‘మా చరణ్ బంగారం’.. రామ్ చరణ్‌పై సుకుమార్ ప్రశంసలు, RC17 అప్డేట్‌పై క్లారిటీ   |   శ్రీలీలకు అవమానమా? ముంబై ఈవెంట్‌లో వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ

దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి

దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి

ప్రముఖ నటి కలర్స్ స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, “Hitched. 08-07-2026” అనే చిన్న క్యాప్షన్‌తో తమ కొత్త జీవితాన్ని అధికారికంగా ప్రకటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో స్వాతి, శ్రీకాంత్ నాగోతి సంప్రదాయ హిందూ వివాహ పద్ధతుల్లో పవిత్ర అగ్ని సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వివాహ వేడుక అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఇది స్వాతి జీవితంలో రెండో వివాహం. గతంలో ఓ పైలట్‌ను వివాహం చేసుకున్న ఆమె, కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇండోనేషియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన స్వాతి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తన నటనా ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించారు.

ఈ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంలో కలిసి పనిచేశారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఆ చిత్రంతో ప్రారంభమైన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టింది.

స్వాతి వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360