Menu
BREAKING
అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?

ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం

ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం అతడిపై దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, తప్పుగా ఆర్డర్ డెలివరీ అయిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ అఖిల్ రాజ్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. వీడియోలో అఖిల్ రాజ్ అతడి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా, వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తిని రికార్డింగ్ ఆపాలని, వీడియో డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్లుగా కూడా వినిపిస్తోంది. మరోవైపు, ఫుడ్ డెలివరీ బాయ్ తనకు తప్పిదం జరిగినందుకు క్షమాపణ చెప్పానని చెబుతున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సిబ్బందితో మర్యాదగా వ్యవహరించాలని, చిన్న తప్పిదానికి ఇలాంటి ప్రవర్తన సమంజసం కాదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పూర్తి వివరాలు బయటకు రావాలని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అఖిల్ రాజ్ ‘అర్జునుడి గీతోపదేశం’ చిత్రంలో నటిస్తున్నారు. సతీష్ గోగాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న వీడియోపై అఖిల్ రాజ్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360