Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?
Hanuman Ansh
MOVIE REVIEW

Hanuman Ansh

★ 2.75 / 5
Release Date: October 7, 2026
Cast
Shobhinaw Satya, Chandan K. Anand, Anil Rastogi, Nikhil Dubey, Neha Paranjpe
Director
Vishal Chaturvedi
Music Director
Sadhu Sushil Tiwari
Producer
Ragini Sona, Namrata Singh, Vishal Chaturvedi, Anupriya A. Nagar

Hanuman Ansh Review

గత రెండు నెలలుగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న చిత్రం హనుమాన్ అంశ్. జస్ట్ 2 కోట్లతో తెరకెక్కి ఏకంగా 400 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అసలు ఈ రేంజ్ సక్సెస్ సాధించడానికి ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి అన్నది రివ్యూలో డిటైల్డ్ గా తెలుసుకుందాం.

‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నార్త్‌లో సంచలనం రేపిన నీమ్ కరోలీ బాబా జీవితం ఎలా ఉంది..?

కథ:

అది 1914వ సంవత్సరం. 13 బాలుడు లక్ష్మీనారాయణ్ శర్మ (శోభినవ్ సత్య) కన్నతల్లి మరణంతో పాటు, నాన్న వేరే పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతాడు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా రాముడి దర్శనం పొందవచ్చని, అప్పుడు దేవుడి పాదాల చెంత ఉన్న తన అమ్మను మళ్ళీ చూడొచ్చని గాఢంగా విశ్వసిస్తాడు. ఆ స్పిరిచ్యువల్ జర్నీలో ఆ కుర్రాడికి ఎదురైన అనుభవాలు ఏంటి? ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాక నీమ్ కరోలీ బాబాగా ఎలా మారిపోయాడు..? తనను నమ్ముకున్న భక్తుల జీవితాలను ఎలా మార్చాడు? చివరగా భక్తి మార్గం ద్వారా తన మాతృమూర్తిని చేరుకున్నాడా అనే పాయింట్స్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది..

స్క్రీన్ ప్లే:

విశాల్ చతుర్వేది రచించిన బుక్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లక్ష్మీనారాయణ్ ఆధ్యాత్మిక అన్వేషణతో చాలా గ్రిప్పింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ తో దేవుడిని చేరుకోవాలని పడే ఆరాటం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆకలితో ఉన్న పేద పిల్లలకు తన ఫుడ్ ను ఇవ్వడం, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి మైండ్ సెట్ మార్చే ఎపిసోడ్, రాజ్‌కోట్ టెంపుల్ సీన్స్ చూస్తున్నప్పుడు తెలియని ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అలాగే రాముడి విశిష్టతను వివరించే డైలాగ్స్ మన మనసుకు హత్తుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఒక డివైన్ ఫీలింగ్ తో సినిమా ఎంగేజింగ్ గా వెళ్తుంది. థియేటర్లో ఉన్నా సరే, ఎదో గుడిలో కూర్చున్నట్లు రామ్ రామ్ అనే జపమే మనకు వినిపిస్తుంది. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్ మెయిన్ ఎమోషన్ ను పక్కనపెట్టేసి, కేవలం బాబా చేసిన మహిమలను ఎలివేట్ చేయడంపైనే ఫుల్ గా ఫోకస్ చేశాడు. లక్ష్మీనారాయణ్ నీమ్ కరోలీ బాబాగా మారిన తర్వాత రాళ్లను మిఠాయిలుగా మార్చేయడం, తన పవర్ తో రైలు టికెట్స్ తీసుకురావడం, నడుస్తున్న రైలును ఆపడం, ఎలాంటి తాళాలు లేకపోయినా జైలు తలుపులు ఓపెన్ అవ్వడం లాంటి మ్యాజిక్స్ అన్నీ స్క్రీన్ మీద బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తాయి.

‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నార్త్‌లో సంచలనం రేపిన నీమ్ కరోలీ బాబా జీవితం ఎలా ఉంది..?

ఇక్కడే కామన్ ఆడియన్స్ కు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దేవుడి మీద భక్తిని చూపించడం కంటే, ఒక మనిషిని దేవుడిగా ప్రొజెక్ట్ చేయడం కాస్త ఓవర్ గా అనిపించవచ్చు. బాబాను, ఆయన మిరాకిల్స్ ను గుడ్డిగా ఫాలో అయ్యే డివోటీస్ కు ఈ సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది. కానీ లాజికల్ గా ఆలోచించే వాళ్లకు మాత్రం ఇదంతా టూ మచ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఈ మ్యాజిక్ ట్రిక్స్ తగ్గించి, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎమోషనల్ డెప్త్ ను కంటిన్యూ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉండేది. నార్త్ ఇండియాలో బాబాకు ఉన్న ఫ్యాన్ బేస్, భక్తుల వల్లే ఈ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగులో ప్రమోట్ చేయడంతో ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే దైవభక్తి, స్పిరిచ్యువాలిటీ అంటే ఇష్టమున్న వారికి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్.

నటీనటులు:

ఈ సినిమా సక్సెస్ లో మెయిన్ క్రెడిట్ అంతా నీమ్ కరోలీ బాబాగా నటించిన శోభినవ్ సత్యకే ఇవ్వాలి. నిజమైన బాబాను చూస్తున్నామా అన్నంత న్యాచురల్ గా తన స్మైల్, వాకింగ్ స్టైల్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ ను చాలా ఆథెంటిక్ గా ప్రెజెంట్ చేశాడు. ఇక బాబాకు వీరాభిమాని అయిన భగవన్‌దాస్ పటేల్ రోల్ కు మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది, ఆ ఛాన్స్ ను సదరు నటుడు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. డాక్టర్ రామ్ నందన్ పాత్రలో చందన్ కె ఆనంద్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ రోల్స్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

మ్యూజిక్ డైరెక్టర్ సాధు సుశీల్ తివారీ అందించిన ట్యూన్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఆ హనుమాన్, శివ, రామ నామ స్మరణతో వచ్చే మ్యూజిక్ షో పూర్తయ్యాక కూడా మన మైండ్ లో అలానే రన్ అవుతుంటుంది. శంఖ్ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. డబ్బింగ్ వర్క్, తెలుగు డైలాగ్స్ కూడా న్యాచురల్ గా సింక్ అయ్యాయి. విశాల్ బావా కెమెరా వర్క్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల స్క్రీన్ మీద గ్రాండియర్ మిస్ అయిందనే విషయం ఫ్రేమ్స్ లో క్లియర్ గా తెలుస్తుంది.

చివరగా:

హనుమాన్ అంశ్.. భక్తితో కూడిన ఒక డివైన్ ఎక్స్పీరియన్స్!

Hanuman Ansh Cast

Shobhinaw Satya Chandan K. Anand Anil Rastogi Nikhil Dubey Neha Paranjpe