Menu
BREAKING
Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?
Comrade Kalyan
MOVIE REVIEW

Comrade Kalyan

★ 2.25 / 5
Release Date: October 9, 2026
Cast
Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar, Shine Tom Chacko, Upendra Limaye, Brahmaji, Shatru, Satya, Vennela Kishore
Director
Janakiram Marella
Music Director
Vijai Bulganin
Producer
Venkata Krishna Karnati, Seetha Karnati, and presenter Kona Venkat
Banner
Haashtag Media, Kona Film Corporation, Skanda Vahana Motion Pictures

Comrade Kalyan Review

కామెడీ పండించడంలో దిట్ట అయిన శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. కోన వెంకట్ రచనా సహకారం అందించిన ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ కామెడీ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో పరిశీలిద్దాం.

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నక్సలైట్ కామెడీ వర్కవుట్ అయిందా..?

కథ:

90ల్లో నక్సలిజం ప్రాబల్యం అధికంగా ఉన్న ఒక అటవీ ప్రాంతం ఈ కథకు మూలం. ఆ ప్రదేశానికి ప్రత్యేక ఆఫీసర్‌గా వచ్చిన జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో)పై అన్నలు దాడికి దిగుతారు. ఇదే సమయంలో దగ్గర్లోని మాడుగుల గ్రామంలో థియేటర్ లో పని చేసే కుర్రాడు కళ్యాణ్ (శ్రీవిష్ణు). అక్కడికి కొత్తగా వచ్చిన సితారను (మహిమ నంబియార్) చూడగానే ఇష్టపడతాడు. ఆమె కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకోవడంతో, బిష్వాస్ (ఉపేంద్ర లిమియా) అనే ఫైనాన్షియర్ వాళ్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. బాకీ తీర్చకపోతే ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు. ప్రియురాలిని కాపాడుకునే ఉద్దేశ్యంతో ఆ బాధ్యతను హీరో తన భుజాలపై వేసుకుంటాడు. డబ్బులు సమకూర్చే క్రమంలో తన మిత్రులతో కలిసి అతడు ఎలాంటి వ్యూహాలు రచించాడు? ఆ ప్రయాణంలో మామూలు కుర్రాడు కాస్తా కామ్రేడ్ గా ఎలా మారాడు? ఆఖరికి తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనేది మిగిలిన సినిమా సారాంశం.

స్క్రీన్ ప్లే:

నక్సలిజం, పోలీసుల తీరు లాంటి ఒక సీరియస్ అంశాన్ని తీసుకుని దానికి నవ్వుల పూత పూయాలని దర్శకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఇలాంటి సున్నితమైన నేపథ్యానికి వినోదాన్ని జోడించడం అనేది ఒక పెద్ద రిస్క్. ఆరంభంలో పాత్రల పరిచయం, ప్రేమకథ, డబ్బులు వెతికే క్రమం కొంతవరకు కాలక్షేపం లాగా అనిపిస్తుంది. అక్కడక్కడా శ్రీవిష్ణు మార్క్ పంచ్ లు పేలినా, అవి మొత్తం సినిమాను నిలబెట్టే స్థాయిలో లేవు. ఫస్టాఫ్ కాస్త పర్వాలేదు అనిపించినా, ఇంటర్వెల్ తర్వాత వ్యవహారం పూర్తిగా గాడి తప్పింది. అడవిలోకి కథ వెళ్ళాక, అక్కడ గన్ పట్టుకున్న వాళ్ల మధ్య కూడా బలవంతంగా కామెడీ ఇరికించడం చాలా అసహజంగా అనిపిస్తుంది. సీరియస్ గా సాగాల్సిన చోట పాత చింతకాయ పచ్చడి లాంటి జోకులు వేయడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఒక మినిస్టర్ కిడ్నాప్ ఎపిసోడ్, వెన్నెల కిషోర్, ఉపేంద్ర ట్రాక్ లు మరీ సిల్లీగా సాగుతాయి. స్క్రీన్ ప్లే పరంగా కోన వెంకట్ తన పాత సినిమాల ఫార్మాట్ ను ఏమాత్రం మార్చకుండా ఇక్కడా వాడేశాడు. కొత్త పాత్రలు లేకపోవడం, ఒకే తరహా వినోదాన్ని మళ్లీ మళ్లీ చూపించడంతో ప్రేక్షకులకు సహనం నశిస్తుంది. తొంభైల కాలం నాటి కథ అని చెబుతూనే, ప్రస్తుత కాలంలో వచ్చిన ప్యారడైజ్ లాంటి సినిమాల మీద సెటైర్లు వేయడం దర్శకుడి లాజిక్ లేమిని స్పష్టం చేస్తుంది. మొత్తానికి నవ్వించడానికి చేసిన ప్రయత్నం విఫలమై, సినిమా గమ్యం తెలియకుండా సాగుతుంది.

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నక్సలైట్ కామెడీ వర్కవుట్ అయిందా..?

నటీనటులు:

పసలేని మాటలకు కూడా తన అద్భుతమైన టైమింగ్ తో ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు శ్రీవిష్ణు. సినిమాను తన భుజాలపై మోయడానికి శాయశక్తులా కృషి చేశాడు. ఇక సత్య తన ఎంట్రీతో కొంతసేపు బాగానే నవ్వించాడు. తన బాడీ లాంగ్వేజ్ తో తొలి భాగంలో కాస్త రిలీఫ్ ఇచ్చాడు. హీరోయిన్ మహిమ కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితం అయింది. విలన్ గా ఉపేంద్ర నటన ఏమాత్రం కొత్తగా లేదు, బాగా రొటీన్ గా అనిపిస్తుంది. కీలకమైన పోలీసు అధికారి పాత్రలో కనిపించిన షైన్ టాం చాకోను సరిగ్గా వాడుకోలేదు. సీనియర్ నటి రాధిక ఆరంభంలో కాస్త హడావిడి చేసినా, ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఎటో వెళ్ళిపోయింది.

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నక్సలైట్ కామెడీ వర్కవుట్ అయిందా..?

టెక్నికల్ టీం:

విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన బాణీల్లో ఒక రొమాంటిక్ ట్రాక్, అలాగే విప్లవ గీతం వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం కథలోని మూడ్ కు తగ్గట్టుగా సాగింది. ఎడిటర్ నిడివి విషయంలో తీసుకున్న నిర్ణయం కొంత మేలు చేసింది. సినిమాటోగ్రఫీ పనితనం పల్లెటూరి వాతావరణాన్ని, అడవిని చాలా చక్కగా క్యాప్చర్ చేసింది. మాటల రచయితలు రాసిన డైలాగులు అక్కడక్కడా మెరిసినా, బలమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. థియేటర్లలో పెద్దగా ఆప్షన్స్ లేకపోవడం మాత్రమే ఈ సినిమాకు ఉన్న ఏకైక సానుకూల అంశం. చివరిగా చెప్పాలంటే వినోదం పంచాల్సిన కళ్యాణ్ కాస్తా ప్రేక్షకులకు సహన పరీక్షగా మారాడు.

చివరగా:

కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీకి, నక్సలిజానికి మధ్యలో నలిగిపోయాడు పాపం..

Comrade Kalyan Cast

Sree Vishnu Mahima Nambiar Radhika Sarathkumar Shine Tom Chacko Upendra Limaye Brahmaji Shatru Satya Vennela Kishore