Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..
Sigma
MOVIE REVIEW

Sigma

★ 2.25 / 5
Release Date: October 2, 2026
Cast
Sundeep Kishan, Faria Abdullah, Raju Sundaram, Sampath Raj
Director
Jason Sanjay
Music Director
Thaman
Producer
A. Subaskaran, G.K.M. Tamil Kumaran
Banner
Lyca Productions

Sigma Review

తమిళ అగ్ర కథానాయకుడు, ముఖ్యమంత్రి, దళపతి వారసుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడంతో సిగ్మా సినిమా మీద మొదటి నుంచీ భారీ అంచనాలున్నాయి. పాతికేళ్ల యువకుడు ఏ తరహా కథను ఎంచుకున్నాడు, సందీప్ కిషన్‌తో ఎలాంటి మ్యాజిక్ చేశాడు అనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం..

Sigma Review

కథ:

చనిపోయిన కన్నతల్లి ఆశయం కోసం గురు (సందీప్ కిషన్) పాతకాలపు నివాసంలోనే కాలం వెళ్లదీస్తూ, ఆమె స్థాపించిన ఓ పబ్లిక్ లైబ్రరీని నిర్వహిస్తుంటాడు. అయితే తండ్రి చేసిన బాకీలు ఇతడి పాలిట శాపంగా మారుతాయి. ఆ పాత భవనాన్ని సొంతం చేసుకోవాలని ఫైనాన్షియర్లు తరచూ ఇబ్బంది పెడుతుంటారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కే మార్గంలో హిస్టరీ ఆధారంగా ఓ ఆడియో ప్రోగ్రాం మొదలుపెడతాడు. దానికి ఆకర్షణీయమైన వాయిస్ కావాలని ఆర్జే సామ్‌ (ఫరియా అబ్ధుల్లా)ను సంప్రదిస్తాడు. ఇంకోవైపు అక్రమ దందాలు, జూద గృహాలు నడిపే డాన్ కొట్లపాటి వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) అక్రమ సంపాదనను భారీగా పోగేస్తాడు. డబ్బులు సంపాదించే ఆశతో ఆ జూద గృహంలో అడుగుపెట్టిన గురు దారుణంగా మోసపోతాడు. ఆ తరుణంలోనే ఓ భారీ చోరీ పన్నాగంలో చిక్కుకుంటాడు. అసలు ఆ కుట్ర వెనక ఉన్నదెవరు, కోట్లకు పడగలెత్తిన ఖజానా తాలూకు తాళంచెవి కోసం నడిచే వేటలో మనోడు ఎలా బతికి బట్టకట్టాడు, తన అప్పుల బాధల నుంచి బయటపడ్డాడా లేదా అన్నది తెరపై చూడాల్సిన అంశం.

Sigma Review

స్క్రీన్ ప్లే:

ఒక సామాన్య యువకుడు ఊహించని రీతిలో ఓ అతిపెద్ద రాబరీలో భాగం కావడం అనే కోర్ పాయింట్ వినడానికి చాలా బాగుంది. ముఖ్యంగా పాత్రల పరిచయాలను కామిక్ బుక్ విధానంలో హాలీవుడ్ తరహాలో ప్రెజెంట్ చేసిన తీరు కొత్త డైరెక్టర్ టేస్ట్‌ను ప్రతిబింబిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో ఆర్థిక ఇబ్బందులు, లైబ్రరీకి సంబంధించిన ఎమోషన్స్ చుట్టూ సినిమాను తిప్పడం వల్ల నెరేషన్ చాలా నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్‌తో పాటు సెకండాఫ్‌లో రన్ టైమ్ స్పీడ్ అందుకున్నా, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో కాస్త వెనుకబడ్డాయి. సాధారణంగా ఇలాంటి దొంగతనాల నేపథ్యంలో వచ్చే చిత్రాలకు లాజిక్ అత్యంత కీలకం. 2026లో అత్యంత పకడ్బందీగా ఉండే బయోమెట్రిక్ సెక్యూరిటీని వదిలేసి, కోట్లాది రూపాయల ధనాన్ని కాపాడేందుకు ఓ పాతకాలపు కీ ఉపయోగించడం ఏ కోశానా రుచించదు. మరోవైపు చేతుల్లో మారణాయుధాలు, గన్స్ ఉన్నప్పటికీ విలన్ గ్యాంగ్ కత్తులతో దాడులు చేసుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతూ ఓ లేడీ క్యారెక్టర్‌ను మోసపూరితమైన యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, స్క్రీన్ మీద అది అంతగా పండలేదు. నవ దర్శకుడి విజన్ బాగున్నప్పటికీ, పేపర్ మీద రాసుకున్న సీన్లను నిలకడగా తెరకెక్కించడంలో తడబాటు స్పష్టంగా కనిపించింది. లాజిక్స్ వెతకకుండా కేవలం యాక్షన్ డ్రామాను ఆస్వాదించే వారితో పాటు, దళపతి తనయుడి డైరెక్షన్ స్కిల్స్ చూడాలనుకునే అభిమానులకు ఇది ఓ మోస్తరుగా టైమ్ పాస్ చేస్తుంది.

Sigma Review

నటీనటులు:

గురు పాత్రకు సందీప్ కిషన్ బాగానే సరిపోయాడు. తనదైన బాడీ లాంగ్వేజ్, ఆకర్షణీయమైన అప్పియరెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోశాడు. ఇక ఆర్జే సామ్ క్యారెక్టర్‌లో ఫరియా అబ్దుల్లా తన అందం, అభినయంతో మెప్పించింది. తెర మీద రాజు సుందరం కనిపించిన కొద్దిసేపు థియేటర్లలో నవ్వులు విరబూశాయి, ఆయన క్యారెక్టర్ నిడివి ఇంకాస్త పెంచితే బాగుండేది అనిపిస్తుంది. ప్రతినాయకుడి పాత్రలో సంపత్ రాజ్ ఎప్పట్లాగే చాలా ఈజీగా నటించుకుంటూ పోయాడు, అయితే ఆయన పాత్రను ముగించిన విధానం అంతగా రుచించదు. మిగతా ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. తమన్ గురించి చెప్పుకోవాలి. పాటలు ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతంతో ప్రాజెక్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌కు ఇచ్చిన స్కోర్ బాగుంది. జేసన్ డైరెక్షన్ విజన్, కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం కలిపి ప్రతి ఫ్రేమ్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యంత స్టైలిష్‌గా మార్చేశాయి. ఎడిటర్ ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి, ల్యాగ్ సీన్లను కుదించి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి సీన్‌లోనూ చాలా గ్రాండ్‌‌గా కనిపిస్తుంది.

చివరగా:

సిగ్మా.. ఔట్ డేటెడ్ యాక్షన్ సినిమా..!

Sigma Cast

Sundeep Kishan Faria Abdullah Raju Sundaram Sampath Raj