Menu
BREAKING
ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం   |   తలైవర్ 173 టైటిల్ రివీల్… ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’గా రజనీకాంత్ సరికొత్త అవతారం   |   ‘ఓజి 2’ నిర్మాణంపై కొత్త బజ్..   |   రవితేజ ‘ఇరుముడి’లో అసలు హైలెట్ ఆ ట్విస్టేనా?   |   ‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు చిరంజీవి అభినందనలు.. సమంత-రాజ్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్   |   ‘వారణాసి’ షూట్‌కు స్వల్ప విరామం… కుటుంబంతో వెకేషన్‌కు మహేష్ బాబు..   |   ‘మా చరణ్ బంగారం’.. రామ్ చరణ్‌పై సుకుమార్ ప్రశంసలు, RC17 అప్డేట్‌పై క్లారిటీ   |   శ్రీలీలకు అవమానమా? ముంబై ఈవెంట్‌లో వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ

ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం

ఫుడ్ డెలివరీ బాయ్‌తో హీరో అఖిల్ రాజ్ గొడవ.. వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం అతడిపై దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, తప్పుగా ఆర్డర్ డెలివరీ అయిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ అఖిల్ రాజ్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. వీడియోలో అఖిల్ రాజ్ అతడి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా, వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తిని రికార్డింగ్ ఆపాలని, వీడియో డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్లుగా కూడా వినిపిస్తోంది. మరోవైపు, ఫుడ్ డెలివరీ బాయ్ తనకు తప్పిదం జరిగినందుకు క్షమాపణ చెప్పానని చెబుతున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సిబ్బందితో మర్యాదగా వ్యవహరించాలని, చిన్న తప్పిదానికి ఇలాంటి ప్రవర్తన సమంజసం కాదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు పూర్తి వివరాలు బయటకు రావాలని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అఖిల్ రాజ్ ‘అర్జునుడి గీతోపదేశం’ చిత్రంలో నటిస్తున్నారు. సతీష్ గోగాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ, రాజీవ్ సాలూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.

అయితే వైరల్ అవుతున్న వీడియోపై అఖిల్ రాజ్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360