Menu
BREAKING
Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి   |   Biggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..   |   Biggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..   |   Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…   |   Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ   |   Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..   |   Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్   |   Biggboss 10 Telugu: రోహిత్, షాలిని లవ్.. కన్ఫర్మ్ చేసిన రామ్ ప్రసాద్   |   అంజలి లేటెస్ట్ ఫొటోలు.. చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న ‘గీతాంజలి’!   |   Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్   |   The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?   |   Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?   |   Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్   |   ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..   |   Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..

Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం రానే వచ్చింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో జరిగిన దాన్ని బట్టే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ (సోమవారం) జరిగిన నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదలైంది. సుధీర్ దగ్గరకు వెళ్లి సృష్టి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నారా? లేదా? అని అడిగింది. దానికి సుధీర్.. వర్షిణిని పిలిచాడు. దీంతో తనకు అవసరం లేదని అక్కడి నుంచి సృష్టి వెళ్లిపోయింది. కిచెన్‌లోనూ వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సుధీర్ ఎవరితోనో.. ‘నా దగ్గర ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. సృష్టి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్లను వెదకాలి’ అన్నాడట. ఆ విషయం తనకు తెలిసిందని.. ఎంత చెత్తలాగా ఉంటుందో తెలుసా? అని సృష్టి కోపంగా వెళ్లిపోయింది.

ఆ తరువాత బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియను వివరించాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి నెత్తిపై చెత్తపోసి కారణాలు చెప్పాలి. ప్రోమోను బట్టి చూస్తే సృష్టి, రోహిత్ ఇద్దరూ సుధీర్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలి అనగానే మీరు (సుధీర్) చెప్పిన రీజన్ ఏంటంటే.. సుధీర్ అంటే సృష్టి కదా.. సో సుధీర్ అనగానే నా నోటిలో నుంచి సృష్టి పేరు గుర్తొచ్చింది’ అని సుధీర్ అన్నాడని రోహిత్ చెప్పాడు. ఎన్ని సార్లు అడిగినా కూడా ‘సుధీర్ అంటే సృష్టి కదా’ అని చెబుతూనే ఉన్నాడని సృష్టి కూడా ఫైర్ అయిపోయింది. ‘అది నా స్ట్రాటజీ.. నేనలా ఆడతా’ అని సుధీర్ అనగానే అబద్ధాలు చెప్పడం మీ స్ట్రాటజీనా? అని రోహిత్ ప్రశ్నించాడు.

Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి

‘నేను.. సృష్టి హౌస్‌లో ఫ్రెండ్స్ మాత్రమే’ అనగానే అది కూడా కాదని సృష్టి చెప్పింది. ‘బిగ్‌బాస్ నాకు ఫ్రీడం వచ్చింది’ అంటూ సుధీర్ అరిచాడు. దీంతో సృష్టి బాగా ఫైర్ అయిపోయింది. ‘ఫస్టే చెప్పాను నీకు.. నువ్వు నా టైప్ కాదు అని.. నువ్వు నాకు చెప్పకు.. పిచ్చి వేషాలు వేస్తావు.. ఒక్క గుద్దు గుద్దితే పళ్లు రాలిపోతాయి’ అంటూ సృష్టి మండిపడింది. ‘నేనేమన్నా నాకు ఫ్రీడం వచ్చిందని అన్నా’ అని సుధీర్ అనడంతో.. ‘నేనేమైనా పట్టుకుని కూర్చున్నానా? నోరు మూసుకో నేను మాట్లాడేటప్పుడు’ అని సృష్టి ఫైర్ అయ్యింది. ఆ తరువాత సృష్టి ఏడుస్తూ హౌస్‌ లోపలికి పరిగెత్తింది. ఆమె వెంట అంతా పరిగెత్తారు. అసలు దీని గురించి పూర్తిగా తెలియాలంటే.. ఎపిసోడ్ చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360