టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్ అని అందరికీ తెలిసిందే. గత పాతికేళ్లుగా అంటే దాదాపు 22 నుంచి ఈ ఇద్దరి ప్రయాణం ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఎంతో అద్భుతంగా సాగుతోంది. ఆర్య నుంచి నిన్నటి పుష్ప వరకు సుకుమార్ సినిమా అంటే అందులో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ఉండటం అనేది ఇండస్ట్రీలో ఒక అన్ రిటన్ రూల్. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఏదో చెడిందా, లేదంటే ఎవరైనా మూడో వ్యక్తి మధ్యలో దూరి కావాలనే వీళ్ల స్నేహాన్ని చెడగొడుతున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా సాగిన ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మధ్య సడెన్‌గా ఇంత దూరం ఎందుకు పెరిగింది అన్నది ఇప్పుడు అందరి మైండ్స్‌లో తొలిచేస్తున్న అతి పెద్ద ప్రశ్న.
అసలు వీళ్ల మధ్య మనస్పర్థలు ఎక్కడ మొదలయ్యాయో చూసుకుంటే, అది అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచే అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా విషయంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెంచాయని టాక్ నడుస్తోంది. సాధారణంగా తన సినిమా ఆల్బమ్‌లో కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ వేలు పెడితే దేవీ శ్రీ ప్రసాద్ అస్సలు ఒప్పుకోరు. కానీ పుష్ప 2 కోసం తమన్, స్యామ్ సిఎస్ లాంటి వాళ్లతో డైరెక్టర్ సుకుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయించడం దేవీకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయినా కూడా కేవలం తన ప్రాణమిత్రుడు సుక్కు మీద ఉన్న గౌరవంతో, ఆయన కోసమే దేవీ తన కోపాన్ని దిగమింగుకుని చాలా సైలెంట్‌గా ఉండిపోయారనే టాక్ బాగానే నడిచింది.
ఈ పుష్ప బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎపిసోడ్ అలా ఉంటే, ఇప్పుడు రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోయే కొత్త సినిమా వ్యవహారం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తన ఆత్మ లాంటి దేవీ శ్రీ ప్రసాద్‌ను కాదని, సుక్కు తన కెరీర్లో ఫస్ట్ టైమ్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులు వేయడం ఇండస్ట్రీ జనాలకు సైతం పెద్ద షాక్ ఇచ్చింది. రామ్ చరణ్ సినిమా కోసం కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను సుకుమార్ తీసుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటివరకు తన ప్రతి విజయంలో వెన్నంటి ఉండి, తన థాట్ ప్రాసెస్‌ను ఈజీగా అర్థం చేసుకునే డీఎస్పీని కాదని, సుక్కు ఈ రేంజ్ కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
సుకుమార్ ఒక కొత్తదనం కోసమే, ఆడియోలో ఒక ఫ్రెష్ సౌండింగ్ కోసమే దేవీని పక్కనపెట్టి అనిరుధ్‌ను తీసుకుంటున్నారని కొందరు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడే అభిమానుల నుంచి ఒక లాజికల్ పాయింట్ రైజ్ అవుతోంది. కేవలం కొత్తదనం కోసమే అయితే అనిరుధ్‌ను తీసుకుని మాత్రం ఏం లాభం, ఆయన ఇచ్చేది కూడా పక్కా కమర్షియల్ మాస్ మ్యూజిక్ కదా అనేది ఫ్యాన్స్ వాదన. సుక్కు సినిమా అనగానే దేవీ శ్రీ ప్రసాద్ రాత్రింబవళ్లు తన ప్రాణం పెట్టి పని చేస్తాడు. అలాంటిది అనిరుధ్ ఇచ్చే ఆ మాత్రం మ్యూజిక్, అపారమైన టాలెంట్ ఉన్న దేవీ ఇవ్వలేడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయినా ఇన్నేళ్లలో సుక్కు అడిగిన ప్రతి కొత్త ట్యూన్‌ను ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లు ఫ్రెష్‌గా ఇచ్చిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ దేవీకి మాత్రమే సొంతం.
ఇవన్నీ చాలా డీప్‌గా గమనిస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ మధ్య కచ్చితంగా ఏదో పెద్ద ఇష్యూనే నడుస్తోంది, కానీ వాళ్లు కావాలనే ఆ విషయాన్ని ఎక్కడా బయటికి రానివ్వట్లేదు. ఇద్దరూ చాలా మెచ్యూర్డ్ వ్యక్తులు కావడంతో, పబ్లిక్‌గా ఎక్కడా ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకోకుండా, మీడియాకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా చాలా సైలెంట్ వార్ నడిపిస్తున్నారు. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా ఈ ఇద్దరూ విడిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కోల్డ్ వార్‌ను బయట పడకుండా ఇద్దరి పిఆర్ టీమ్స్ కూడా మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ 22 ఏళ్ల స్నేహం మళ్లీ చిగురిస్తుందా, లేక ఈ బంధం శాశ్వతంగా బ్రేకప్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్…
సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ…
టాలీవుడ్లో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం, స్టార్లుగా ఎదగడం చాలా కామన్. వారసత్వం అనగానే అందరి దృష్టి వెంటనే కొడుకుల…