సినిమా వార్తలు

నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో తెలుగు సినిమా కమిటీ కుర్రోళ్లు ఘనంగా మెరిసింది. ఈ వేడుకలో ఈ చిన్న చిత్రం ఏకంగా రెండు కేటగిరీల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుని ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ మరియు శ్రీ రాధా దామోదర స్టూడియోస్ తరపున మెగా డాటర్ నిహారిక కొణిదెల బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో రజత కమలం అవార్డును ఎంతో గర్వంగా అందుకున్నారు. ఆమెతో పాటు ఈ చిత్ర దర్శకుడు యదు వంశీ కూడా ఈ గౌరవాన్ని స్వీకరించారు. దీనికి అదనంగా ఈ చిత్రానికి గాను పి. రవి కుమార్ బెస్ట్ మేకప్ అవార్డును గెలుచుకుని తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నిహారికతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ కొణిదెల అలాగే నిర్మాత ఫణి అడపాక, ఇతర యూనిట్ సభ్యులు హాజరై సందడి చేశారు. మన మట్టి కథకు దేశంలోనే అత్యున్నత గుర్తింపు దక్కడం మెగా అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో గర్వకారణంగా మారింది.

నిజానికి నిహారిక కొణిదెలకు ఇది ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా తొలి అడుగు. మొదటి సినిమాతోనే ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని ఏకంగా పదహారు మంది కొత్త నటీనటులను పరిచయం చేయడం, అలాగే తొలిసారి మెగాఫోన్ పట్టిన డెబ్యూ డైరెక్టర్ యదు వంశీపై పూర్తి నమ్మకం ఉంచడం చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు తీయకుండా, కొత్త వాళ్లతో ఒక స్వచ్ఛమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆమె గట్ ఫీలింగ్ అద్భుతంగా ఫలించింది. ఆమె చూపించిన ఆ ధైర్యమే ఇప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత అవార్డుల రూపంలో ప్రతిఫలాన్ని అందించింది. తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ద్వారా నిహారిక ప్రొడ్యూసర్ గా తన టేస్ట్ ఏంటో నిరూపించుకున్నారు. ఆమె తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు పరిశ్రమలోని ఇతర యువ నిర్మాతలకు కూడా ఎంతో పెద్ద ఇన్సిపిరేషన్ లా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

డైరెక్టర్ యదు వంశీ కూడా తన మొదటి సినిమాతోనే నేషనల్ లెవెల్ లో తన సత్తా ఏంటో చాటిచెప్పారు. ఆయన రాసుకున్న ఎమోషనల్ కథనం మరియు డైరెక్షన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే స్నేహితుల బృందం కథ ఇది. వారి మధ్య వచ్చిన ఒక చిన్నపాటి విభేదం ఊహించని పెద్ద వివాదంగా మారినప్పుడు ఆ కుర్రాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాన్ని చాలా నేచురల్ గా తెరకెక్కించారు. కేవలం ఫ్రెండ్ షిప్, నాస్టాల్జియా, నవ్వులు మాత్రమే కాకుండా.. కులం, వర్గం, సొసైటీలో గుర్తింపు, సామాజిక విభజనలు, ఒక పౌరుడిగా ఉండాల్సిన బాధ్యత వంటి ఎన్నో బలమైన అంశాలను కథలో చాలా సున్నితంగా మిక్స్ చేసి గొప్ప సందేశాన్ని అందించారు. ఈ వైవిధ్యమైన ప్రెజెంటేషన్ వల్లే చిత్రానికి రజత కమల్ అవార్డు దక్కింది.

ఇక ఈ సినిమాకు బెస్ట్ మేకప్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న పి. రవి కుమార్ వర్క్ నిజంగా అద్భుతం. ఈ చిత్రంలో కథ వేర్వేరు కాలాల్లో నడుస్తుంది. కుర్రాళ్లు చిన్న వయసు నుండి పెద్దయ్యే క్రమంలో కాలగమనాన్ని నమ్మశక్యంగా చూపించడంలో ఆయన మేకప్ నైపుణ్యం ప్రధాన పాత్ర పోషించింది. ప్రతీ క్యారెక్టర్ ఎంతో వాస్తవికంగా, నేచురల్ గా కనిపించేలా చేసి విజువల్ రియలిజాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టారు. ఆ సాంకేతిక పనితనానికి తగ్గ గుర్తింపుగా ఆయనకు ఈ జాతీయ అవార్డు దక్కింది. అలాగే సాంకేతిక నిపుణులైన సినిమాటోగ్రాఫర్ ఎదురోలు రాజు విజువల్స్, అన్వర్ అలీ షార్ప్ ఎడిటింగ్, అనుదీప్ దేవ్ అందించిన హృదయానికి హత్తుకునే సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఇలా నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ప్రాణం పెట్టి చేసిన సమిష్టి కృషే కమిటీ కుర్రోళ్లు సినిమాను జాతీయ స్థాయిలో విజేతగా నిలబెట్టింది.

కేవలం అవార్డుల పరంగానే కాకుండా కమర్షియల్ గా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా సుమారు 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 2024 ఆగస్టు 9న విడుదలైంది. థియేటర్లలో ఏకంగా 18.5 కోట్ల రూపాయలు, అలాగే డిజిటల్ శాటిలైట్ లాంటి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 6 కోట్ల రూపాయలు వసూలు చేసి, మొత్తంగా 24.5 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించడమే కాకుండా, ఇప్పుడు రెండు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుని డబుల్ ధమాకా సృష్టించింది. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మొత్తానికి ఒక చిన్న సినిమాగా మొదలై, బాక్సాఫీస్ రికార్డులతో పాటు జాతీయ అవార్డుల వరకు చేరిన కమిటీ కుర్రోళ్లు ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన ప్రేరణ అని చెప్పవచ్చు.

Telugu Cinema 360

Recent Posts

ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?

హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో…

9 hours ago

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.…

20 hours ago

Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..

ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు…

20 hours ago

Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?

వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని…

21 hours ago

నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?

టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర…

1 day ago

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!

టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్…

1 day ago