సినిమా వార్తలు

పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పాకెట్ రాకెట్స్. రుద్ర అత్రి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ది ఫస్ట్ హ్యాండ్ పేరుతో మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటేనే యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖ్యంగా శ్రీలంకలోని ఓ అందమైన రిసార్ట్ లో ఇద్దరు కుర్రాళ్లు ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకునే డైలాగ్స్ తో టీజర్ చాలా ఫన్ గా మొదలైంది. ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది కల కంటే రియాలిటీనే ఫస్ట్ టైమ్ బావుంది అని ఒకడంటే, దానికి డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గయ్స్, ఐయామ్ ది ఓనర్ ఆఫ్ అంటూ ఇంకొకడు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆ వెంటనే కథను గ్యాంబ్లింగ్ జరిగే ప్రదేశానికి షిఫ్ట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ ఫస్ట్ హ్యాండ్ టీజర్ తో పాకెట్ రాకెట్స్ స్టోరీ లైన్ పై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. బస్తీలో ఉండే ఇద్దరు కుర్రాళ్లు చదువుకుంటూ బతుకు వెళ్లదీయటానికి చాలా కష్టాలు పడుతుంటారు. మన జీవితం ఎప్పుడు బాగుపడుతుందా అని ప్రతిరోజూ ఫీల్ అయ్యే ఆ ఇద్దరి కుర్రాళ్ల జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి రాకతో వాళ్ల లైఫ్స్ ఎలాంటి మలుపులు తీసుకున్నాయి, అసలు ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ శ్రీలంకకు ఎందుకు పంపించింది అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే ఓ కుర్రాడు, తన డ్రీమ్ ను ఎలాగైనా సాకారం చేసుకోవాలనే కసితో గ్యాంబ్లింగ్ లోకి దిగడం ఈ కథలో ప్రధానాంశం. ఈ గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ బస్తీ కుర్రాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అక్కడి నుంచి వాళ్ల జీవితాలు ఏ తీరానికి చేరాయి అనేది ఈ సినిమాలో చాలా ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే అంతా యంగ్ అండ్ ప్రామిసింగ్ టాలెంట్ కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, అలాగే కొత్త కుర్రాడు నిర్మల్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. వీరికి జోడీగా శుభం ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్రలో సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి నటిస్తున్నారు. గ్యాంబ్లింగ్ కోసం శ్రీలంక వెళ్లిన ఈ కుర్రాళ్లకు జేడీ చక్రవర్తి క్యారెక్టర్ పరిచయం అవ్వడం, అక్కడి నుంచి కథలో కీలకమైన ట్విస్టులు రావడం జరుగుతుంది. టీజర్ లో జేడీ చక్రవర్తి లుక్ అండ్ ప్రెజెన్స్ సినిమాకు ఒక సాలిడ్ వెయిట్ తీసుకొచ్చాయి. వీరితో పాటు టాలెంటెడ్ యాక్టర్స్ శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు లాంటి వాళ్లు ఈ పాకెట్ రాకెట్స్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి స్టార్ కాస్ట్ ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానుంది.

పాకెట్ రాకెట్స్ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్ గా అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, అన్వల్ అలీ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే గ్యానీ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ హ్యాండ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. గ్యాంబ్లింగ్ లాంటి టఫ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకుని దానికి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి దర్శకుడు రుద్ర అత్రి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది. మొత్తానికి నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో వస్తున్న ఈ పాకెట్ రాకెట్స్ హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలిక. ఆల్రెడీ కమిటీ కుర్రోళ్లు, రాకాస సినిమాలతో నిర్మాతగా వరుస హిట్స్ అందుకుంది నిహారిక.

Pranav

Recent Posts

ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!

సౌత్ ఇండియాలో సినిమాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా హీరోల సినిమాలకు…

19 minutes ago

మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఆయన రియల్ లైఫ్‌కు భలే సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్…

2 hours ago

“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి…

15 hours ago

Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

బిగ్‌బాస్ 10 తెలుగు కంప్లీట్‌గా గ్రూప్‌ల మీదే నడుస్తోంది. ప్రస్తుతం అయితే పది మంది ఒక గ్రూప్ అదే త్రిగుణ్…

16 hours ago

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ…

17 hours ago

Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..

హోస్ట్ నాగార్జున తనను కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏం చూపించారో త్రిగుణ్.. సుధీర్, నీతూ, దేబ్జానికి చెప్పాడు. బెడ్ మీద…

17 hours ago