మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చింది. హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ అంశాలను వినోదాత్మకంగా మేళవించిన కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తొలి పాట ‘కంసంనిదా’ కూడా మంచి స్పందనను అందుకుంది.
తాజాగా చిత్రబృందం సినిమాను ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తంతో తడిసిన కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని అత్యంత స్టైలిష్‌గా కుర్చీలో కూర్చుని కనిపించారు. చుట్టూ కొరియన్ గ్యాంగ్‌స్టర్లు నిలబడి ఉన్నప్పటికీ, ఆయనలో కనిపించిన ధైర్యం, కాన్ఫిడెన్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నియాన్ లైటింగ్‌తో రూపొందించిన విజువల్స్ సినిమా యాక్షన్, కామెడీ, థ్రిల్‌ల కలయికగా ఉండబోతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.
రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
వినూత్నమైన కథ, భిన్నమైన టైటిల్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకున్న ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. విడుదల తేదీ ప్రకటించడంతో పాటు చిత్రబృందం త్వరలోనే ట్రైలర్, మరిన్ని ప్రమోషనల్ అప్‌డేట్స్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు…
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో రాబోతున్నారు.…
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో…
టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే…
త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని…
సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…