ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి. దక్షితో పాటు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. హౌస్ నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం శాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అసలే శనివారం రోహిత్‌ను హోస్ట్ నాగార్జున ఎన్నడూ లేనంత దారుణంగా రోస్ట్ చేశారు. ఈ వారం రోహిత్‌కు పెద్దగా కోటింగ్ ఉండదని అంతా భావించారు. కానీ ఈసారి బ్లాక్ కార్డ్ ఇచ్చి మరీ ఏకిపారేశారు. అతను ఎంతలా డల్ అయిపోయాడంటే మోకాళ్లపై కూర్చొని మరీ నాగ్‌ను వేడుకున్నాడు. రెండు వారాల పాటు కెప్టెన్సీ కంటెండర్ షిప్ ఉండదని నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు.
శనివారంతో రోహిత్ బాగా డల్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే.. అతను నోటి వెంట ఏం మాట్లాడినా తప్పే. అంతకు ముందు జరిగిన పరిణామాలు బిగ్‌బాస్ టీంకి అనవసరం. హోస్ట్ నాగార్జునదేముంది? స్క్రిప్ట్ ప్రకారం వెళ్లిపోతారు. కానీ రోహిత్‌ను ఎంతలా తొక్కాలో అంతలా తొక్కారు. ఇక మీదట అతను నోరు తెరవాలన్నా భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఇక ముందు అతనికి బిగ్‌బాస్ హౌస్‌లో సపోర్ట్ ఉండదు సరికదా.. త్రిగుణ్, దేబ్జాని, వర్షిణి, ముఖేష్ తదితరులంతా దారుణంగా బ్లాక్ కార్డ్ విషయం తీసి హ్యుమిలియేట్ చేసే అవకాశం ఉంది. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న అంశాన్ని తీసి ఒకరకంగా బయటకు వెళ్లిపోతే బాగుంటుందనే పరిస్థితికి తీసుకొస్తారు. ఈ పరిణామాలను తట్టుకోవడం చాలా కష్టమైతే ఇప్పటి వరకూ రోహిత్‌కు అండగా నిలిచిన ఒకే ఒక సపోర్ట్ శాలినిని బయటకు పంపించడం మరో ఎత్తు.
ఇది అతన్ని మరింత కుంగదీసే అవకాశం ఉంది. పైగా ‘నీ పక్కనున్న వారంతా బయటకు వెళ్లిపోతున్నారు’ అంటూ ఇప్పటికే త్రిగుణ్ గ్రూప్ అతడిని దారుణంగా హింసిస్తోంది. ఇంతకు ముందు శాలిని అతని గేమ్‌కు ప్రధాన అడ్డంకి. కానీ సపోర్ట్ అవసరమైన తరుణంలో ఆమె వెళ్లిపోవడం అతనికి మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. మరి వీటన్నింటినీ రోహిత్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక మరోవైపు నిన్నటి ఎపిసోడ్‌పై సోషల్ మీడియా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. రోహిత్‌కు బీభత్సమైన సింపతి వచ్చేసింది. గత వారం రోహిత్ ఓటింగ్‌ను త్రిగుణ్ దాటేశాడు. మరి ఈ వారం ఎలా ఉండనుందో చూడాలి.
ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే…
బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…
ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…
ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…
సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ దక్కుతుందో, అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా…