బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్.. రామ్ ప్రసాద్‌తో నీ కెప్టెన్సీ గడువు ముగిసిందని.. కెప్టెన్సీ బ్యాండ్ తీసేయాలని చెప్పారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ జరుగనందున గ్రీన్ కలర్లో ఉన్న ముఖేష్, త్రిగుణ్, దేబ్జాని, నీతూలకు హౌస్ బాధ్యతను బిగ్‌బాస్ అప్పగించారు. ఆ తరువాత వైట్ గోల్డ్ ప్రమోషన్ టాస్క్ నిర్వహించారు. టాస్క్ తర్వాత దేబ్జాని.. షాలినిని పిలిచి బట్టలన్నీ బెడ్ మీద నుంచి తీసేయమని చెప్పింది. తనకు ర్యాక్స్ లేవని.. తను వెళ్లి సర్దుతూనే ఉన్నానని ఓపికగా ఉండమని షాలిని చెప్పింది. తనకు కాస్త టైం ఇవ్వమని అడిగింది. కానీ దేబ్జాని బాగా రెచ్చగొట్టినట్టుగా మాట్లాడింది. దీంతో షాలిని రెచ్చిపోయింది. బరాబర్ చెయ్యను.. ఏం చేసుకుంటవో చేసుకో పో అని షాలిని చెప్పింది. నా బట్టలను కిందేస్తే.. నీ బట్టలను బయట వేస్తానని షాలిని చెప్పింది. ముఖేష్ వెళ్లి రోహిత్, నీతూతో కెప్టెన్ రూం ఖాళీగా ఉందని.. ఇప్పటి వరకూ రోహిత్ ఎప్పుడూ కెప్టెన్ రూంలో పడుకోలేదని చెప్పాడు. రోహిత్‌ను నీకు అక్కడ పడుకోవాలని లేదా? అని అడిగాడు. తనకు యాక్సెస్ లేదని కాబట్టి పడుకోలేదని చెప్పాడు. ఇప్పుడు పడుకో.. నువ్వెప్పుడూ పడుకోలేదు కదాని రోహిత్‌కు ముఖేష్ చెప్పాడు.
ముఖేష్ వెళ్లి కెప్టెన్ రూం ఖాళీగా ఉంది కదా అని.. ఏదో చెప్పబోతుంటే త్రిగుణ్ పోక్ చేయడం ప్రారంభించాడు. మధ్యలో షాలిని వచ్చి తాను వెళుతుంటే రోహిత్ చాలా బాధ పడుతుంటే దానికి కూడా నేషనల్ టెలివిజన్‌లో తన గురించి చెత్తగా త్రిగుణ్ మాట్లాడాడని చెప్పింది. ఈ క్రమంలోనే రోహిత్ వర్సెస్ దేబ్జాని గొడవ జరిగింది. నీకందుకే ఎల్లో కార్డ్ ఇచ్చారని దేబ్జాని అనడంతో తనకు ఏదో ఒక గుర్తింపు ఉందని.. నీకు అది కూడా లేదు కదా అని చెప్పాడు. అసలు దేబ్జానికి రోహిత్ అంటే అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదు. ఎప్పుడూ అతనిపై ఇష్టానుసారంగా నోరేసుకుని పడిపోతూ ఉంటుంది. మళ్లీ త్రిగుణ్ వర్సెస్ రోహిత్ గొడవ అయ్యింది. అసలు వీళ్లు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం కాలేదు. ముఖేష్‌కు చిరాకు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండని చెప్పి వెళ్లిపోయాడు. అమ్మాయిలిద్దరిని కెప్టెన్ రూంలో పడుకోమని త్రిగుణ్ చెప్పాడు. లేదంటే తాను గోట్ కొట్టాను కాబట్టి తను పడుకుంటానని త్రిగుణ్.. అమన్ వచ్చేసి తాను గోట్ కొట్టాను కాబట్టి తాను పడుకుంటానని చెప్పాడు. అప్పుడు రామ్ ప్రసాద్.. త్రిగుణ్, అమన్ పడుకుంటారని చెప్పడంతో తాను ఒప్పుకోనని ముఖేష్ చెప్పాడు. మధ్యలో దేబ్జాని రావడంతో దేబ్జాని వర్సెస్ ముఖేష్ గొడవ జరిగింది. ర్యాక్ ఇవ్వనంటావ్.. బెడ్ క్లీన్ ఉండాలంటావ్ ఏంటి నువ్వని ముఖేష్ అడిగాడు. దీంతో అతనితో గొడవపడింది.
త్రిగుణ్ వర్సెస్ రోహిత్ ఇద్దరూ ఇద్దరే. ఏమాత్రం తగ్గకుండా ఒకరికొకరు మాటలు విసురుకున్నారు. వీళ్లిద్దరి గొడవ చూసి నాగార్జున నవ్వుకున్నారు. రోహిత్ గురించి ఇదా బిహేవియర్ అని అతను నచ్చాడన్న ప్రేక్షకురాలిని నాగ్ అడిగారు. ఇవాళ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని అన్నారు. ఏం డెసిషనల్ తీసుకుంటారో. మరి త్రిగుణ్ కూడా అంతే కదా. అతనేమైనా తక్కువా? అది మాత్రం నాగ్‌కు పట్టదెందుకో. ఆ తరువాత మళ్లీ ప్రమోషన్ టాస్క్. ఈసారి తాజ్‌మహల్ టీ పౌడర్ టాస్క్. హౌస్‌లోని అమ్మాయిలంతా టీతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ తరువాత తీసుకోవాల్సిన డెసిషన్స్ చాలా ఉన్నాయంటూ నాగ్ హౌస్‌లోని వారి ముందుకు వెళ్లారు. తను ఫస్ట్ మాట్లాడాల్సిన హౌస్‌మేట్ ముఫాసా (నరేష్) అని నాగ్ చెప్పారు. ‘నీ భుజాల మీద వెయిట్ పడలేదని బిగ్‌బాస్ అనుకున్నారు కానీ నీ భుజంపై అన్ని గంటల పాటు స్టిక్ మోయడం సాధారణ విషయం కాదు’ అని నాగ్ చెప్పారు. ‘నీ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు గొడవలు చేయడం లేదని నాగ్ సరదాగా చెప్పారు. కెప్టెన్ రూం యాక్సెస్‌ను నరేష్‌కు నాగ్ ఇచ్చారు. అతని ఆట తీరుకి ఇది బహుమానం అన్నట్టుగా చెప్పారు.
అమన్‌ను క్లాప్స్ కొట్టి మరీ అభినందించారు. ఆటలో నిన్ను కొట్టిన వాడే లేడని చెప్పారు. బిహేవియర్ కూడా మార్చుకుంటున్నావని నాగ్ చెప్పారు. దీన్ని మెయిన్టైన్ చేయమని చెప్పారు. మనం పైకి వెళుతుంటే కిందకు లాగే వాళ్లు చాలా మంది ఉంటారని.. ఎంతమంది లాగినా విల్ పవర్ కోల్పోవద్దని అమన్‌కు నాగ్ చెప్పారు. దేబ్జానికి మీ మామ్ చాలా ప్రౌడ్‌గా ఫీలవుతారని నాగ్ చెప్పారు. కళ్ల వెంట కన్నీళ్లొస్తున్నా చాలా బాగా ఆడావని నాగ్ చెప్పారు. నీతూని కూడా నాగ్ అభినందించారు. వైల్డ్ కార్డుగా వచ్చి త్రిగుణ్ దగ్గర పవర్ తీసుకున్నావని.. వచ్చిన వారంలోనే ఏం పీకగలవో చూపించావని నీతూకి నాగ్ చెప్పారు. ఇంకా కోచ్‌గా ఎందుకు మిగిలిపోతున్నావని నాగ్ అడిగారు. నీ ఆట నువ్వు ఆడమని చెప్పావు. ముఖేష్‌ను కూడా నాగ్ అభినందించారు. ఆ తరువాత తానెప్పుడూ నువ్వొక జెంటిల్ మాన్ అనుకున్నానని.. నీ నోటి వెంట కొన్ని పదాలు నాకసలు నచ్చలేదని నాగ్ చెప్పారు.
మొన్న టాస్క్‌లో శివ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్లే చేశారు. త్రిగుణ్, రోహిత్‌ను చూసి మాటలు జారుతున్నావా? అని నాగ్ అడిగారు. ఇక్కడి నుంచి ఇంకా దిగజారి మాట్లాడావని.. అసలు శివ పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకని ముఖేష్‌ను నాగ్ అడిగారు. తన పర్సనల్ లైఫ్ గురించి శివ్ అడిగినందుకే అలా మాట్లాడానని చెప్పాడు. ఏదో సరదాగా అడిగినదానికి అలా మాట్లాడాలా? అని నాగ్ అడిగారు. తను చాలా గిల్ట్ ఫీలయ్యానని.. అందుకే శివ్‌ను కూర్చోబెట్టి మాట్లాడానని చెప్పాడు. సారీ చెప్పానని చెప్పడంతో తనకు ముఖేష్ సారీ చెప్పలేదని.. కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా తనే తప్పు చేశానని నిరూపించేందుకు ట్రై చేశాడని శివ్ చెప్పాడు. నీతూ విషయంలో ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడటం తప్పని ముఖేష్‌కు నాగ్ చెప్పారు. డ్యాన్స్ రాదని తాను చెప్పలేదని ముఖేష్ అనడంతో ఆ వీడియో ప్లే చేసి చూపించారు. నీతూకి ముఖేష్ సారీ చెప్పాడు. వేరొకరిని చూసి నువ్వు అలాగే చేస్తే నీ పతనం మొదలవుతుందని నాగ్ చెప్పారు.
తరువాత శివను నాగ్ అభినందించారు. పూర్తిగా ఆటలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్ శివ అని చెప్పారు. ఇలాగే ఉంటే గేమ్‌తో పాటు హౌస్ కూడా నీకు కలిసొస్తుందని నాగ్ చెప్పారు. నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడతావా? గ్రూప్‌గా ఆడతావా? డిసైడ్ చేసుకోమని చెప్పారు. వర్షిణిని నీ ఆట ఎలా ఉందో నువ్వే చెప్పమని నాగ్ అడిగారు. మనం ఎవరినైనా ఛాలెంజ్ చేయవచ్చని.. చేశాక ఆ కసి కనిపించాలని నాగ్ అన్నారు. ఎన్ని కేజీల బరువు మోశావని అడగ్గా.. 12 కేజీలు అని చెప్పింది. నీతూని ఏం పీకావని అన్నావు కదా.. మరి పీకి చూపించింది కదా అని నాగ్ అడిగారు. బాగా ఆడమని చెప్పారు. రామ్ ప్రసాద్‌ను లేపి నీ కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకునేటప్పుడు అన్ని పాటలు పాడారేంటని అడిగారు. నీ పనిష్మెంట్స్ బాగున్నాయని అన్నారు. నువ్వొక్కడివే ఎల్లోకి వెళ్లావని హ్యాపీనా అని అడిగారు. తనకు సంతోషం లేదని.. గ్రీన్‌కు వెళితే సంతోషపడేవాడినని రామ్ ప్రసాద్ చెప్పాడు. వర్షిణితో ఆడితే గెలిచేవాడివా? అంటే లేదన్నాడు. వర్షిణిని లేపి సేమ్ క్వశ్చన్ అడిగితే తనకు తెలియదన్నారు. తెలుసుకోవడమే బిగ్‌బాస్ హౌస్ అని చెప్పారు. వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ఎందుకమ్మ మగ పిల్లాడిలా ఏడుస్తున్నావని అడిగారు. రామ్ ప్రసాద్‌ని అందరితో మంచి అనిపించుకోవాలి. అందరిని మనవైపు తిప్పుకోవాలనుకుంటే అక్కడే ఉంటావని చెప్పారు.
షాలిని లోపలికి రావడం నీకు నచ్చిందా? లేదా? అని రామ్ ప్రసాద్‌ను అడిగితే తనకు నచ్చలేదని చెప్పాడు. జనాలు ఓటేసి పంపించినప్పుడు అది జరగాలని చెప్పాడు. బయటకు వెళ్లి వచ్చాక మార్పుందా? అంటే ఏమీ లేదన్నాడు. తరువాత రామకృష్ణను లేపి నీ గేమ్ ఎలా ఉందని అడిగారు. అంతగా లేదని తనకు ఆడే ఛాన్స్ రావడం లేదని చెప్పాడు. ఛాన్స్ రాదని.. పట్టుకోవాలని.. గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాగ్ చెప్పారు. మనం గెలవాలి అని ఆడాలని.. అవతలి వారు ఓడాలని ఆడకూడదని.. నీ సొంత బుర్ర పెట్టి సొంత గేమ్ ఆడమని చెప్పారు. నాగ్ బ్రేక్ తీసుకోగానే షాలిని ఏడుపు మొదలు పెట్టింది. తనకు ఉండాలని లేదని.. వెళ్లిపోవాలనిపిస్తోందని చెప్పింది. శివ్, రోహిత్ ఓదార్చేందుకు ట్రై చేశారు. జనాలు నిన్ను వద్దనుకుంటే బిగ్‌బాస్ మళ్లీ ఎందుకు నిన్ను హౌస్‌లోకి పంపిస్తారని రోహిత్ అడిగాడు. ప్రతిసారీ జనాలు వద్దనుకున్నారని గుర్తు చేస్తుంటే తనకు చాలా హర్టింగ్గా అనిపిస్తోందని చెప్పింది. తాను వస్తానని అడిగానా? అనేది ఆమె పాయింట్.
షాలినిని లేపి కళ్లు తడిచిపోయి ఉన్నాయేంటని నాగ్ అడిగారు. అంతా ఎవిక్షన్ అయి వచ్చావని అందరూ అడుగుతుంటే తనకు హర్టింగ్గా ఉందని చెప్పింది. అది నిజమే కదా అని నాగ్ అడిగారు. తను కాస్త ఇంప్రూవ్ అయ్యానో లేదో చూసి చెప్పినా తనకు ఓకే కానీ ఇలా చెప్పడం తనకు నచ్చడం లేదని చెప్పింది. నువ్వు ఇంప్రూవ్ అయ్యావో లేదో చూద్దామా? అని నాగ్ కొన్ని వీడియోలను ప్లే చేశారు. షాలినికి హౌస్‌లోకి వచ్చి ఎన్ని రోజులవుతోందని అడిగారు. నాలుగు రోజులని చెప్పింది. బిగ్‌బాస్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చారని నాగ్ అడిగారు. రామ్ ప్రసాద్‌ను లేపి అడిగితే లెక్కలేనని సార్లని చెప్పారు. ఆ తరువాత షాలిని.. దక్షితో గొడవపడిన వీడియోను చూపించారు. ఇది ఇంప్రూవ్మెంటా? ఆ బిహేవియర్ ఏంటి? కోపం వస్తే కంట్రోల్ ఉండదా? అని నాగ్ అడిగారు. నీతూ, వర్షిణి, దక్షి అందరితో అలాగే చేశావని చెప్పారు. రూం గురించి చూద్దామని.. నిన్న దేబ్జానితో జరిగిన గొడవ తాలుకు వీడియోను చూపించారు. మనకి ఎవర్ని అయినా ఏదైనా అనేంత ఉన్నప్పుడు ఎదుటి వారు అన్నది కూడా తీసుకోవాలని చెప్పారు. స్టేజ్ మీదకు వచ్చి కంప్లీట్‌గా చేంజ్ అవుతానని చెప్పి వెళ్లావని నాగ్ అన్నారు. త్రిగుణ్‌ని క్యారెక్టర్ లెస్ అన్నావు. నేషనల్ టీవీలో అలా త్రిగుణ్ మాట్లాడటం తప్పైతే.. నువ్వలా చేయడం కరెక్టా? అని అడిగారు. ఆ తరువాత ఓ వీడియోను చూపించి రోహిత్ కాలిపై షాలిని మునివేళ్లపై రాయడానికి సంబంధించిన వీడియో అది. నేషనల్ టెలివిజన్‌లో అలా చేయడానికి లేదా? అని అడిగారు. నేను బయటకు వెళ్లిపోతానని షాలిని చెప్పింది.
చరణ్ ఉన్నప్పుడు అంతా యునానిమస్‌గా నీకు ఓటేశారని.. ఆ తరువాత మరో ఛాన్స్ ఇచ్చారని నాగ్ చెప్పారు. అయినా మారలేదన్నారు. రోహిత్ చేయి లేపితే నాగ్ ఏం చెబుతావని అడిగారు. మునివేళ్లతో రాయడం రొమాంటిక్ సైన్ కాదని చెప్పారు. రోహిత్ ఇది నీకు అలవాటైందని.. ఇది నామినేషన్ కాదన్నారు. షాలినితో మాట్లాడుతుంటే మధ్యలోకి రావొద్దని చెప్పారు. షాలిని సారీ చెబితే ఎన్నిసార్లు సారీ చెబుతావని నాగ్ అడిగారు. నీకు నిజంగానే వెళ్లిపోవాలని ఉంటే ఈ క్షణమే వెళ్లిపొమ్మని నాగ్ చెప్పారు. తను వెళ్లిపోతానని చెప్పింది. వెంటనే నాగ్ గేట్స్ ఓపెన్ చేయించారు. షాలిని థాంక్యూ చెప్పింది. పబ్లిక్ తను బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నారని చెప్పింది. రోహిత్ ఆమెను కన్విన్స్ చేశాడు. అగ్నిపరీక్ష అన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పాడు. ఫైట్ ఫర్ ఇట్ అని రోహిత్ చెప్పడంతో ఆమె ఆగిపోయింది. తను ఫైట్ చేస్తానని చెప్పింది. ఎవరైతే తను ఆడననుకున్నారో.. తను హౌస్‌కి పనికి రానని చెప్పారో తను ప్రూవ్ చేస్తానని చెప్పింది. ఫైనల్‌గా ఉంటున్నావా? వెళుతున్నావా? అని నాగ్ అడిగారు. వెళ్లనని చెప్పింది.
శ్వేతను లేపి నువ్వు రెడ్‌లో ఉన్నా కూడా తన దృష్టిలో చాలా హైట్‌లో ఉన్నావని చెప్పారు. ఓవరాల్‌గా హౌస్‌లో చాలా బాగా ఉంటున్నావని అభినందించారు. ఝాన్సీ, సుధీర్, వంశీల గురించి మాట్లాడేది ఏమీ లేదన్నారు. దక్షిని లేపి అసలు హౌస్‌లో ఉన్నావా? అని నాగ్ అడిగారు. టైం తీసుకుని ఓపెన్ అప్ అవుదామనుకుంటే టైం లేదని చెప్పారు. నెక్ట్స్ త్రిగుణ్‌ను రేయ్ త్రిగుణ్ లెగురా అన్నారు. ఏరా నువ్వు గోటా అని అడిగారు. అసలు గోట్ అనే పదానికి నువ్వు సరిపోతావా? అని అడిగారు. నీ భుజాన ఉన్న బరువుతో చూస్తుంటే నువ్వొక హీరోవని చెప్పారు. ఆట పరంగా చాలా గుడ్ అని చెప్పారు. గోట్ అనే పదం ఇలాగా బిహేవ్ చేసేదని నాగ్ అడిగారు. వీడియో చూపించి ఆ గెస్చర్ అని అడిగారు. నీ క్యారెక్టర్ ఏమైందని అడిగారు. ఉరేసుకుని చచ్చిపో.. ఒరేయ్ అని మాట్లాడాలా? అని అడిగారు. కొన్ని వర్డ్స్ త్రిగుణ్, రోహిత్ నుంచే వచ్చాయని ముఖేష్ చెప్పాడు. ఏం కవర్ చేశావు ముఖేష్ అని నాగ్ అన్నారు. గోట్ అనే పదానికి త్రిగుణ్ అర్హుడు కాడని బిగ్‌బాస్‌కి చెప్పానని నాగ్ అన్నారు. పనిష్మెంట్ ఏంటని అడిగారు. మీరేం చెప్పినా నాకు ఓకేనని త్రిగుణ్ చెప్పాడు. తన గోట్‌ని శివకు తిరిగి ఇస్తానని చెప్పాడు. అది ఆడి గెలుచుకున్నావని అదెవరి బిక్ష కాదన్నారు.
రోహిత్, షాలినిని త్రిగుణ్ కారణంగా బాధ పడింది మీ ఇద్దరేనని.. ఏం పనిష్మెంట్ ఇవ్వాలో చెప్పమన్నారు. పనిష్మెంట్ వద్దని ఇద్దరూ చెప్పారు. మీ ఇద్దరికీ ఒకటేనని అర్థమైందని.. అలాంటప్పుడు సైన్ లాంగ్వేజ్ ఎందుకని నాగ్ అడిగారు. తాము చెప్పినా మీకు నమ్మకం లేదని షాలిని అనడంతో లేదు కాదు.. నమ్మకం కోల్పోయారని నాగ్ చెప్పారు. ఆ తరువాత త్రిగుణ్‌కు నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు. ఈ క్షణమే హ్యాండ్ కప్స్ వేసి జైల్లో వేయమని శివ్‌కు నాగ్ చెప్పారు. జరిగే ప్రతిదీ లోపలకు తీసుకుని హర్ట్ అయ్యి కొందరు హౌస్‌లో గేమ్ పాడు చేసుకుంటున్నారని.. నువ్వలా చేసుకోవడం లేదని నాగ్ చెప్పారు. ఈ కౌంటర్ కూడా పరోక్షంగా నాగ్ రోహిత్‌కే వేశారు. నరేష్‌ను లేపి అందరి గురించి మాట్లాడామా? ఎవరైనా మిగిలారా? అంటే రోహిత్ అని చెప్పాడు. మాట్లాడినా ఏం ఉపయోగమని నాగ్ అడిగారు. ఏమీ ఫలితం ఉండదన్నట్టుగా చెప్పారు. రోహిత్‌ను లేపి ఈ వారం నీ ఆటకు ఎంత ఇచ్చుకుంటావని నాగ్ అడిగారు. 6 అని చెప్పాడు. అసలేం ఆడావని 6 అని అడిగారు. రోహిత్‌కు అతని వీడియోలు చూపించారు. ముఖేష్‌తో గొడవపడింది.. రోహిత్, షాలిని గుసగుసలాడుకునేది.. నామినేషన్స్‌లో మాట జారబోయి ఆగింది.. త్రిగుణ్‌తో గొడవకు సంబంధించిన వీడియోలను చూపించారు. ప్రతి వారం చెబుతూనే ఉన్నామని ఏ విషయంలోనూ వినట్లేదన్నట్టుగా నాగ్ చెప్పారు. ప్రవర్తన లేదు.. ప్రదర్శన లేదు.. పరివర్తన రాదని నాగ్ అన్నారు. ఎల్లో కార్డు తర్వాత కూడా మార్పు రాదా? అని నాగ్ అడిగారు.
ముఖేష్ ముందుగా గెస్చర్ చేశాడని చెప్పాడు. మాట తీరు కూడా మార్చేసి అలా అబ్యూజ్ చేస్తావా? అని నాగ్ అడిగారు. నీయమ్మ అంటావా? అని మాట్లాడారు. సుధీర్‌తో వెళ్లి నామినేషన్స్ గురించి మాట్లాడతావా? అని అడిగారు. రోహిత్ మొహంలో కనీసం నెత్తురు చుక్క లేదు. ముందుగా ముఖేషే తనను ఇమిటేట్ చేసి చూపించాడని అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. నీతూతో సరిగా మాట్లాడకపోవడంతో అలా మాట్లాడానని చెప్పాడు. నువ్వెందుకు మధ్యలో వెళుతున్నావని నాగ్ అడిగారు. నీ ఆట నువ్వు ఆడుకోమని చెప్పారు. నువ్వంటే చాలా ఇష్టముండి.. నీ ఆట పడిపోతుంటే బాధపడుతున్న ప్రసన్న మాట వినమని నాగ్ చెప్పారు. ప్రేక్షకురాలు ప్రసన్న మాట్లాడుతూ.. స్టార్టింగ్‌లో నీ గేమ్ బాగుందని.. ఈ మధ్య చాలా చాలా లో అయిపోతున్నావని చెప్పింది. నీ మాటలు తగ్గించుకోవాలి.. నువ్వు వేరొకరి కోసం వెళ్లడం నీకు ఇబ్బంది అవుతోందని.. నీ గేమ్ నువ్వు ఆడుకో’ అని ఆమె చెప్పారు. గేటు బయట దొరకవా? చెంప పగులుద్దా? ఏంటా మాటలని నాగ్ అడిగారు. చేతకాని వాడు మాత్రమే కారణాలు చెబుతున్నావని నాగ్ అడిగారు. మాటల్లో కాదు.. ఆటలో చూపించమని నాగ్ చెప్పారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నావని.. ప్రతి విషయంలోనూ బిగ్‌బాస్ రూల్ బ్రేక్ చేస్తున్నావని నాగ్ చెప్పారు.
పనిష్మెంట్ ఏంటో చెప్పమని నాగ్ అడిగారు. షాలిని లాగా తనకు క్షమించే గుణం లేదన్నారు. ‘ఎక్స్పెక్టేషన్స్ నీపై చాలా ఉన్నాయని.. కానీ నువ్వు హౌస్ నుంచి బయటకు వెళ్లేలా ఉన్నావని చెప్పారు. మారి బాగా ఆడతావా? లేదంటే బయటకు వెళతావా?’ అని నాగ్ అడిగారు. మారి హౌస్‌లో ఉంటానని చెప్పాడు. రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ‘ఇది నీ క్యారెక్టర్‌పైన బ్లాక్ మార్క్ అని నాగ్ చెప్పారు. ఏది వద్దని చెబుతుంటే అదే చేస్తున్నావని నాగ్ చెప్పారు. ఎన్ని వైలేషన్స్ అంటే బయటకు వెళ్లేందుకు వన్ స్టెప్ ముందు ఉన్నావని’ నాగ్ చెప్పారు. ఇంకొక్క తప్పు జరిగినా కూడా నువ్వు బయటకు వెళతావని నగ్ చెప్పారు. నువ్వు హౌస్‌లో ఉన్నంత వరకూ కెప్టెన్ కాలేవని చెప్పారు. కెప్టెన్సీ లేకపోవడం అనేది తనకు ఎలిమినేషన్‌తో సమానమని రోహిత్ చెప్పాడు. మోకాళ్లపై కూర్చొని తన నుంచి ఆట దూరం చేయవద్దని కోరాడు. కంటెండర్‌షిప్ నుంచి తీసేయవద్దని అది తనను పూర్తిగా చంపేస్తుందని రోహిత్ చెప్పాడు. ఈ పనిష్మెంట్ రోహిత్‌కు వద్దు అనేవాళ్లు చేతులు ఎత్తమంటే పది మంది చేతులు ఎత్తారు. నెక్ట్స్ టు వీక్స్ కంటెండర్‌షిప్ లేదని.. నువ్వు మారావని నమ్మితే రెండు వారాల తర్వాత కంటెండర్ షిప్ ఇస్తామని నాగ్ చెప్పారు. ఈవారం రోహిత్‌కు పెద్దగా ఏమీ ఉండదని అనుకుంటే ఈవారం ఏకంగా మోకాళ్లపై కూర్చొనేలా చేశారు. మళ్లీ రోహిత్‌కు సింపతి వర్కవుట్ అవుతుంది. కానీ రెండు వారాల పాటు కంటెండర్‌షిప్‌లో లేకుంటే అతనికి చాలా కష్టమే. మరి ఈ పనిష్మెంట్ రోహిత్లో మార్పు తెస్తుందో.. లేదంటే మరింత డీలా పడిపోతాడో చూడాలి.
ఫిట్నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…
ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…
సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ దక్కుతుందో, అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా…
బిగ్‌బాస్ హౌస్‌లోకి షాలిని ఎంట్రీ ఇచ్చింది. ఆమెను డ్రమెటిక్‌గా హౌస్‌లోకి ప్రవేశ పెట్టారు. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. అక్కడ…
టాలీవుడ్లో ఎవరైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తమ స్వయంకృషితో, టాలెంట్ తో పైకి వస్తుంటే వారిని ఎంకరేజ్…