సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..

నీతూ, వర్షిణి, ముఖేష్.. ముగ్గురూ వంట గురించి చర్చ. తను రసం పాడు చేశానని అందరూ తనపై పడ్డారని.. కానీ వాళ్లు కాకరకాయ, ఇంకా ఎన్నో పాడు చేశారని నీతూ చెప్పింది. రేపు ఊరుకోనని ముఖేష్.. వదిలేయమని వర్షిణి చెప్పింది. అన్నట్టుగానే కూరగాయలన్నీ ముఖేష్ తీశాడు. బిగ్‌బాస్‌కు కాకరకాయ, బీట్‌రూట్ అన్ని కూరగాయలు వేస్ట్ చేశారని చెప్పాడు. తాము మిస్టేక్ చేసిన కారణంగా కూరగాయలన్నీ పాడయ్యాయని.. మళ్లీ కూరగాయలు పంపించినందుకు త్రిగుణ్ బిగ్‌బాస్‌కు థాంక్స్ చెప్పాడు. ఇప్పటికైనా కూరగాయలు పాడు చేయవద్దని ముఖేష్ చెప్పడంతో త్రిగుణ్ గొడవకు దిగాడు. ఫ్రిజ్‌ను సెట్ చేద్దువు రమ్మని త్రిగుణ్ పిలిచాడు. తానెందుకు రావాలని ముఖేష్ అన్నాడు. కోతి అని ఒకరు.. కల్లు తాగిన కోతి అని మరొకరు మాటలు విసురుకున్నారు. త్రిగుణ్.. ముఖేష్ గురించి పాట పాడాడు. రివార్డ్ అండ్ రివెంజ్‌లో భాగంగా రివార్డ్ కోసం కంటెస్టెంట్స్ అందరినీ రెండు టీములుగా విభజించాడు. ఒక టీమ్‌లో ఆరుగురు.. మరొకరు టీమ్‌లో ఏడుగురు ఉండాలని బిగ్‌బాస్ చెప్పారు. ఈ టాస్క్‌లో విజయం సాధించిన వారికే ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

వైల్డ్ ఫైర్స్ ఐదుగురు ఒక టీమ్‌లో ఉండాలని రామ్ ప్రసాద్ చెప్పాడు. చాలా సేపు చర్చ తర్వాత ముఖేష్, శివ, అమన్, వర్షిణి, రామకృష్ణ, శ్వేత నీతూ టీమ్ ఏ.. త్రిగుణ్, రామ్ ప్రసాద్, నరేష్, దేబ్జాని, సుధీర్, వంశీ మరో టీమ్‌లో ఉన్నారు. తనకు ర్యాండమ్‌గా వెళ్లాలని ఉందని త్రిగుణ్ చెప్పాడు. సడెన్‌గా శివ్‌పై త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. సర్ అంటావు కానీ రెస్పెక్టే ఉండదని మండిపడ్డాడు. రైజ్ ద ఫ్లాగ్ టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రారంభించారు. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తి పేరును కార్డుపై రాయాలని బిగ్‌బాస్ చెప్పారు. ఎవరైతే ఎక్కువ మంది ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారో వారు టాస్క్ నుంచి మాత్రమే కాకుండా కంటెండర్‌షిప్ నుంచి కూడా వెళ్లిపోతారు. దేబ్జాని, రామకృష్ణ ముఖేష్ పేరు.. వంశీ,రామ్ ప్రసాద్, నరేష్, నీతూ, త్రిగుణ్.. వర్షిణి పేరు.. సుధీర్.. శివ పేరు.. వర్షిణి, శ్వేత.. రామకృష్ణ, అమన్, వంశీ.. త్రిగుణ్.. ముఖేష్.. వంశీపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నట్టుగా రాశారు. ఐదుగురు వర్షిణి పేరు రాశారు.

త్రిగుణ్, ముఖేష్ ఆడుతూనే సంచాలకులుగా టాస్క్ ప్రారంభమైంది. ముఖేష్ టీమ్ ముందుగా ఈ టాస్క్ ఫినిష్ చేసింది. తీగ తెగింది. దీంతో తాను విన్ ఇవ్వలేనని త్రిగుణ్ చెప్పాడు. సమయం ఇచ్చినా కూడా నిర్ణయం చెప్పకపోవడంపై త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. టీమ్ ఏ విన్నర్ అని ఫైనల్‌గా త్రిగుణ్ చెప్పాడు. మీలో ఏ ఒక్కరికి రివార్డ్ దక్కాలో నిర్ణయించుకుని చెప్పాలని బిగ్‌బాస్ చెప్పారు. నిన్న కాక మొన్న వచ్చిన శివ్, శ్వేత, నీతూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్ కావాలని అడిగారు. అందరూ ఎవరి వర్షన్ వాళ్లు వినిపించారు. ఇక ఫైనల్‌గా చిట్టీలేశారు. శ్వేతకు వచ్చింది. దీంతో రివార్డ్ ఆమెకు దక్కింది. రివార్డ్ వచ్చిన శ్వేత.. రామకృష్ణపై రివెంజ్ తీర్చుకోవాలనుకోవడంతో అతనికి ఫ్యామిలీతో పాటు కంటెండర్‌షిప్ కూడా దూరమైంది. నెక్ట్స్ చాలెంజ్‌లో ఆరుగురు ఉండాలని బిగ్‌బాస్ చెప్పారు. శ్వేత, రామకృష్ణ మినహా ఉండాలని చెప్పారు. రెండో ఛాలెంజ్‌లో అమన్, నీతూ, ముఖేష్.. సుధీర్, దేబ్జాని, వంశీ ఆడారు. మీ సిస్టర్ కోసం ప్రే చేశానని శివ్ వచ్చి ముఖేష్‌కు చెప్పాడు. నీపై కోపం లేదని.. దేబ్జాని వెనుక తిరుగుతాడని చెప్పడంతో కోపం వచ్చిందని అన్నాడు. వర్షిణితో ముఖేష్ బాండ్ చాలా స్పెషల్ అని దానిని ఫ్రెండ్షిప్ అని చెప్పలేమని శివ్ అన్నాడు. మీ మధ్య ఉన్న బాండింగ్.. తనకు దేబ్జానికి మధ్య లేదని చెప్పాడు.

అమన్‌ది తీయమని సుధీర్.. వంశీది తీయమని ముఖేష్ మాట్లాడుకున్నారు. ఇక రెండవ ఛాలెంజ్.. ‘తగ్గించు.. తప్పించు’. ధర్మకోల్ బాల్స్‌తో నిండిన బ్యాగ్స్‌ను వీపునకు తగిలించుకోవాలి. చివరి రౌండ్ ముగిసే సమయానికి గేమ్‌లో ఎవరుంటే వాళ్లే విజేతలు. ఇప్పుడు రివెంజ్‌ను మార్చుకోవాలంటే తిరిగి మార్చి రాయాలని బిగ్‌బాస్ చెప్పారు. ఎవరూ మార్చమని చెప్పారు. నీతూని తేద్దామని వాళ్లు మాట్లాడుకున్నారని కాబట్టి మీరు ముగ్గురూ కలిసి ఆడమని నీతూకి త్రిగుణ్ చెప్పాడు. కానీ వంశీ ప్రారంభం నుంచే నీతూని టార్గెట్ చేశాడు. నీతూ వెళ్లి పడిపోయి తలకు దెబ్బ తగిలినా కూడా వంశీ వదల్లేదు. ఫస్ట్ రౌండ్‌లో నీతూ అవుట్ అయ్యింది. ఆ తరువాత దేబ్జానిని ముఖేష్ టార్గెట్ చేశాడు. ఫస్ట్ అబ్బాయిలతో ఆడాలంటూ దేబ్జాని గొడవ చేసింది. ఈ రౌండ్‌లో దేబ్జాని అవుట్ అయ్యింది. దేబ్జాని మాటలు జారుతుంటే రామ్ ప్రసాద్ నోరు మూసేశాడు. ఎలాగైనా ముఖేష్ రాకూడదని అందరికీ చెబుతానని ముఖేష్ అంటోంది. ఈ రౌండ్‌లో సుధీర్, అమన్ అవుట్ అయ్యారని.. ఫౌల్ గేమ్ ఆడారని శివ్ చెప్పాడు. దీంతో సుధీర్, అమన్ గొడవపడ్డారు. రాంగ్ రూట్ పోతావా? అని అమన్‌పై సుధీర్ గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ వెళ్లి ముఖేష్‌పై కూడా గొడవ పడ్డాడు. ఎందుకు అరుచుకుంటున్నారో కూడా అర్థం కాలేదు.

తన బ్యాగ్ తీసుకుని అమన్ చేతిలో పెట్టాడని సుధీర్ గొడవ. తనకు సాయం చేయడమెందుకు పదే పదే అది తీసుకురావడమెందుకని సుధీర్ అన్నాడు. సుధీర్ ఇవాళ చాలా సెల్ఫిష్‌గా కనిపించాడు. తనకు అన్న ముఖేష్ అని చెప్పానని.. ఈరోజు నుంచి లేదని చెప్పాడు. త్రిగుణ్ వచ్చి చెప్పడంతో తిరిగి అమన్‌ను ఆటలో ఉంచాడు. ఈ రౌండ్‌లో ముఖేష్ ఎలిమినేట్ అయ్యాడు. బ్యాక్‌స్టాబర్‌వి అని.. పాయిజన్ అని.. అన్నీ అబద్ధాలే చెబుతాడని సుధీర్‌ను అమన్ అన్నాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. చివరకు అమన్, వంశీ మిగిలారు. ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. చివరకు వంశీ విన్ అయ్యాడు. వంశీకి ఫ్యామిలీతో పాటు కంటెండర్‌షిప్ దక్కింది. మొత్తానికి ఫ్యామిలీని బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించేందుకు కంటెండర్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. వంశీ, శ్వేత ఇవాళ్టికి విజేతలయ్యారు.

Telugu Cinema 360

Recent Posts

ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!

మెగా అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు తీపికబురు చెప్పాడు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్. ఆయన జీవితంలో కొత్త ఇన్నింగ్స్…

6 minutes ago

వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..

వీకెండ్ హడావిడి పూర్తయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలు నిజాలు మాట్లాడుకునే సమయం వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు…

1 day ago

జనసేన మరోసారి 100 % స్ట్రైకింగ్.. పురం ఎన్నికల్లోనూ పవన్ ప్రభంజనం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది, అదే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సైలెంట్ గా…

1 day ago

హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!

సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పెయిర్స్ మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున,…

2 days ago

ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!

సౌత్ ఇండియాలో సినిమాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా హీరోల సినిమాలకు…

2 days ago

మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టైటిల్స్ ఆయన రియల్ లైఫ్‌కు భలే సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్…

2 days ago