ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో మాత్రం మంటలు అంటుకున్నాయి. మిథిలేష్ రూ.15 లక్షలతో బయటకు వెళతానంటున్నాడు.. సపోర్ట్‌గా ఎవరు ఓటు వేస్తారంటే అగ్ని పరీక్ష టీం మొత్తం చేతులెత్తింది.
రూ.15 లక్షలు.. విన్నర్ అమౌంట్ నుంచి కట్ అవుతాయని హోస్ట్ నాగార్జున చెప్పడంతో అవి తీసుకెళ్లడానికి వీల్లేదని.. ముఖేష్, త్రిగుణ్ గొడవ చేశారు. ఇవాళ విడుదలైన ప్రోమో ప్రకారం దీని గురించి పెద్ద గొడవ జరిగింది. మిథిలేష్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై త్రిగుణ్ మండిపడ్డాడు. ఆ రూ.15 లక్షలు నావంటే నావంటూ త్రిగుణ్, ముఖేష్.. అగ్నిపరీక్ష టీంపై పడ్డారు. ఈ నేపథ్యంలో అమన్ వర్సెస్ త్రిగుణ్ పెద్ద గొడవే జరిగింది. ఒకరి మీదకు మరొకరు వెళ్లడంతో రోహిత్, చరణ్, వంశీ వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ మరో ప్రోమోలో త్రిగుణ్‌ను కన్నింగ్ అని రోహిత్ చెప్పడం.. అతనికి సంబంధించిన రెండు వీడియోలు రోహిత్ గురించి చెబుతున్నాయని త్రిగుణ్ అనడం వంటివి జరిగాయి. మొత్తానికి రోహిత్ వర్సెస్ త్రిగుణ్ రైవలరీ మళ్లీ ప్రారంభమైంది.
బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా నడుస్తోంది. దాదాపుగా వీకెండ్‌కు చేరుకోవడంతో మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.…
నిన్న ఎక్కడైతే టాస్క్‌లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్‌బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి…
మెగా అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు తీపికబురు చెప్పాడు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్. ఆయన జీవితంలో కొత్త ఇన్నింగ్స్…
నీతూ, వర్షిణి, ముఖేష్.. ముగ్గురూ వంట గురించి చర్చ. తను రసం పాడు చేశానని అందరూ తనపై పడ్డారని.. కానీ…
వీకెండ్ హడావిడి పూర్తయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలు నిజాలు మాట్లాడుకునే సమయం వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది, అదే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సైలెంట్ గా…