సినిమా వార్తలు

Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..

హోస్ట్ నాగార్జున వచ్చి శుక్రవారం ఎపిసోడ్ చూశారు. వైట్ గోల్డ్ సంస్థ నుంచి కెప్టెన్ అయిన ముఖేష్‌కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తరువాత అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా.. కూర్చొని ముఖేష్‌కు వచ్చిన స్టార్ గురించి చర్చించుకుంటున్నారు. మిథిలేష్‌ను జిమ్ పెట్టుకోమను.. వర్షిణిని సాయంగా పంపిస్తానని ముఖేష్ అన్న మాటలను రోహిత్ చెప్పాడు. ఆ తరువాత అపూర్వ, సుధీర్‌ల మధ్య జరిగింది. సృష్టి మాట్లాడిన మాటల గురించి అపూర్వ సుధీర్‌తో ఆమె మాట్లాడిన మాటలపై నిలబడుతున్నట్టు చెప్పింది. షాలినియే తననలా రెచ్చగొట్టిందని అపూర్వ చెప్పింది. అందరి ముందు సృష్టిని సపోర్ట్ చేసి.. ఆ తరువాత ఆమెపైనే షాలిని కామెంట్స్ చేస్తుందని అపూర్వ చెప్పింది. ఇల్లు క్లీన్ చేయకపోవడంపై రోహిత్, త్రిగుణ్ మధ్య జరిగిన గొడవ గురించి ఇద్దరూ మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకున్నారు. ఆ తరువాత అపూర్వ పదే పదే తను మాట్లాడిన మాటలను తీయడంపై చర్చ జరిగింది. చూడబోతే అపూర్వ హౌస్‌లో ఎన్నో రోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తరువాత ఫోన్‌పే గోల్డెన్ కాయిన్స్ ఇచ్చింది. అవి ఎవరికైనా ఇవ్వొచ్చు.. లేదంటే మీరు ఉంచుకోవచ్చంటే.. ముఖేష్ ఒకటి ఝాన్సీకి ఇచ్చి రెండు తన దగ్గరే ఉంచుకున్నాడు. రోహిత్, చరణ్, షాలిని, సృష్టి మినహా మిగిలిన వాళ్లంతా కూర్చొని తమ లవ్ స్టోరీల గురించి సరదాగా చెప్పుకున్నారు.

చెత్త అని క్యాప్షన్ ఇచ్చి దానిపైన కంటెస్టెంట్స్ అందరి ఫోటోలు పెట్టారు. వాటి నుంచి మొదట సృష్టి ఫోటో తీసి ఆమెను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. నామినేషన్ టైంలో సుధీర్ నెత్తిపై అలా చెత్త రుద్దడాన్ని నాగ్ ప్రశ్నించారు. తనను యూజ్ చేసినట్టుగా అనిపించిందని.. మనుషులు యూజ్ చేసి వదిలేస్తారనే భావన ఉందని సృష్టి చెప్పింది. ప్రతిసారి తనను ఎవరో ఒకరు హర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పింది. తనను ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టాడని.. తనను డిస్ట్రాయ్ చేసి వదిలేశాడని సృష్టి చెప్పింది. ఆ తరువాత సుధీర్ ఏమన్నాడో చెప్పి తను ట్రిగర్ అయ్యానని తెలిపింది. తను అలా ట్రిగర్ అవుతానని అనుకోలేదని చెప్పింది. పర్సనల్ ట్రోమాను డస్ట్‌బిన్‌లో వేయకుంటే ఇబ్బంది పడతావని నాగ్ చెప్పారు. లేదంటే నువ్వు ప్రెజెంట్‌లో బతకవని నాగ్ చెప్పారు. ‘నీ గతాన్ని తీసుకొచ్చి వీళ్లపై రుద్దడం కరెక్ట్ కాదు’ అని నాగ్ చెప్పారు. ప్రేక్షకులందరినీ కూడా సృష్టి క్షమించమని వేడుకుంది. ఆ తరువాత సుధీర్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి నాగ్ పిలిచారు.

పాడ్ కాస్ట్‌లలో నీ ఎదుటి వాళ్ల మనసను తెలియకుండానే మాట్లాడతావా? అని సుధీర్‌ను నాగ్ ప్రశ్నించారు. రోహిత్‌తో మాట్లాడితే అప్పుడు సలహాలిస్తారని.. ఆ తరవాత వాటినే పాయింట్ అవుట్ చేస్తాడన్నట్టుగా చెప్పాడు. ఒకమ్మాయిని ఏదంటే బయటకు ఎలా వెళుతుందోనని చెప్పాడు. అలాంటప్పుడు వర్షిణి దగ్గర ‘నాకు ఐదుగురు అమ్మాయిలున్నారు.. సృష్టితో ప్రాక్టీస్ చేస్తా’ అని చెప్పడం కరెక్టా? అని నాగ్ అడిగారు. వాళ్లంతా ఫ్రెండ్స్ అని అలా ప్రాక్టీస్ చేస్తున్నా అన్నట్టుగా తెలిపాడు. దీనిపై నాగ్ బయట చూసే వారెవరైనా ఎలా అనుకుంటారని నాగ్ ప్రశ్నించారు. రోహిత్, త్రిగుణ్ గురించి చెప్పడంతో వారిద్దరి గేమ్‌లో నువ్వెందుకు ఇరుక్కుంటున్నావని నాగ్ అడిగారు. ఫ్రీడం గురించి నాగ్ తీశారు. ఎందుకలా అన్నావని అడిగారు. ‘నువ్వు ఫ్రీడం అనే మాట చెప్పి డ్యాన్స్ చేస్తే దానికి వర్షిణి, ముఖేష్ నవ్వారు. అవన్నీ చూస్తే హ్యుమిలియేషన్ అనిపించదా?’ అని అడిగారు. ముఖ్యంగా రోహిత్‌నే సుధీర్ టార్గెటింగ్‌గా సుధీర్ మాట్లాడాడు. త్రిగుణ్ సలహా మేరకే సృష్టి అంతా మాట్లాడిందని సుధీర్ చెప్పాడు. ఒకమ్మాయి అలా మాట్లాడటం తనకు తప్పనిపించిందని సుధీర్ అనగానే.. నాగ్ ఫైర్ అయ్యారు. అంటే ఆ మాటలు మేల్ అంటే కరెక్టేనా? అని నాగ్ అడిగారు. ‘నేను మొదట నువ్వు కరెక్ట్ అని అనుకున్నా.. కానీ ఇప్పుడు నీ ఇన్‌టెన్షన్స్ వింటుంటే నీది రాంగ్ అనిపిస్తోంది అని నాగ్ సుధీర్‌కు చెప్పారు. ‘సృష్టి అలా మాట్లాడటం నీకు హ్యుమిలియేషన్ అనిపించింది.. కానీ నువ్వు డ్యాన్స్ చేయడం వలన వర్షిణి, ముఖేష్ అలా నవ్వడం కరెక్టా? రెచ్చగొట్టినట్టు కాదా?’ అని నాగ్ ప్రశ్నించారు.

ఆ తరువాత నరేష్‌ను లేపి అతనికి హౌస్‌లో అన్యాయం జరిగిందని ఎవరు అనుకుంటున్నారో చేతులు లేపమంటే.. వర్షిణి, సుధీర్, ముఖేష్ చేతులు లేపారు. ఆ తరువాత వీడియో ప్లే చేసి చూపించారు. దానిలో వంశీయే ముందు బజర్ కొట్టినట్టుగా ఉంది. నరేష్‌ని నాగ్ అడిగితే వంశీయే బజర్ కొట్టారని చెప్పాడు. ‘నీకు అన్యాయం జరగలేదని చెప్పేందుకే ఈ వీడియో చూపించా’ అని నాగ్ చెప్పారు. హౌస్‌లో పాజిటివిటీ అనేది ఉంటే అది నరేష్ సైజులో మాత్రమే ఉందన్నారు. దేబ్జానిని లేపి చిల్లర మాటలు వద్దని మరోసారి నాగ్ చెప్పారు. నరేష్‌ను పొట్టోడు అని దేబ్జాని అన్నప్పుడు అతను బాధపడిన వీడియోను నాగ్ చూపించారు. అంత హర్ట్ అవుతారని అనుకోలేదని దేబ్జాని సారీ చెప్పింది. హౌస్‌లోని అన్ని విషయాల పరంగా తనకు నరేష్ ఎవరెస్ట్ అని నాగ్ అన్నారు. ఆ తరువాత ముఖేష్‌ని లేపి అమన్‌ను బచ్చాగాడు అనడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. గుండె మీద స్టార్ ఉందని.. నువ్వు తప్ప అటువైపు వాళ్లంతా బచ్చాగాళ్లు అనుకుంటే కరెక్ట్ కాదన్నారు. హౌస్‌లోకి మిథిలేష్ వచ్చాక అతడిని విమర్శించడంపై కూడా ముఖేష్‌ను నాగ్ ప్రశ్నించారు.

రామ్ ప్రసాద్ నెక్ట్స్ ఎవరిని పిలుద్దామనగానే.. తనతోనే స్టార్ట్ చేయాలని చెప్పాడు. కన్నింగ్ అనగానే ఎందుకంత ఫీలయ్యావని నాగ్ అడిగారు. చాణిక్యుడు అంటే ఓకేనా? అని నాగ్ అడిగారు. నిజమైన కన్నింగ్‌నెస్ కూడా ఉందని మిథిలేష్ చెప్పాడు. ఎందుకలా అంటే.. టాస్క్‌లో అమన్‌ను తీసేసి వేరొకరికి ఇవ్వడం కన్నింగ్‌లా అనిపించిందని మిథిలేష్ చెప్పాడు. నాగ్ మాత్రం అది అతని ఇంటెలిజెన్స్ అని పేర్కొన్నారు. రిలాక్స్ అయిపోయావని.. ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప మరేం లేదన్నట్టుగా రామ్ ప్రసాద్‌కి నాగ్ చెప్పారు. నామినేషన్స్ గురించి మాట్లాడుతూ.. ‘నక్కలే గుంపుగా వస్తాయి రామ్ ప్రసాద్’ అని చెప్పారు. అంటే నామినేషన్స్‌పై గ్రూప్ చర్చలు చేయవద్దని పరోక్షంగా చెప్పారు.

ఆ తరువాత అమన్‌ని లేపి బరాబర్ ఆడావా? అని అడిగారు. ‘టాస్క్‌లో వర్షిణితో నువ్వు ఆడిన తీరు కరెక్టా?’ అని నాగ్ అడిగారు. ఆటలో భాగంగానే అలా చేశానని తనకు ఎలాంటి ఇన్‌టెన్షన్‌తో వర్షిణిని పట్టుకోలేదని అమన్ చెప్పాడు. వర్షిణిని లేపి అడిగారు. తనొక అమ్మాయినని తనను అలా పట్టుకోవడం నచ్చలేదని వర్షిణి చెప్పింది. ఆ తరువాత వీడియో ప్లే చేసి మరీ చూపించారు. దేబ్జానిని లేపి నాగ్‌ అడిగారు. ‘రోహిత్‌తో కలిసి నువ్వు ఆడినప్పుడు అమ్మాయి, అబ్బాయి అనే తేడా చూపించావా?’ అంటే దేబ్జాని లేదని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో జెండర్ డిఫరెన్స్ లేదని నాగ్ చెప్పారు. ఒకవేళ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయితే సంచాలక్‌కి చెప్పి టాస్క్ ఆపేయమని నాగ్ చెప్పారు. రోహిత్‌ని లేపి నువ్వు చూస్తున్న చోట నుంచి కామెంట్రీ చెప్పడం ఆపేయమన్నారు. రోహిత్ అదెక్కడ రాంగ్‌గా వెళుతుందోనని చెప్పడంతో భయపడి చెప్పానని చెప్పాడు. అంతేనా? పప్పుగాడని చెప్పావా? అని నాగ్ అడిగారు. అప్పుడు రోహిత్.. అమన్ గురించి చరణ్‌తో మాట్లాడిన మాటల వీడియోను ప్లే చేశారు. రోహిత్‌ను అక్కడ మాటల ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెప్పొద్దని నాగ్ చెప్పారు. మొత్తానికి రోహిత్‌కు నాగ్ అక్షింతలు వేయకుంటే షో సంపూర్ణమవదంటూ నెట్టింట వస్తున్న ట్రోల్స్‌ను ఈ వారం కూడా నాగ్ బలపరిచారు.

నామినేషన్స్‌లో ఉన్న 8 మంది నుంచి సుధీర్‌ను సేవ్ చేశారు. రోహిత్, ముఖేష్ ఆడినప్పుడు సంచాలక్ నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావని నాగ్ ప్రశ్నించారు. ఆ డెసిషన్ విషయంలో రోహిత్ చెబితే ఎందుకు వినట్లే.. రామ్ ప్రసాద్ చెబితే ఎందుకు వింటున్నావని నాగ్ ప్రశ్నించారు. తన ప్రకారం ఆ డెసిషన్ రాంగ్ అని రోహిత్ చెప్పాడు. వీడియో ప్లే చేసి చూపించారు. ముఖేష్ గెలవడానికి కారణం వర్షిణి పుష్ అని అరవడమేనని నాగ్ చెప్పారు. ముఖేష్ గెలుపుపై వర్షిణి ఫోకస్ చేసింది కానీ తన గెలుపుపై ఫోకస్ చేయలేదని నాగ్ పనిలో పనిగా కౌంటర్ ఇచ్చారు. చరణ్‌ని లేపి నువ్వేదో పొడుస్తావని అంతా అనుకున్నామని నాగ్ అన్నారు. ఆడితే ఉంటావు.. లేదంటే వెళ్లిపోతావని చెప్పారు. వంశీని లేపి ‘నీపై ఝాన్సీ గెలుస్తుందనుకున్నావా?’ అని అడిగారు. ఇంప్రూవ్ చేసుకోమని నాగ్ చెప్పారు.

షాలినిన లేపి పిచ్చింగ్ స్టార్ అని నాగ్ అన్నారు. అలా ఎవరు అన్నారని అనడంతో అపూర్వ అన్నదని నాగ్ తెలిపారు. సృష్టికి, షాలినికి జరిగిన విషయంలో అనాల్సి వచ్చిందని అపూర్వ చెప్పింది. సృష్టి దగ్గరకు వెళ్లి నేరుగా చెప్పి ఉంటే బాగుండేదని నాగ్ అన్నారు. త్రిగుణ్‌ని లేపి ‘నాట్ మై టైప్, నాట్ మై రేంజ్’ రెండూ ఒకటేనా? అని నాగ్ అడిగారు. సృష్టిని ఇన్‌స్టిగేట్ చేసేందుకు చెప్పానని అది జరిగిందని నాగ్ అన్నారు. ఝాన్సీకి డబుల్ స్టాండర్డ్స్ అని ఎందుకన్నావని నాగ్ అడిగారు. రోహిత్ వాళ్లు ఏదైనా చేస్తే ఒకలా.. ముఖేష్ వాళ్లు చేస్తే ఒకలా చెబుతుందని అందుకే అలా అనాల్సి వచ్చిందని త్రిగుణ్ చెప్పాడు. నరేష్‌ని లేపి ‘నువ్వు నామినేషన్స్‌లోకి రావా?’ అని నాగ్ అడిగారు. ఎంత ట్రై చేసినా తననెవరూ నామినేట్ చేయడం లేదని చెప్పాడు. నెక్ట్స్ నామినేషన్స్‌లో ఉన్నవారిని లేపి వారి నుంచి షాలినిని సేఫ్ చేశారు. ఆమెకు తన పేరెంట్స్ ఫోటోని పంపించారు.

హౌస్‌ టెమ్టేషన్ కోసం వెయిట్ చేస్తోందని.. ఇప్పటి వరకూ ఎలాంటి టెమ్టేషన్ లేదని నాగ్ తెలిపారు. దానికోసం సందీప్, జేసన్ సంజయ్‌ని నాగ్ పిలిచారు. ‘సిగ్మా’ ప్రమోషన్స్ కోసం వాళ్లిద్దరూ హౌస్‌లోకి వచ్చారు. బ్రీఫ్‌కేసును హౌస్‌లో పెట్టించారు. అందులో క్యాష్ ఉందని.. దానిని తీసుకుని ఎవరైనా బయటకు వచ్చేయవచ్చని నాగ్ చెప్పారు. దానిలో రూ.5 లక్షలు ఉందని ముందుగా చెప్పారు. అపూర్వ, ముఖేష్‌లను లేపి అడగడంతో వాళ్లు తీసుకుని వెళ్లమన్నారు. ఎవరూ టెమ్ట్ అవకపోవడంతో ఆ అమౌంట్‌ను రూ.10 లక్షలు చేశారు. అయినా కూడా ఎవరూ ఓకే చెప్పకపోవడంతో దానిని రూ.15 లక్షలకు పెంచారు. అప్పుడు మిథిలేష్ లేచి తాను తీసుకుంటానని చెప్పాడు. అతని కొంత టైమ్ ఇచ్చినా కూడా తను అమౌంట్ తీసుకుని వెళ్లిపోతానన్నాడు. హౌస్‌లో ఉన్న అందరికీ.. మిథిలేష్ తీసుకెళ్లే డబ్బులు మీ ప్రైజ్ మనీలో నుంచి తీసేస్తామని చెప్పారు. అందరికీ కొంత టైమ్ ఇచ్చారు. మిథిలేష్‌ను కన్విన్స్ చేసేందుకు. త్రిగుణ్, ముఖేష్ ట్రై చేశారు కానీ మిథిలేష్ ఒప్పుకోలేదు. మిథిలేష్ నిర్ణయానికి ఓటింగ్ పెట్టారు. మిథిలేష్ నిర్ణయానికి మెజారిటీ నో చెప్పారు. అప్పుడు వారిని కన్విన్స్ చేసుకోమని నాగ్ చెప్పారు. అప్పుడు మిథిలేష్.. ఇక్కడ కాంబినేషన్స్ ఫామ్ అయిపోయాయని ఇప్పుడు తాను వచ్చి గెలవబోయేది లేదన్నాడు. మిథిలేష్‌నే వారిని ఒప్పించుకోమని చెప్పడంతో అమన్‌ని కన్విన్స్ చేశాడు. దీంతో మెజారిటీ సభ్యులు మిథిలేష్ అమౌంట్ తీసుకుని బయటకు వెళ్లడానికి అంగీకరించారు. మొత్తానికి ఇలా వచ్చి అలా రూ.15 లక్షలు తీసుకుని మిథిలేష్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు. ఈ వారం నాగ్ అయితే దాదాపుగా అందరికీ ఏదో ఒక విషయమై నాగ్ క్లాస్ తీసుకున్నారు.

Telugu Cinema 360

Recent Posts

Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!

ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి…

9 hours ago

నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఆయన గురించి సోషల్…

10 hours ago

‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?

‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని…

10 hours ago

Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్

ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు…

10 hours ago

అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?

మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ కింగ్ గా,…

2 days ago

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క…

2 days ago