బిగ్‌బాస్ షో నేడు త్రిగుణ్ ఫ్యామిలీ రాకతో ప్రారంభమైంది. త్రిగుణ్ కూతురు యూకీ ‘పాప’ అని పిలవడం విని హౌస్ అంతా హ్యాపీ ఫీలైంది. పాప నెలల వయసే కావడంతో అందరినీ చూసి ముందుగా కంగారు పడింది. ఆ తరువాత త్రిగుణ్ తీసుకుని కొంచెం కూల్ చేశాడు. త్రిగుణ్ భార్య నివేదిత వెళ్లి అందరినీ పలకరించింది. రోజూ చూస్తున్నావా? అని అడిగాడు. రోజూ చూస్తున్నానని… మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావని నివి చెప్పారు. ఫ్యామిలీస్ అంతా వస్తుంటే అమ్మ గుర్తొస్తోందని చెప్పాడు. ట్రోఫీ తీసుకుని రమ్మని నివి చెప్పారు. 15-16 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా తను పెద్దగా తెలియదని ఇప్పడు అందరికీ తెలుస్తున్నానని అన్నాడు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని.. కానీ నీ గోల్ గుర్తుంచుకోమని చెప్పింది. ఇంకా ఐదు వారాలే ఉందని ఏమీ ఆలోచించవద్దని నివి చెప్పారు. వర్షిణి వల్ల చాలా హర్ట్ అయ్యానని త్రిగుణ్ చెప్పాడు. తన గురించి ఆలోచిస్తే బాధగా ఉందంటే వదిలేయమని… ఎవరినీ నమ్మవద్దని నివి చెప్పారు.
యూ ఆర్ మై అల్టిమేట్ గోట్ అని.. నీ దగ్గర పెట్టుకోమని తన బ్యాడ్జ్ నివికి త్రిగుణ్ ఇచ్చాడు. నువ్వు కూడా చాలా బాగా ఆడుతున్నావని వర్షిణికి నివి చెప్పింది. తనను అపార్థం చేసుకున్నావని.. మొదట్లో తన కోసం చాలా వెయిట్ చేశానని అది త్రిగుణ్‌కి తెలియదని చెప్పమని నివికి వర్షిణి చెప్పింది. బిగ్‌బాస్‌లో ఉన్న త్రిగుణ్‌కి మీ ఇంట్లో ఉన్న త్రిగుణ్‌కి డిఫరెన్స్ ఏంటని బిగ్‌బాస్ అడిగారు. దీనికి నివి.. ‘నువ్వు నాకు దూరంగా ఉన్నప్పటి నుంచి నీలో ఇంటెలెక్చువల్ పార్ట్ చూస్తున్నా’ అని చెప్పారు. ఇప్పుడైనా తనకు బ్రెయిన్ ఉందని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని త్రిగుణ్ చెప్పాడు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లేరని నివి అంటే.. వీళ్లంతా తన ఫ్యామిలీ మెంబర్సేనని త్రిగుణ్ చెప్పాడు. అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. ‘ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నువ్వు ఫోకస్‌గా ఉండు.. గొడవ చేయకు’ అని త్రిగుణ్‌కు నివేదిత చెప్పి వెళ్లిపోయింది. తను పాపం కొంచెం మింగలేక కక్కలేక ఉన్నాడని త్రిగుణ్ చెప్పాడు. కల్లు తాగిన కోతి అని మాట గురించి.. ముఖేష్‌ను చూపిస్తూ నీతూ అన్నది. దీంతో ముఖేష్ ప్రశ్నించాడు. అంతమంది అంటే ఏమనలేదు కానీ తను అంటే మాత్రం వచ్చిందా? అని నీతూ అన్నది. తనేమైనా కప్ప అన్నానా? అని ముఖేష్ అడిగాడు. ఈ విషయాన్ని నీతూ అర్థం చేసుకోలేదు. వాస్తవానికి ఈ విషయంలో నీతూదే తప్పు. ఎవరో ఏదో అన్నారని దానిని తీసుకొచ్చిన కల్లు తాగిన కోతి అనడం తప్పు. అయితే నీతూ సారీ చెప్పింది.
తనకు ఎవరో ముఖేష్, వర్షిణి దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారంటే.. శివ్ తనే చెప్పానన్నాడు. సుధీర్ కూడా తనకు చెప్పానన్నాడు. తన వరకూ అయినంత సపోర్ట్ చేస్తానని శివ్ చెప్పాడు. ఇక్కడ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నాడు. రాబోయే వారంలో చాలా మార్పులు వస్తాయని.. మనం అనుకున్నదంతా ఉల్టా పల్టా అవుతుందని చెప్పాడు. అంతలోనే నీతూ కూతురి పాట వినిపించింది. మాంచి తీన్మార్ మ్యూజిక్‌తో నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. అంతా డ్యాన్స్ చేశారు. నటరాజ్ కూడా డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. అంతా డ్యాన్స్‌తో ఊగిపోయారు. త్రిగుణ్ హగ్ చేసుకోగానే ఇప్పుడే పొడవకు అంటూ నటరాజ్ మాస్టర్ పంచ్ వేశారు. బిగ్‌బాస్ ఉన్నంత కాలం వస్తూనే ఉంటానని నటరాజ్ మాస్టర్ చెప్పారు. నీతూ హగ్ చేసుకుని ఏడుస్తుంటే ఇక చాలు.. ఏడవద్దని నటరాజ్ చెప్పారు. మన ప్రతి కన్నీటి బొట్టు విలువైందని చెప్పారు. తనకు చెప్పుకోవడానికి ఎవరూ లేరని చెప్పడంతో నువ్వు హౌస్‌లో ఆడు.. నేను బయట ఆడతానని నటరాజ్ చెప్పారు. ఇప్పటి వరకూ వచ్చిన కన్నీటి బొట్ల నుంచి వెపన్స్ తీయమని నటరాజ్ చెప్పారు. ఏం చేస్తావో తెలియదు.. ఏడవద్దని నీతూ నుంచి నటరాజ్ ప్రామిస్ తీసుకున్నారు.
వంశీ ఎదురుగా వెళ్లి సీరియస్‌గా చూస్తూ నిలబడ్డారు. వంశీ కూడా అలాగే చూస్తూ నిలబడ్డారు. తరువాత హగ్ చేసుకున్నారు. మీ పాప చాలా నచ్చిందని.. తనను చూసి వదిలేస్తున్నట్టుగా నటరాజ్ చెప్పారు. వంశీ వాళ్ల పాప తన మైండ్‌సెట్‌ను మార్చేసిందని చెప్పారు. కాఫీ ఇస్తే ఇది తాగితే త్రిగుణ్‌లా అవ్వను కదా అని అడిగారు. త్రిగుణ్ దృష్టి నుంచి అంతా వేరేలా కనిపిస్తున్నారని నటరాజ్ అంటే.. మొత్తం చెప్పేస్తే తన గేమ్ ఏముంటుందని త్రిగుణ్ అన్నాడు. నీతూ వాళ్ల పాప చాలా క్యూట్‌గా ఉంది. క్యూట్‌గా మాట్లాడుతోంది. వంశీ లాగేటప్పుడు కింద పడ్డావు కదా.. అది చూసి పాప ఏడ్చిందని నటరాజ్ చెప్పారు. ఒక బేబి ఉన్నా కూడా అంతసేపు ఆ వెయిట్స్ ఎత్తుకుని ఎలా మోసావని అడిగారు. తనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని నటరాజ్ చెప్పారు. పాప కూడా చాలా బలం నీ దగ్గర ఉందని చెప్పారు. మానసికంగా వీక్ చేస్తున్నారని.. అదే ఇక్కడ గేమ్ అని చెప్పారు. నామినేషన్స్ గట్టిగా ఇస్తున్నావు కానీ వెనుక నుంచి నవ్వుతున్నా పట్టించుకోవద్దని చెప్పారు. త్రిగుణ్ ట్రిగర్ చేస్తున్నారని ట్రిగర్ అవ్వొద్దని చెప్పారు.
నటరాజ్‌ను బిగ్‌బాస్.. నీతూ ఆట పట్ల మీరెంత గర్వంగా ఉన్నారో చెప్పమంటే.. పెళ్లికి ముందు రోడ్ క్రాస్ చేయాలన్నా తన మదర్ తీసుకెళ్లేవారని.. పెళ్లి తర్వాత తన చేయి పట్టుకుని రోడ్ దాటించేలా చేశానని నటరాజ్ చెప్పారు. తనిలా ఆడుతుందని తనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నారు. పానిక్ అవ్వొద్దని మనం ఒకరిని పానిక్ చేయాలని చెప్పారు. చాలా చాలా బాగా ఆడుతున్నావని చెప్పారు. వంశీకి మనం ఆడపిల్లల తండ్రులమని.. మన పిల్లలు మనల్ని చూసి గర్వ పడాలన్నారు. తన నమ్మకం ఏంటంటే.. తన ప్లేస్‌లో మీరుంటే కూడా అలాగే ఉండేవారనిపించిందని చెప్పారు. ఈ సందర్భంగా నటరాజ్ ఒక కథ చెప్పారు. అనగనగా ఒక అడవి.. ప్రతి సీజన్‌కు జంతువులన్నీ వచ్చి వాలతాయి. ఒక్కొక్క దాని మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది. ఒకటి ఏం చేసిందంటే.. ఎవరిని లేపేయాలో ప్లానేసి అది వేటాడి తినేసి ఆ ముక్కలన్నీ తీసుకెళ్లి అందరి ముందూ పెట్టి.. ఒక్కొక్కరినీ వేటాడుతోంది.. జాగ్రత్త అందరినీ వేసేస్తుందని చెప్పిందట’ అని స్టోరీ చెప్పారు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని నటరాజ్ మాస్టర్ చెప్పారు. వంద సీజన్లు తీసినా వస్తానే ఉంటానని నటరాజ్ చెప్పారు. మళ్లీ ఏశనాగుల కట్ట మీద సాంగ్ వేశారు. అంతా మళ్లీ చాలా యాక్టివ్‌గా డ్యాన్స్ చేశారు. అందరూ గొడవ ఆడుకోకండి.. మంచి ఫ్రెండ్స్‌లా ఉండండని పాప చెప్పింది. అందరినీ బాగా చూసుకోమని చెప్పి నటరాజ్ మాస్టర్ వెళ్లిపోయారు.
నీవల్ల ఇంకో మనిషి హైలైట్ అవుతున్నాడని ముఖేష్ గురించి వర్షిణికి చెప్పాడు. మరోవైపు ముఖేష్‌తో దేబ్జాని కూర్చొని తన వాళ్ల వైపు స్టాండ్ తీసుకోవాలని చెప్పింది. ఇప్పటి వరకూ వంశీ హౌస్‌లో ఉండటానికి కారణం త్రిగుణ్ అని రామ్ ప్రసాద్‌కు శివ్ చెప్పాడు. వంశీపై సాఫ్ట్ కార్నర్ ఉందని ప్రియాంక చెప్పిందన్నారు. నీతూ ఇవాళ మొత్తం తనతో ఉందని త్రిగుణ్ చెప్పాడు. మనం వచ్చే వారం తగ్గకూడదని మనం కలిసి ఉండాలని నీతూకి శివ్ చెప్పాడు. ఈవారం మీ పాత్రల్లో స్టూడెంట్స్, టీచర్స్ అంతా ఎంతో వినోదాన్ని పంచారని బిగ్‌బాస్ చెప్పారు. అందరినీ కెప్టెన్సీ కంటెండర్స్‌గా ప్రకటించారు. బిగ్‌బాస్ ఒక నంబర్ చెబుతారు. ఆ నంబర్‌పై కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడు ఎవరైతే ఆ నంబర్‌పై ఉండరో వారు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ రౌండ్‌లో సుధీర్ అవుట్ అయ్యాడు. ఇక నుంచి సుధీర్ సంచాలక్. సెకండ్ రౌండ్‌లో వర్షిణి అవుట్ అయ్యింది. నెక్ట్స్ రౌండ్‌లో రామ్ ప్రసాద్ అవుట్ అయ్యాడు. నువ్వు ఇక్కడి నుంచి రాకు అని వర్షిణికి సుధీర్ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ అయ్యింది. నువ్వు ఎవరిని అయితే సపోర్ట్ చేస్తావో వాళ్లను గేమ్ నుంచి తీసేస్తానని సుధీర్ చెప్పాడు.
ఈ రౌండ్‌కు వర్షిణి సంచాలక్ అని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ రౌండ్‌లో నీతూ అవుట్ అయ్యింది. ఈ రౌండ్‌లో దేబ్జాని అవుట్ అయ్యింది. ఈ రౌండ్‌లో శ్వేత అవుట్ అయ్యిందని రామ్ ప్రసాద్.. ముఖేష్ అవుట్ అయ్యాడని వర్షిణి చెప్పింది. శ్వేత, ముఖేష్ ఇద్దరినీ అవుట్ చేశారు. శివ, త్రిగుణ్ ఇద్దరూ ఒకరినొకరు తోసుకుని ఇద్దరూ అవుట్ అయ్యారు. లెవల్ 1లో నరేష్, వంశీ, రామకృష్ణ, అమన్ ఉన్నారు. వీరు లెవల్ 2కి అర్హత సాధించినట్టుగా బిగ్2బాస్ చెప్పారు. నీకు తెలియనప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవద్దని ముఖేష్ చెప్పాడు. నువ్విలా మాట్లాడేలా అయితే తనతో మాట్లాడొద్దని వర్షిణి చెప్పింది. నువ్వేం చేస్తున్నావ్? అంటే నువ్వేం చేస్తున్నావని గొడవ పడ్డారు. చూడకుండా నువ్వు ఎలా నన్నెలా ఎలిమినేట్ చేశావని వర్షిణిని ముఖేష్ అడిగాడు. శ్వేతని చూడకుండా తను ఎలిమినేట్ అయినట్టుగా ఎలా చెప్పావని వర్షిణిని ముఖేష్ అడిగాడు. నాతో అలా మాట్లాడకని చెప్పింది. రామ్ ప్రసాద్ తన హెల్ప్ అడిగాడని.. బజర్ మోగినప్పుడు నీ కాలు బయట ఉండటం చూశానని చెప్పాడన్నాడు. వర్షిణి వర్సెస్ ముఖేష్ జరిగిన గొడవతో షో ముగిసింది. ఎప్పుడూ బిగ్‌బాస్ హౌస్‌లో వర్షిణి వర్సెస్ త్రిగుణ్ చూస్తామనుకోలేదు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 5 దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల…
వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివ్‌కు ఎవరు సలహాలిచ్చారో ఏమో కానీ ఒక చెత్త గేమ్‌కు తెరదీశాడు.…
ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్ అంతా సందడిగా మారింది. అందరినీ ఫ్రీజ్ చేసి ముఖేష్ వాళ్ల అమ్మను లోపలికి…
ఇవాళ కొందరు టీచర్స్‌గానూ.. మరికొందరు స్టూడెంట్స్‌గానూ యాక్ట్ చేయాలి. ముందుగా శ్వేత ఆర్ట్ అండ్ పీఈటీ టీచర్, శ్వేత డ్యాన్స్…
సౌత్ ఇండస్ట్రీలో సూర్య పేరు ఒక సెన్సేషన్ గా మారిపోయిందిప్పుడు. ఏడాది కింది వరకు సరైన హిట్ కోసం చాలా…
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…