వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివ్‌కు ఎవరు సలహాలిచ్చారో ఏమో కానీ ఒక చెత్త గేమ్‌కు తెరదీశాడు. ముందుగా వచ్చినప్పుడు రోహిత్‌ను టార్గెట్ పెట్టుకుని వచ్చాడనేది క్లియర్. ఆ సమయంలోనే త్రిగుణ్‌తో జత కలిశాడు. త్రిగుణ్ టీంలోనే కొనసాగుతున్నాడు. రోహిత్ వెళ్లిపోయిన తర్వాత కూడా త్రిగుణ్ టీంలోనే ఉన్నాడు. వారితో మంచిగా ఉంటూనే అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడకు మోస్తూ హాట్ టాపిక్ అయిపోయాడు. అయితే అలా కొనసాగితే బాగానే ఉండేది కానీ త్రిగుణ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ‘రివార్డ్ అండ్ రివెంజ్’లో తను త్రిగుణ్‌పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నట్టుగా చెప్పి అతను ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హుడు కాదని అతని పేరు రాశాడు.
అమన్ కూడా త్రిగుణ్ పేరు రాశాడు కానీ నేరుగా వెళ్లి అతనితోనే చెప్పాడు. అయితే తన పేరు అమన్ రాశాడని తెలిసినప్పుడు త్రిగుణ్ వచ్చి శివతోనే నేరుగా ఈ విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత మరో సందర్భంలో కూడా చెప్పాడు. కానీ శివ మాత్రం తను కూడా త్రిగుణ్ పేరే రాశాననేది బయటకు రానివ్వలేదు. కానీ తాజాగా విషయం త్రిగుణ్‌కు తెలిసిపోయింది. తనతో శత్రుత్వమున్న ముఖేషే తన పేరు రాయలేదు కానీ శివ ఎలా రాస్తాడని.. తన కూతురి కోసం ఎంతగా తపిస్తున్నానో కూడా అతనికి తెలుసని కెమెరా ముందు ఫైర్ అయ్యాడు. ప్రస్తుతానికి కూల్‌గానే ఉన్నా తరువాత మాత్రం ఊరుకునేలా కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన శివ్ ఆడాల్సిన గేమ్ కాదది.
వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు. దీంతో అతనికి ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ తరుణంలో వచ్చిన అతని ప్రియురాలు ప్రియాంక జైన్ మాత్రం అతనికి రియాల్టీని వివరించలేదు. ‘నీ గేమ్ చాలా బాగుంది. అందరూ బాగా మెచ్చుకుంటున్నారు’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. తను ఆడుతున్నదే కరెక్ట్ అనుకుని శివ్ ఇదే గేమ్ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తే త్వరలోనే హౌస్ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చి అతని ఆటను ప్రియాంకే ప్రమాదంలోకి నెట్టేసింది. అసలే ఓటింగ్ పరంగా.. ఐసీయూలో ఉన్నాడు శివ్.. ఇదే కంటిన్యూ అయితే ఇక నెక్ట్స్ వెంటిలేటర్‌పైకే.. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్ అంతా సందడిగా మారింది. అందరినీ ఫ్రీజ్ చేసి ముఖేష్ వాళ్ల అమ్మను లోపలికి…
ఇవాళ కొందరు టీచర్స్‌గానూ.. మరికొందరు స్టూడెంట్స్‌గానూ యాక్ట్ చేయాలి. ముందుగా శ్వేత ఆర్ట్ అండ్ పీఈటీ టీచర్, శ్వేత డ్యాన్స్…
సౌత్ ఇండస్ట్రీలో సూర్య పేరు ఒక సెన్సేషన్ గా మారిపోయిందిప్పుడు. ఏడాది కింది వరకు సరైన హిట్ కోసం చాలా…
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…