బిగ్‌బాస్ 10 తెలుగు తొలిరోజే హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. వాస్తవానికి బిగ్‌బాస్ పెట్టిన కుంపటే అది. అసలు సోమవారం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పటికే 8 కీసులు ఇచ్చారు కాబట్టి మిగిలిన రెండు కీస్‌లు ఎవరికి ఇవ్వాలో కీస్ వచ్చిన వారంతా డిసైడ్ అవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు. కానీ ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా త్రిగుణ్ తన ఒపీనియన్ చెప్పి వారిని ఒప్పించేందుకు ట్రై చేశాడు. ఆతరువాత కూడా షాలినిని పొట్టిది.. మాట్లాడనివ్వడం లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్ చేశాడు. ఆ తరువాత కంటెస్టెంట్స్ అంతా ఎవరికి వారు తమకు ఇష్టమైన ఇద్దరిని కారణాలు చెప్పి మరీ ఎంచుకున్నారు. ఈ విషయంలో రోహిత్‌కి ఝాన్సీకి, త్రిగుణ్‌కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. చివరకు కీస్.. వంశీ, కృష్ణుడికి ఇచ్చారు.
మహా పరీక్షకు సిద్ధమవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తరువాత దేబ్జాని, రామ్ ప్రసాద్‌కి మధ్య చర్చ జరిగింది. అక్కడ రామ్ ప్రసాద్ మాట్లాడిన విధానం చాలా బాగుంది. వంశీ, కృష్ణుడిని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో చాలా కన్విన్సింగ్‌గా చెప్పాడు. దేబ్జాని.. మనుషులతో మాట్లాడటం కంటే ఎక్కువగా బిగ్‌బాస్‌తో మాట్లాడటం గమనార్హంం. అయితే ఆమె వచ్చీరాని తెలుగు కారణంగా కాస్త కామెడీ వర్కవుట్ అవుతోంది. త్రిగుణ్ తనకు ఇచ్చిన టాస్క్‌ని మెల్లగా చేయడం ఆరంభించాడు. అంటే కనీసం నలుగురిని బిగ్‌బాస్ హౌస్‌లో ఉందని నమ్మించాలని నాగార్జున చెప్పారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఓ సినిమా షూటింగ్‌లో దయ్యం సీన్ గురించి నలుగురిని కూర్చోబెట్టి చెప్పాడు. రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరూ నామినేషన్స్ గురించి ఫన్నీగా కాసేపు మాట్లాడుకున్నారు. సుధీర్ – సృష్టి కాస్త కనెక్ట్ అవుతున్నారనిపిస్తోంది. సుధీర్ అయితే ఫ్లర్ట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు.
కీస్ ఎవరి దగ్గరైతే ఉన్నాయో వారు మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్ వెళ్లి ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో మాట్లాడుకుని షేర్ చేసుకున్నారు. ఆ తరువాత ఝాన్సీ వెళ్లి బాక్స్ ఓపెన్ చేసింది. ఆమెకు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే పవర్ వచ్చింది. దానిని ఈ వారం కావాలన్నా వాడుకోవచ్చని చెప్పారు. ఇలా ఒక్కొక్కరిక బిగ్‌బాస్ ఒక్కో పవర్ ఇచ్చారు. అయితే నరేష్ బాక్స్ ఓపెన్ చేయడానికి ఎంత కష్టడ్డాడో.. బాక్స్‌లోని మేటర్ అర్థం చేసుకోవడానికి అంత కష్టపడటం హిలేరియస్‌గా అనిపించింది. పది మంది తమ పవర్ ఏంటో చూశాక. అందరినీ కీస్ రిటర్న్ చేయమని బిగ్‌బాస్ చెప్పారు. ప్రతి ఒక్కరూ దాదాపుగా నామినేషన్స్ గురించే చర్చ. త్రిగుణ్ అయితే రోహిత్‌కే నామినేషన్ వేస్తానని చెప్పాడు. ఇప్పటి వరకూ చూసినదాన్ని బట్టి చూస్తే రోహిత్‌ను త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఇక మహా పరీక్ష గురించి బిగ్‌బాస్ చెప్పాడు. ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ కాదని.. మహాపరీక్షలో పాల్గొని హై రిస్క్ నుంచి నో రిస్క్‌గా మారి హౌస్‌మేట్ హోదాను పొందాలని బిగ్‌బాస్ చెప్పాడు. అలాగే ఈ వారం కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు. హౌస్ మేట్స్‌ని రెండు టీమ్స్‌గా విడిపోవాలని.. మీ జట్లకు ఇద్దరు నాయకులను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక్కడి నుంచి రచ్చ ప్రారంభమైంది. హౌస్ అంతా ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెప్పారు. అలా రోహిత్‌కు 4 ఓట్లువచ్చాయి. త్రిగుణ్, రామ్ ప్రసాద్‌లకు చెరి మూడు పాయింట్స్ వచ్చాయి. రామ్ ప్రసాద్‌కు త్రిగుణ్ ఇచ్చేశాడు. ఇక్కడి నుంచి త్రిగుణ్ అనవసర వాదన ప్రారంభించాడు. ఎవ్వరినీ మట్లాడనివ్వలేదు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ గొడవ జరిగింది. రోహిత్‌కు కామనర్స్ ఓటేశారని.. కాబట్టి ఝాన్సీకి వేసిన తన ఓటును మార్చేసి రామ్ ప్రసాద్‌కు వేసినట్టు త్రిగుణ్ చెప్పాడు. భేదభావాలంటూ నానా రచ్చ చేశాడు.
త్రిగుణ్ వినకపోవడమే పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. సెలబ్రిటీలంతా సెలబ్రిటీలకే ఓటేశారు కదా.. అది గ్రూపిజం కాదా? అని కామనర్స్ వాదన. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. మొత్తానికి లీడర్స్‌గా రోహిత్, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. కృష్ణుడు సైతం సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ అగ్నిపరీక్ష, సెలబ్రిటీలు అంతా ఒక్కటేనని చెప్పాడు. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో రోహిత్ ఎంగిలి కప్పులు కడగాలా? అంటూ ఫైర్ అయ్యాడు. వంశీ ఇక్కడ స్టాండ్ తీసుకుని ఆ మాట తప్పని చెప్పాడు. రామ్ ప్రసాద్ బ్లూ టీంకి నాయకుడు.. రోహిత్ రెడ్ టీంకి నాయకుడు. ఇక టాస్క్ రేపు ప్రారంభం కానుంది.
తొలిరోజే కాబట్టి ఒకరకంగా బీభత్సమైన సన్నివేశాలు అంతగా ఏం లేకుండానే సాగిపోయింది. మొత్తానికి త్రిగుణ్ అయితే ముందు నుంచే నెగిటివ్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఝాన్సీ అయితే సెపరేట్ రూటులో వెళుతోంది. ప్రస్తుతం రోహిత్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్‌కు యాంటీగా ఝాన్సీ వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. అగ్నిపరీక్షలో నోరు వేసుకుని పడిపోయిన షాలిని.. హౌస్‌లో మాత్రం చాలా చాలా బాగా పాయింట్స్ మాట్లాడుతోంది. త్రిగుణ్, రోహిత్, నరేష్, రామ్ ప్రసాద్, దేబ్జాని.. అంతో ఇంతో కృష్ణుడు, వంశీ, సృష్టి సుధీర్‌లకు మినహా మిగిలిన వారెవరికీ పెద్దగా ఇవాళైతే పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు.
16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు…
తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే…
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 స్టార్ మాలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. నిన్న (సెప్టెంబర్ 6, ఆదివారం) సాయంత్రం 7 గంటలకు…
ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘వేట’ ఘనంగా ప్రారంభమైంది. సందీప్ సరోజ్, సాత్విక జంటగా…
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47…
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీ శ్రీ'పై…