బిగ్‌బాస్ 10 తెలుగు చప్పగా సాగుతోంది. హౌస్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక గ్రూప్‌లో వర్షిణి, ముఖేష్ మాత్రమే ఉన్నారు. దీంతో నామినేషన్స్ సమయంలో అందరూ వచ్చి ఈ ఇద్దరిని మాత్రమే వేయలేరు. వాళ్లలో వాళ్లే వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే ఎక్కడ అలయెన్స్ చెడిపోతుందోనని సిల్లీ సిల్లీ పాయింట్స్‌తో నామినేషన్స్ వేసుకుంటున్నారు. దీంతో నామినేషన్ ఎపిసోడ్ ఏమాత్రం హైప్ లేకుండా కొనసాగుతోంది. అయితే గత వారం త్రిగుణ్ పేరును అమన్ మాత్రమే కాకుండా శివ్ కూడా రాశాడు. ప్రస్తుతం ఆ విషయం త్రిగుణ్‌కు శ్వేత చెప్పేసింది. దీంతో త్రిగుణ్ షాక్ అయ్యాడు.
తన ఫ్యామిలీ రాకుండా ఉండేందుకు తన పేరు రాయడంపై త్రిగుణ్ గత వారమే అమన్‌పై ఫైర్ అయ్యాడు. అందరితో అంతకు ముందు రాసిన పేర్లను మార్పించి అమన్ పేరు రాయించాడు. చివరకు తనే గెలిచి అమన్‌కు ఫ్యామిలీ రాకుండా చేశాడు. అయితే ఆ సమయంలోనే శివ్‌కు త్రిగుణ్ తన పేరు అమన్ రాశాడని.. తన కూతురు వస్తే ముందుగా తనే ఎత్తుకుంటానన్న వ్యక్తి తన ఫ్యామిలీయే రాకుండా తన పేరు రాశాడని చెప్పాడు. అప్పుడు శివ్ అవాక్కైనట్టుగా నటించాడు కానీ తను కూడా త్రిగుణ్ పేరు రాసిన విషయం రివీల్ చేయలేదు. అలాగే మార్చుకునే అవకాశం ఎన్నిసార్లు బిగ్‌బాస్ ఇచ్చినా కూడా శివ్ మార్చుకోలేదు. ఈ క్రమంలోనే త్రిగుణ్‌కు విషయం తెలియడంతో శివ్‌పై నామినేషన్స్ సమయంలో బాగా ఫైర్ అయ్యాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య రైవలరీ నడిస్తే మాత్రం శివ్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే గత రాత్రి షో ముగిసిన తరువాత నామినేషన్స్ గురించి దేబ్జాని, నరేష్, శ్వేత, త్రిగుణ్ చర్చించుకున్నారు. నీతూ తనకు వేస్తుందని.. ఆమెకు వేసి నామినేషన్ వేస్ట్ చేసుకోవాలా? అని అనడంతో నరేష్ ఏముంది? వేసేయమని చెప్పాడు. మనకు వేయడం ఎంత సేపు చెప్పు అని త్రిగుణ్ అన్నాడు. అప్పుడు శ్వేత మనం నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకోకూడదు కదా.. అనడంతో మనం పెయిన్ పాయింట్స్ పెట్టి మాట్లాడుకుంటున్నాం కదా అన్నాడు. కానీ గతంలో రోహిత్ వాళ్లు కూడా పెయిన్ పాయింట్స్ పెట్టే మాట్లాడుకున్నారు. కానీ నాగ్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఆ తరువాత ఆర్కేని నీతూ ఏమన్నారని అని త్రిగుణ్ అడిగాడు. రామ్ ప్రసాద్, శ్వేత చాలా మాటలన్నారని చెప్పారు. ఒకవేళ రెండు నామినేషన్స్ వస్తే ఎవరిని చేస్తావని త్రిగుణ్‌ని అడిగితే తనకు నాలుగు నామినేషన్స్ వేయాల్సి వచ్చినా కూడా పాయింట్స్ ఉన్నాయని అన్నాడు. మొత్తానికి నామినేషన్స్ పాయింట్స్ బాగా చర్చించుకున్నారు. మరి నాగ్ దీనిని ప్రశ్నిస్తారో లేదంటే త్రిగుణ్ టీమ్ కాబట్టి లైట్ తీసుకుంటారో చూడాలి.
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్‌కు చెప్పింది.…
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా అందులో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, అటు ఇండస్ట్రీలో సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయిందిప్పుడు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన…
సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్‌గా…
ఇవాళ హౌస్‌లో దీపావళి సందడి నెలకొంది. హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లగానే ముందుగా నీతూ, శ్వేత పెర్ఫార్మెన్స్.. ఆ తరువాత…