సినిమా వార్తలు

Biggboss 10 Telugu: కృష్ణ.. కృష్ణా.. బుసలు కొడుతున్నావేంటయ్యా?

గతంలో మాదిరిగా కాదు.. బిగ్‌బాస్ పదవ సీజన్ ప్రారంభమయ్యీ అవగానే రచ్చ ప్రారంభమైంది. అంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటున్నారు కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. మూడవ రోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలంతా వరుసబెట్టి కామనర్స్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సెలబ్రిటీల నామినేషన్స్ అన్నీ సీక్రట్‌గా జరిగినట్టు అనిపిస్తోంది. అవి బయటకు తెలియకూడదని నామినేషన్స్ అనంతరం బిగ్‌బాస్ వార్న్ చేశారు. ఆ తరువాత కామనర్స్‌ని మాత్రం పబ్లిక్‌గానే ఐదుగురిని ఎంచుకుని నామినేట్ చేయమని చెప్పారు. దీనిలో భాగంగానే పెద్ద రచ్చే జరిగింది. కృష్ణుడు (Krishnudu).. రోహత్‌ (Rohit)పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు కానీ టంగ్ స్లిప్ అయినట్టుగా ప్రోమోను బట్టి తెలుస్తోంది.

సెలబ్రిటీలు ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారో మరొకటో కానీ రోహిత్‌ను బాగా టార్గెట్ చేస్తున్నారు. వర్షిణి (Varshini) అయితే రోహిత్‌ని బాగా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. అగ్నిపరీక్షలో లేపి లేపి కూర్చోబెట్టడంతో సారు అక్కడే ఉన్నారని మాట్లాడటం గమనార్హం. ముందు నుంచే వర్షిణి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతోందని టాక్ నడుస్తోంది. ఆమె సొంత ఆలోచన చేస్తే ఓకే లేదంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. ఇక కృష్ణుడు విషయానికి వస్తే.. చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అనుకుంటే ఆయన కూడా ఫైర్ అవుతున్నారు. ఆ ఫైర్‌కు అర్థం ఉంటే ఓకే కానీ లేదంటే ఆయనకే నష్టం. కృష్ణుడుని నామినేట్ చేస్తూ రోహిత్ పాయింట్స్ పెడుతుంటే.. ఆయన మట్లాడిన విధానం ఏమాత్రం బాగోలేదు. త్రిగుణ్ టాస్క్‌‌లో కృష్ణుడి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దానికి రోహిత్‌పై ఆయన ఫైర్ అయ్యారు

‘అంటే నేను 100 పర్సెంట్ ఇవ్వలేదనా?’ అంటే రోహిత్ సమాధానం ఇవ్వలేదు. కామనర్స్ అంతా ఏదో మాట్లాడుకుంటున్నారు. దీనికి కృష్ణుడు పక్కనున్న వాళ్లు (త్రిగుణ్, వర్షిణి) నిన్ను డిస్ రెస్పెక్ట్ చేస్తున్నారని చెప్పడంతో మరింత ఫైర్ అయ్యాడు. యూ ఆర్ నాట్ కేపబుల్ టు బికమింగ్ ఏ లీడర్ (నువ్వు లీడర‌్‌గా ఉండేందుకు అర్హుడివి కావు).. అంటూ కృష్ణుడు రోహిత్‌పై ఫైర్ అయ్యాడు. ‘నువ్వొక తోపు అనుకుంటున్నావా? నీకు కుళ్లుబోతుతనం’ అంటూ మాటలు స్లిప్ అయ్యారు. తన ఆగ్రహంలో కారణమున్నా.. కానీ మాటలు దొర్లకుండా చూసుకుంటే ప్లస్ అవుతుంది. లేదంటే.. అసలు కారణం సైడ్ అయిపోయి.. ఈ మాటలు మాత్రమే హైలైట్ అవుతాయి. అందరూ కలిసి కామనర్స్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుని వాళ్లకు లేనిపోని హైప్ ఇవ్వడం తప్ప మరొకటి లేదని గ్రహిస్తే బాగుంటుంది. లేదంటే కష్టమే. కాబట్టి కృష్ణా బుసలు కొట్టడం ఆపి పాయింట్స్ పెట్టయ్యా.. అని నెటిజన్లు అంటున్నారు.

Pranav

Recent Posts

అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!

జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక ఫేమస్ డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే…

8 minutes ago

అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గోల. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే హిట్ అని…

17 minutes ago

Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని…

10 hours ago

సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?

కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. తన మొదటి…

14 hours ago

Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!

ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి…

2 days ago

నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఆయన గురించి సోషల్…

2 days ago