బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్‌గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? రాత్రంతా మాట్లాడుకోవడానికే టైం సరిపోవడం లేదంటూ సీరియస్‌గా చురకలు వేశారు. షాలినిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఒక్క రోహిత్, షాలినినే కాదు.. అమన్, రామ్ ప్రసాద్, ఝాన్సీ, వర్షిణి అందరిపై ఫైర్ అయ్యారు.
ఇక ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఏంటంటే… అపూర్వ ఎలిమినేట్ అయిపోయింది. ఇదొక్కటే కాదు.. మరో రెండు ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయని టాక్. అయితే ఆ ఇద్దరిలో ఒకరు సీక్రెట్ రూమ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అపూర్వను ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేస్తే.. హౌస్‌లో ఎవరు అన్‌వర్తీ అనుకుంటున్నారో చెప్పి వారి ఫేస్‌పై ముద్ర వేయమంటే.. ఎక్కువ ఓట్లు రోహిత్‌కు వచ్చాయి. ఐదుగురు రోహిత్ హౌస్‌లో ఉండేందుకు అనర్హుడని చెబుతూ ముద్ర వేశారు. దీంతో రోహిత్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎలిమినేట్ అయితే అవడు కానీ సీక్రెట్ రూంకి పంపించవచ్చని టాక్ నడుస్తోంది. రోహిత్ కానీ.. షాలిని కానీ సీక్రెట్ రూమ్ పక్కా అని అంటున్నారు. ఇద్దరిలో ఎవరు సీక్రెట్ రూమ్‌కి వెళ్లినా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరికీ బ్యాడ్ అయ్యే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…
సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా…
ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ ఎప్పుడూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటుంది.…
ఇవాళ్టి (శుక్రవారం) షో అంతా వన్ సైడెడ్‌గా జరిగింది. పూర్తిగా సెలబ్రిటీలకు ఫేవర్‌గా జరిగింది. అసలు ఇవాళ ఏం జరిగిందో…
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘రణబాలి’ చిత్ర ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్…