Menu
BREAKING
Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..   |   Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?
Ranabaali
MOVIE REVIEW

Ranabaali

★ 2.5 / 5
Release Date: October 16, 2026
Cast
Vijay Deverakonda, Rashmika Mandanna, Arnold Vosloo
Director
Rahul Sankrityan
Music Director
Ajay–Atul
Producer
Bhushan Kumar, Naveen Yerneni, Y. Ravi Shankar
Banner
Mythri Movie Makers

Ranabaali Review

విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ కాంబినేషన్ అనగానే అందరికీ ‘టాక్సీవాలా’ గుర్తొస్తుంది. దానికి తోడు రియల్ లైఫ్ కపుల్ విజయ్, రష్మిక పెళ్లి తర్వాత తొలిసారిగా కలిసి నటించిన సినిమా కావడంతో ‘రణబాలి’పై అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

రణబాలి మూవీ రివ్యూ.. మంచి సినిమానే కానీ సాగదీసి వదిలేసారు..!

కథ:

బ్రిటీషర్ల కాలంలో 1850 నుంచి 1870ల మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇక్కడి రైతులు పండించిన ధాన్యాన్ని బలవంతంగా ఇంగ్లాండ్‌కు తరలించడం వల్ల స్థానికంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటాయి. బ్రిటీష్ ఆఫీసర్ సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) పెట్టే నరకయాతనల నుంచి ప్రజలను రక్షించడానికి సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఎలా ఎదిరించాడు? దేవుడు భద్ర మల్లన్నకు, ఈ రణబాలికి ఉన్న సంబంధం ఏంటి? జయమ్మ (రష్మిక మందన్న) తో అతడి ప్రేమ, పెళ్లి ప్రయాణం ఏ తీరానికి చేరింది? అన్నదే ఈ సినిమా అసలు కథ.

స్క్రీన్ ప్లే:

చరిత్రలో మరుగున పడిపోయిన ఒక మంచి పాయింట్‌ను దర్శకుడు రాహుల్ ఎంచుకున్నాడు కానీ, దాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం తీవ్రంగా తడబడ్డాడు. సినిమా మొదటి అరగంట చాలా నెమ్మదిగా, బోర్ కొట్టేలా సాగుతుంది. అసలు కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నారు. బ్రిటీష్ విలన్ ఎంట్రీ, వాళ్లు పెట్టే హింస, కరువు సీన్స్ ఎమోషనల్‌గా కాస్త కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సినిమా గ్రాఫ్‌ను అమాంతం పెంచుతుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చేసరికి డైరెక్టర్ ఆ స్పీడ్ కంటిన్యూ చేయలేకపోయాడు. గుహలో వచ్చే యాక్షన్ సీన్ తర్వాత కథనం పూర్తిగా పక్కదారి పట్టింది. మనం ఇదివరకే ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాల్లో చూసిన సీన్స్ మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషన్ పండాలనే ఉద్దేశంతో ఒకే పాయింట్‌ను పదే పదే చూపించి ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. సినిమా నిడివి 3 గంటలు ఉండటం ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ పాయింట్. ఒక అరగంట ఈజీగా కట్ చేసి ఉంటే బాగుండేది. కొత్తదనం లేకపోవడం, ఫ్లాట్ నెరేషన్, ఊహకు అందే ముగింపు సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. విజిల్స్ వేయించే సీన్స్ అయితే సినిమాలో పెద్దగా ఉండవు. కానీ మంచి సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. దర్శకుడు రాహుల్ ఫోకస్ కూడా కమర్షియల్ కంటే ఉన్న కథను అలాగే చూపించాలనే దానిపైనే ఎక్కువగా పెట్టాడు. అందుకే ఈ సినిమా స్లోగా ఉంటుంది.. కానీ రణబాలి ఏదో తీసిపారేసే సినిమా అయితే కాదు.. కచ్చితంగా విజయ్ గత సినిమాలతో పోలిస్తే చాలా మంచి సినిమా.

రణబాలి మూవీ రివ్యూ.. మంచి సినిమానే కానీ సాగదీసి వదిలేసారు..!

నటీనటులు:

సింగనమల బొబ్బిలి రణబాలి పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. రాయలసీమ యాస, కఠినమైన లుక్ బాగా సెట్ అయ్యాయి కానీ, కొన్ని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన కాస్త కృతకంగా అనిపిస్తుంది. తనకి అలవాటు లేని పాత్ర కావడంతో బాడీ లాంగ్వేజ్‌లో ఆ ఇబ్బంది స్పష్టంగా తెలిసింది. ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న మాత్రం అదరగొట్టింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషన్స్ పండించిన విధానం సూపర్. విజయ్, రష్మిక మధ్య వచ్చే సీన్స్ మాత్రమే సినిమాలో ఉన్నంతలో కాస్త రిలీఫ్. విలన్‌గా చేసిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ తన లుక్స్‌తోనే భయం పుట్టించాడు. ఈశ్వరి రావు, వినోద్ సాగర్ లాంటి వాళ్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు అజయ్-అతుల్ మ్యూజిక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తెలుగు నేటివిటీకి, మన ఎమోషన్స్‌కు అస్సలు సింక్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం బ్రిలియంట్. జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా అప్పటి కాలాన్ని తెరపై చాలా నేచురల్‌గా చూపించారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో చాలా దారుణంగా ఉంది, ఎక్కడ కత్తెర వేయాలో అక్కడ వదిలేశారు. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కూడా చాలా నాసిరకంగా అనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి, ఖర్చుకు వెనకాడకుండా సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు.

చివరగా..

ఓవరాల్‌గా రణబాలి.. పీరియడ్ యాక్షన్ డ్రామా.. బట్ బోరింగ్ నెరేషన్..!

Ranabaali Cast

Vijay Deverakonda Rashmika Mandanna Arnold Vosloo