Menu
BREAKING
ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..   |   తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?   |   జబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!   |   Biggboss10 Telugu: ఈసారి హౌస్‌లోని వారికి కాదు.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్   |   విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?

తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపు ఆయన కచ్చితంగా తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన పెట్టబోయే పార్టీ పేరు ‘తమిళగ ఎళుచి కజగం’ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ధనుష్ కు రాజకీయాల మీద ఇంత మోజు ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, దానికి ఒకటే ఆన్సర్ దళపతి విజయ్ అనే టాక్ కూడా ఉంది. రీసెంట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, అలా వచ్చి ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విజయ్ సక్సెస్ చూసి తమిళ హీరోలందరికీ ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి పెరిగిపోయింది. కానీ, ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న లాజిక్ ఉంది. విజయ్ అయిపోయాడు కదా అని, ఏ గ్రౌండ్ వర్క్ లేకుండా సడన్ గా పాలిటిక్స్ లోకి వస్తే అందరూ విజయ్ అయిపోలేరు కదా. ఈ బేసిక్ లాజిక్ మిస్ అయితే మాత్రం పాలిటిక్స్ లో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు.

విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం వెనుక ఎవరూ ఊహించని రేంజ్ లో దాదాపు 18 ఏళ్ళ సుదీర్ఘమైన కృషి దాగి ఉంది. ఆయన ఎప్పుడో ఒక పద్దెనిమిదేళ్ల క్రితమే తన ఫ్యాన్స్ అసోసియేషన్ ను విజయ్ మక్కల్ ఇయక్కంగా మార్చి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ స్టార్ట్ చేసారు. ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, పేద విద్యార్థులకు చదువు కోసం సాయం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలా ఎన్నో హెల్పింగ్ యాక్టివిటీస్ తో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. విజయ్ సైతం తన వంతుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చారు. ఇదంతా ఒక రోజులో లేదా ఒక నెలలో జరిగిన మ్యాజిక్ కాదు. దశాబ్ద కాలంగా ప్రజలతో మమేకం అవుతూ, వాళ్ళ కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం వల్లే ఆయనకు ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైంది. అంతే తప్ప, కేవలం సినిమా గ్లామర్ చూసి, తెర మీద ఆయన చేసే డాన్సులు ఫైట్లు చూసి తమిళ ప్రజలు ఆయనకు సీఎం కుర్చీ కట్టబెట్టలేదు అనే వాస్తవాన్ని మిగతా స్టార్స్ గ్రహించాలి.

తమిళనాడు రాజకీయ చరిత్రను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, సినిమా గ్లామర్ తో వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. దశాబ్దాల క్రితం విజయ్‌కాంత్ లాంటి మాస్ లీడర్ పార్టీ పెట్టినా, కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు పార్టీ పెట్టినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్ళే రాజకీయాల పేరుతో ఒకటికి పదిసార్లు ఆలోచించి వెనక్కి తగ్గారు. మరి ఇన్ని ఈక్వేషన్స్ ఉన్న చోట కేవలం విజయ్ మాత్రమే ఎందుకు అంత పెద్ద విజయం సాధించాడు అంటే దానికి కరెక్ట్ టైమింగ్ అండ్ పొలిటికల్ వ్యాక్యూమ్ ప్రధాన కారణం. దశాబ్దాల పాటు తమిళనాడును శాసించిన జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాలు చనిపోయిన తర్వాత అక్కడ పాలిటిక్స్ లో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తప్ప మరో ఆప్షన్ తెలియని అరవ ప్రజలకు, కరెక్ట్ టైమ్ లో నేనున్నాను అంటూ ఒక బలమైన ఆల్టర్నేటివ్ గా ముందుకు వచ్చాడు టీవీకే విజయ్. ఆ నమ్మకమే ఆయన్ని నేరుగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.

ఇప్పుడు విజయ్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్న ధనుష్ ముందు ఒక పెద్ద డైలమా ఉంది. ధనుష్ ఒకవేళ నిజంగానే పార్టీ పెడితే, ఆయన సినిమాలు చేస్తారా లేదంటే పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారా అనేది పెద్ద ప్రశ్న. దళపతి విజయ్ అయితే తన పొలిటికల్ కెరీర్ కోసం ఏకంగా తన పీక్ సినిమా కెరీర్ ను వదిలేసి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి దిగిపోయారు. మరి ధనుష్ కూడా ఆ రేంజ్ లో సాహసం చేయగలరా అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో యాక్టింగ్ వదిలేయడం మామూలు విషయం కాదు. పోనీ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాదిరిగా అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు పడవల మీద ప్రయాణం చేస్తారా అంటే, తమిళ ప్రజలు పార్ట్ టైమ్ పాలిటిక్స్ ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. రెండు బ్యాలెన్స్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే.

ఏదేమైనా ధనుష్ తమిళగ ఎళుచి కజగం పేరుతో పార్టీ పెడతారనే వార్త మాత్రం కోలీవుడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉంది, దానికి తోడు రజినీకాంత్ అల్లుడిగా ఉన్నప్పటి నుంచి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఆయనకు ఏర్పడింది. కానీ, కేవలం ఈ ఇమేజ్ మాత్రమే ఎలక్షన్స్ లో ఓట్లు తెచ్చిపెట్టదు. ధనుష్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయితే ముందుగా క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. బూత్ లెవెల్ నుంచి పార్టీ క్యాడర్ ను తయారు చేసుకోవాలి. ఫ్యాన్స్ తో కేవలం ఆడియో ఫంక్షన్స్ కు గోల చేయించడం కాకుండా, వాళ్ళను పబ్లిక్ సర్వీస్ వైపు మళ్లించాలి. విజయ్ లాంటి లీడర్ ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉంటూ తనదైన ముద్ర వేస్తున్న ఈ టైమ్ లో, ఆయన్ని ఢీకొట్టి లేదా ఆయనతో పాటు పోటీపడి నిలబడాలంటే ధనుష్ ముందు చాలా పెద్ద సవాల్ ఉన్నట్లే. మరి ధనుష్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, ఇస్తే ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Pranav

Writer and contributor at Telugu Cinema 360