Menu
BREAKING
భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?

Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..

Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..

బిగ్‌బాస్ హౌస్‌లో ఇవాళ కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. మాటల యుద్ధం.. నోరు జారడం.. వంటివన్నీ జరిగాయి. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటి దశలో టీమ్ భైరవ సభ్యులు గెలిచారు. ఏ సభ్యుల కారణగా గెలిచారో చెప్పమని బిగ్‌బాస్ చెప్పారు. ఆ పేరును రథంపై పెట్టారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా వంశీ పేరును చెప్పి.. ఆయన ఫోటోను రథ చక్రానికి పెట్టారు. రెండో దశకు సృష్టి, అమన్ సంచాలకులు. టాస్క్ ప్రారంభమైంది. ఝాన్సీ చేతిలోని డార్స్‌ను తీయడంలో భాగంగా ఆమె షర్ట్ జిప్ తీశారు. దీనిపై గొడవ జరిగింది. రెండో దశలో బజర్ మోగే సమయానికి భైరవ టీం దగ్గర 50.. సప్త శక్తి దగ్గర 21 ఉన్నాయి. దీంతో రథంపై మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా సుధీర్ ఫోటోను పెట్టారు. భైరవ టీం గెలిచినట్టుగా బిగ్‌బాస్ ప్రకటించారు. రథంపై జెండాను పెట్టారు. సుధీర్, వంశీని అపోజిట్ టీం నుంచి ఎవరి డ్యాగర్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే.. వంశీ.. ముఖేష్ నుంచి.. త్రిగుణ్ నుంచి సుధీర్ డ్యాగర్ తీసుకున్నారు. సుధీర్ కాలికి దెబ్బ తగలడంతో కెప్టెన్ రూంలోని సింహాసనంపై కూర్చొన్నాడు. దీనికి ముఖేష్ అభ్యంతరం తెలిపాడు. చిన్న దానికి కూడా ముఖేష్ చాలాతమ గొడవ చేస్తున్నాడు.

తమను కెప్టెన్ రూంలోకి వెళ్లనివ్వరని.. మిగిలిన వాళ్లను మాత్రం వెళ్లనిస్తారని త్రిగుణ్, ముఖేష్ గొడవ చేశారు. వాస్తవానికి ఆ రూంలో భైరవ టీం డ్యాగర్స్ దాచుకుంది. కాబట్టి సప్త శక్తి టీంను రానివ్వకుండా వాళ్లు జాగ్రత్తపడుతున్నారు. వర్షిణి నుంచి డ్యాగర్స్ ఎక్కడ పెట్టారో ఇన్ఫర్మేషన్ లాగేందుకు ముఖేష్ చాలా సేపు ట్రై చేశాడు. కానీ వర్షిణి చెప్పలేదు. అయితే త్రిగుణ్ మాత్రం కెప్టెన్ రూంలో పెట్టారని కనిపెట్టాడు. ముఖేష్ గురించి వర్షిణికి అపూర్వ కంప్లైంట్ చేసింది. మరోవైపు ముఖేష్‌తో ఝాన్సీ నువ్వు కెప్టెన్‌తో నీ బిహేవియర్ కరెక్ట్ కాదని చెప్పింది. సింహాసనం అలా వాడొచ్చా? అని ముఖేష్ కంప్లైంట్. మళ్లీ వర్షిణి సింహాసనంపై కూర్చొని ఉందని.. ఆమెకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వరని ముఖేష్ అడగాడు. ముఖేష్‌కు తెలుగు రాదు.. దీంతో ఈ గొడవలో మధ్యలోకి వెళ్లిన రోహిత్‌ను ‘నువ్వు దాన్ని మెయిన్‌టైన్ చేస్తున్నావా?’ అని ముఖేష్ అడిగాడు. దీంతో ఆ మాటేంటని రోహిత్. మధ్యలో త్రిగుణ్ వచ్చేసి రోహిత్‌ను బ్లేమ్ చేస్తూ చాలా చిల్లరగా ప్రవర్తించాడు. ఈ సీజన్ త్రిగుణ్ లేకుంటే ఏమాత్రం బాగుండేది కాదు. కానీ టాప్ కంటెస్టెంట్ అయిన అతను తన మైలేజ్‌కి తనే గండి కొట్టుకుంటున్నాడు.

నామినేషన్స్ మహా సంగ్రామం ప్రారంభమైంది. భైరవ టీం గెలిచినందున ఆ టీంకు అడ్వాంటేజెస్ లభించాయి. ఈ టీంలో ప్రతి ఒక్కరికీ నామినేట్ చేసే అవకాశం లభించింది. సప్తశతి టీంలో ముఖేష్ ముందే నామినేట్ అయి ఉన్నాడు. ఆ టీం నుంచి ఇద్దరికి నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్‌బాస్ ఆ టీంకి ఇచ్చింది. అపూర్వ కెప్టెన్ అయినందున ఆమెను నామినేట్ చేయడానికి లేదు. ఇక సప్త శక్తి టీం నుంచి నామినేట్ చేసే ఇద్దరు.. త్రిగుణ్, నరేష్. ముందుగా పాయింట్స్ పెట్టి ఆ తరువాత పేరు చెబుతానని త్రిగుణ్ నామినేషన్ మొదలు పెట్టాడు. ప్రతి విషయానికి నరేటివ్ సెట్ చేస్తాడని త్రిగుణ్ చెప్పాడు. తనకు, షాలినికి మధ్యకు వచ్చి నెరేషన్ సెట్ చేయడానికి ఏం జరిగిందో కూడా తెలియకుండా మధ్యలో వచ్చాడని చెప్పాడు. తనతో ఉన్నవారిని వెనుక మాట్లాడాడని చెప్పాడు. తన మొహంపై ఉమ్మి పడితే చాలా బిల్డప్ ఇచ్చాడని ఆ వ్యక్తే రోహిత్ అని చెప్పాడు. అమన్‌ను డీ గ్రేడ్ చేశాడని రోహిత్ చెప్పాడు. షాలిని దగ్గరకు వెళ్లినప్పుడు పొరపాటు తనకు తగిలిందని సారీ కూడా చెప్పినట్టు చెప్పాడు. తన మొహంపై ఉమ్మి పడినా తను మాట్లాడలేదని రోహిత్ చెప్పాడు. అయినా కూడా పక్కన ఊశాడని.. తన క్యారెక్టర్ బ్యాడ్ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు.

నరేష్ వచ్చి అమన్‌ను నామినేట్ చేశాడు. బాగా ట్రిగర్ అవుతున్నాడని చెప్పాడు. టాస్క్ విషయంలో సంచాలక్‌గా కరెక్ట్‌గా చేయలేదన్నాడు. ఫస్ట్ వీక్‌కి.. ఇప్పటికి చాలా తేడా ఉందని.. అప్పుడు ఫేకా? ఇప్పుడు ఫేకా అనేది తెలియడం లేదని నరేష్ చెప్పాడు. అమన్ బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. హోస్ట్ నాగార్జున ఎవరితో అయినా గొడవ పెట్టుకుని నామినేషన్స్‌లోకి రమ్మని చెప్పారని.. అందుకే తనకు నామినేషన్ వేస్తున్నాడని అమన్ చెప్పాడు. ఆ తరువాత ఝాన్సీ వచ్చి సృష్టిని నామినేట్ చేసింది. తనను మూడు వారాల పాటు నామినేట్ చేయవద్దని అడిగిందని.. అది తనకు నచ్చలేదని చెప్పింది. సేఫ్ గేమ్ ఆడుతున్నావని ఝాన్సీ తెలిపింది. మిగిలిన వాళ్లను కూడ తాను అడిగానని.. సృష్టి చెప్పింది. సేఫ్‌గా ఉండాలని అడిగానని చెప్పింది. అమన్‌ వచ్చేసి త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. తనను ఆగమన్ అనడంపై నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఎవరో మాటలు విని అలా మాట్లాడావని.. ఎవరైనా సపోర్ట్ వస్తే రెచ్చిపోతావని చెప్పాడు. గేమ్ చాలా బాగా ఆడతావని.. కానీ ఫిజికల్ అవుతావని చెప్పాడు. మిథిలేష్ విషయంలో డెసిషన్ అమన్ చేతిలో ఉందని అందుకే అలా మాట్లాడినట్టు చెప్పాడు. అరే..తురే కొడితే పడాలా? అని అమన్ అడిగాడు. ఒకరి మాటలు విని పప్పెట్ అవుతున్నావని చెప్పాడు.

Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..

అపూర్వ వచ్చి త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. అందరి మాటలు విని త్రిగుణన దూత అనుకుంటున్నారని.. మీరు అందరి చెవుల్లో మోత అని అపూర్వ చెప్పింది. ఇక్కడున్న ఆడవాళ్లకు సిగ్గులేదా? అని అడిగాడని.. రోహిత్‌ విషయంలో థూ అని ఊశాడని అవన్నీ చాలా తప్పని చెప్పింది. కెప్టెన్‌గా ఏదో పీకేస్తా.. పొడిచేస్తా అన్నాడని అపూర్వ పేర్కొంది. తనకు లేడీ త్రిగుణ్ అని ఇచ్చిన బిరుదు.. తనకు తేళ్లు, జర్రులు పాకినట్టుగా ఉందని అపూర్వ తెలిపింది. బాగా ఉసిగొల్పుతాడని చెప్పింది. అనవసర విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని త్రిగుణ్‌కి చెప్పింది. అతను వెటకారంగా నవ్వుతుంటే అలా నవ్వొద్దని చెప్పింది. మీ గేమ్ ఏంటనేది తెలిసిందని త్రిగుణ్ చెప్పాడు. సృష్టి, అమన్‌ను తీసేయడానికి కారణాలు చెప్పి.. ఆ తరువాత ఎందుకు మారిపోయిందో తెలుసన్నాడు. మీరు ఎంత డబుల్ గేమ్ ఆడుతున్నారని చెప్పాడు. మీరు వరస్ట్ కెప్టెన్ అని త్రిగుణ్ అన్నాడు. ఆ తరువాత రామ్ ప్రసాద్ వచ్చేసి షాలినిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్‌తో పదే పదే చెప్పించుకుంటున్నావని చెప్పాడు. ఫైటింగ్ అవగానే నువ్వు మాట్లాడిన మాటలు రోహిత్ కాబట్టి ఊరుకున్నాడు కానీ వేరొకరైతే ఊరుకునే వారు కాదని చెప్పాడు. తన కోపాన్ని తగ్గించుకునేందుకు పిడికిలి బిగించాను కానీ ఎవరినో కొట్టడానికి కాదని షాలిని చెప్పింది.

రోహిత్ వచ్చి దేబ్జానిని నామినేట్ చేశాడు. మూడు వారాలు పూర్తైనా కూడా తన గేమ్ కనిపించలేదని.. అసలు నామినేషన్ ప్రాసెస్ కూడా తెలియదని చెప్పాడు. నామినేషన్ ఒకరితో మొదలు పెట్టి మరొకరికి ఎండ్ చేస్తారన్నారు. టు ఫేస్‌లతో ఉంటావని చెప్పాడు. రోహిత్‌లా ఆడటం తనకు నచ్చదని దేబ్జాని చెప్పింది. రోహిత్ ఫ్లిప్ అవుతాడని.. నరేష్ డ్యాగర్ దొంగిలించి అందరికీ ఎవరు ఎలా ఆడాలో చెబుతున్నాడని దేబ్జాని తెలిపింది. నరేష్ గురించి పొట్టోడు అనడం తనకు తెలియదని క్యూట్‌గా మాట్లాడటం కరెక్ట్ కాదని రోహిత్ చెప్పాడు. నరేష్ మధ్యలో ఇన్వాల్వ్ అయి ఆమెకు చప్పకపోవడం తన తప్పేనని.. ఆ తరువాత ఆమె మాట్లాడలేదన్నాడు. సృష్టిని వర్షిణి నామినేట్ చేసింది. సుధీర్‌పై చెత్తవేయడం.. మాట్లాడే పద్ధతి తనకు నచ్చలేదని చెప్పింది. ట్రోమా అనేది అందరికీ ఉంటుందని తెలిపింది. ఒకవేళ రేపు తనేదైనా మాట్లాడితే ట్రోమా గుర్తొచ్చి తన తల ఎక్కడ పగులగొడుతుందోనని భయంగా ఉందని వర్షిణి చెప్పింది. చాలా సార్లు తను సారీ చెప్పానని.. తనెప్పుడూ ఎవరినీ కొట్టలేదని చెప్పింది. తన సిట్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నట్టుగా సృష్టి తెలిపింది.

వంశీ చరణ్‌ను నామినేట్ చేశాడు. రెండోసారి అవకాశం వచ్చినా ఉపయోగించుకోవడం లేదన్నాడు. ఒక ఫేక్ పర్సనాలిటీతో వచ్చినట్టుగా అనిపించిందని వంశీ చెప్పాడు. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు చాలా ఓపెన్ అయినట్టుగా చెప్పాడు. ఫస్ట్ టైం అందరితో కలిస్తే తప్పని బయటకు పంపారని.. ఇప్పుడు అందరితో కలుస్తుంటే తనది తప్పంటున్నారని చరణ్ చెప్పాడు. సుధీర్ వచ్చి కూడా చరణ్‌ని నామినేట్ చేశాడు. చరణ్‌ని చాలా సపోర్ట్ చేస్తానని.. కానీ రెండోసారి కూడా వచ్చి తనే కరెక్ట్.. ఇలానే ఉంటానంటే ఎలా అని సుధీర్ అన్నాడు. తన పర్సనాలిటీ ఇదేనని తను ఇలాగే ఉంటానని చెప్పాడు. ఈ వారం ముఖేష్, త్రిగుణ్, దేబ్జాని, రోహిత్, షాలిని అమన్, నరేష్, సృష్టి, చరణ్ నామినేట్ అయ్యారు. నామినేషన్స్‌లో పెద్దగా గొడవలైతే ఏమీ లేవు. గత వారాలతో పోలిస్తే కాస్త అరుచుకోవడాలు వంటివేం లేకుండానే పూర్తయ్యాయి. ఫైర్ లేని నామినేషన్స్ ఈ సీజన్‌లో ఇదే తొలిసారి అని చెప్పాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360