సినిమా వార్తలు

Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు. ముఖేష్‌ చేసిన తప్పులను ఏదో టచ్ చేయాలన్నట్టుగా టచ్ చేశారు. పూర్తిగా తప్పులను సైతం ఎత్తి చూపలేదు. పైగా ప్రశంసలు కురిపించారు. దీంతో ముఖేష్‌కు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. తను చేస్తున్నంతా బయటకు చాలా పాజిటివ్‌గా వెళుతోందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. దీంతో నామినేషన్స్ విషయంలో చెలరేగిపోయాడు. మరోవైపు వర్షిణి కూడా ఏమాత్రం తగ్గలేదు. అసలు ఇప్పటి వరకూ వర్షిణి చేసిన తప్పులను నాగ్ ఎత్తి చూపించింది కూడా లేదు. ఎందుకో ఆమెను, దేబ్జానిని బిగ్‌బాస్ టీం బాగా వెనుకేసుకొస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి.

ఆ ప్రోమోలను బట్టి చూస్తే ముఖేష్, వర్షిణి ప్రవర్తన చాలా చిరాకు పెట్టించేలా ఉంది. డ్యాన్సులు చేస్తున్నాడు.. ఇష్టానుసారంగా మాట్లాడారు. అపూర్వను ముఖేష్ నామినేట్ చేశాడు. ఆమె డిఫెండ్ చేసుకుంటుంటే.. చాలా వెటకారంగా మాట్లాడుతూ.. డ్యాన్సులు చేస్తూ నానా హంగామా చేశాడు. అపూర్వ తనను తాను డిఫెండ్ చేసుకుంటుంటే వర్షిణి వెళ్లి అపూర్వకు ముఖేష్ కనిపించికుండా మధ్యలో నిలబడింది. అలాగే వర్షిణి.. రోహిత్‌ను నామినేట్ చేస్తూ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ‘నువ్వు నన్ను చాలా చాలా హర్ట్ చేశావు’ అని చెప్పింది. హ్యుమానిటీ బేసిస్‌లో నువ్వు ఆలోచించలేదు. అని చెప్పింది. ఈ సమయంలో వర్షిణి కూడా చాలా యాటిట్యూడ్‌తో బిహేవ్ చేసింది. రోహిత్‌తో మాట్లాడలేక.. పాయింట్స్ పెట్టలేక చాలా రూడ్‌గా అతని కుండను పగులగొట్టి.. నామినేషన్ చేసి వెళ్లెళ్లు.. కూర్చో అంటూ చాలా వెటకారంగా మాట్లాడింది. ఇద్దరిపై నెట్టింట ఇప్పటికే బీభత్సంగా ట్రోల్స్ వస్తున్నాయి. వీరిద్దరి ప్రవర్తన ఇలాగే ఉంటే బయటకు వచ్చేందుకు పెద్దగా సమయం పట్టనట్టే ఉంది.

Telugu Cinema 360

Recent Posts

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్…

1 hour ago

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో…

4 hours ago

AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లీశ్వరి, నువ్వు…

4 hours ago

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

‘నారాయణమ్మ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి…

13 hours ago

Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్‌ని బాగా…

13 hours ago

Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే ముందుగా గుర్తొచ్చేది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫుల్…

1 day ago