సినిమా వార్తలు

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో మారుమోగిపోతోంది. దానికి కారణం ఆమె ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్ కమ్ టాక్స్ (IT) అధికారులు సోదాలు చేశారంటూ వచ్చిన వార్తలే. విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ఆమెపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే ఈ ఫేక్ న్యూస్ పై రకుల్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు ఒక క్లారిటీ ఇస్తూ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అసలు విషయం ఏంటంటే సెప్టెంబర్ 28వ తేదీన ఇండస్ట్రీకి చెందిన పలువురి ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ శాఖ తనిఖీలు చేసింది. అందులో రకుల్ మామగారు, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అయిన వాషు భగ్నానీతో పాటు ముంబైలోని ప్రముఖ సంస్థ పనోరమ స్టూడియోస్ కూడా ఉన్నాయి. కానీ ఆ సోదాలకు తనకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, కేవలం వ్యూస్ కోసం మీడియా వాళ్లు తన పేరును వాడుకుని అనవసరమైన సెన్సేషన్ క్రియేట్ చేశారని రకుల్ మండిపడ్డారు.

తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ రకుల్ ఒక్కొక్కటిగా కొట్టిపారేశారు. తన పర్సనల్ ఎకౌంట్స్ నుంచి గానీ, లేదా ఏ ఇతర ప్రొడక్షన్ హౌస్ తరపున గానీ విదేశాలకు ఎలాంటి ఇల్లీగల్ మనీ ట్రాన్స్‌ఫర్ జరగలేదని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇండియాలో కానీ, ఫారిన్ కంట్రీస్‌లో కానీ తన పేరు మీద ఎలాంటి బినామీ ఆస్తులు లేవని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎవరి దగ్గరి నుంచి ఖరీదైన ఆస్తులను గిఫ్ట్‌లుగా తీసుకునే అలవాటు తనకు లేదని కుండబద్దలు కొట్టారు. కనీసం ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా, కనీస నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం సెలబ్రిటీల గురించి ఏది రాసినా జనాలు చదువుతారనే ఉద్దేశ్యంతో ఇలా ఇష్టమొచ్చినట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం వల్ల ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ నిమిషాల్లో డ్యామేజ్ అవుతుందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తన పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా రకుల్ చాలా ఎమోషనల్ గా పంచుకున్నారు. తానొక క్రమశిక్షణ కలిగిన ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చానని, సినిమా ఇండస్ట్రీలో తనకు బ్యాక్ గ్రౌండ్ కానీ, ఎలాంటి గాడ్ ఫాదర్ కానీ లేరని గుర్తు చేశారు. కేవలం తన సొంత కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అంతేకాకుండా తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రభుత్వానికి పక్కాగా టాక్స్ కడుతున్నానని, చట్టాన్ని గౌరవించే ఒక బాధ్యతాయుతమైన సిటిజన్ అని రకుల్ తన స్టేట్‌మెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన పబ్లికేషన్స్ వెంటనే ఆ వార్తలను వెనక్కి తీసుకుని, ఫ్యాక్ట్స్ ఏంటో జనాలకు స్పష్టంగా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియా సంస్థల మీద బిజినెస్ పరంగా కమర్షియల్ ప్రెజర్స్, కాంపిటీషన్ ఉంటాయనే విషయం తనకు తెలుసని, కానీ ఆ వ్యూస్ కోసం ఒకరి పరువు, ప్రొఫెషన్, జీవితంతో ఆడుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రకుల్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

Telugu Cinema 360

Recent Posts

Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే…

2 hours ago

Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి.…

3 hours ago

Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్

బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్..…

16 hours ago

ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ

ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ…

16 hours ago

Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట…

2 days ago

RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!

ఇండస్ట్రీలో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి పేరు…

4 days ago