బిగ్‌బాస్ షో అంతా ఇవాళ (గురువారం) బేరసారాలతోనే నడిచింది. మరోవైపు బిగ్‌బాస్ చూస్తే ‘అల్టిమేట్ గోట్’ అని చెప్పి స్నేక్ అండ్ లేడర్ వంటి చిన్నపిల్లల గేమ్స్ ఆడిస్తున్నాడు. ఈ వారమంతా రోహిత్ వర్సెస్ త్రిగుణ్ నడుస్తోంది. హౌస్ అంతా రెండుగా విడిపోయింది. అయితే త్రిగుణ్ సైడ్ బలం.. బలగం ఎక్కువగా ఉంది. వర్షిణిని గ్రీన్ పంపాలని ఒక వర్గం.. రామ్ ప్రసాద్‌ని గ్రీన్‌కు పంపాలని త్రిగుణ్ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రోహిత్ ఎల్లోలోకి వెళ్లాలని పావులు కదుపుతుంటే.. వంశీని ఎల్లోకి పంపాలని త్రిగుణ్ వర్గం పావులు కదుపుతోంది. ఇలా ఎత్తులకు పై ఎత్తులతో బిగ్‌బాస్ షో నడిచింది. త్రిగుణ్ సహా అంతా అపోజిట్ అలయెన్స్ అని.. తాను మీకు సాయం చేస్తున్నా కాబట్టి తనకు సాయం చేయమని ఝాన్సీ, సుధీర్‌ని రోహిత్ అడిగాడు. అప్పుడే అక్కడకు వర్షిణి కూడా వచ్చింది. రామ్ ప్రసాద్ కూడా తనకు స్టార్ ఇవ్వట్లేదని వర్షిణి చెప్పింది. శివ్ తన దగ్గర ఉన్న మూడు స్టార్లు రామ్ ప్రసాద్‌కి ఇస్తానని చెప్పాడట. తనకేదో ప్లాన్ ఉందని.. దానిని వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తానని రోహిత్ చెప్పాడు. త్రిగుణ్‌తో డీల్ పెట్టుకుంటే తాను వార్ వన్‌సైడ్ చేస్తానని చెప్పాడు.
మరోవైపు త్రిగుణ్ గ్రూప్ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తరువాత త్రిగుణ్ వెళ్లి వర్షిణితో సుధీర్‌కి ఎంత ఇచ్చావో చెప్పమన్నాడు. ఎంత ఇచ్చానో గుర్తు లేదని వర్షిణి చెప్పింది. వర్షిణి, రోహిత్ వాళ్లంతా శివ కప్బోర్డ్ వెతికారు. దేబ్జాని కప్ బోర్డ్ కూడా చూస్తుంటే ఆమె అక్కడకు వచ్చింది. వెంటనే వాళ్లేం తెలియనట్టుగా ఉండిపోయారు. శివ్ కూడా కెమెరాలతో మాట్లాడటం ప్రారంభించాడు. తనకు అల్టిమేట్ గోట్ అవ్వాలని లేదని.. గోట్ మేకర్ అవ్వాలని ఉందని చెప్పాడు. అమన్ నిన్న రోహిత్‌కు ఇచ్చిన స్టార్ తిరిగి తీసేసుకున్నాడు. ఆ తరువాత వంశీ అందరితో ఎక్సర్సైజులు చేయించాడు. ఆతరువాత కాసేపు నరేష్, రామ్ ప్రసాద్ కలిసి ఫన్ చేశారు. ఆ తరువాత నరేష్ త్రిగుణ్ దగ్గరకు వెళ్లి వెంటిలాక్విజమ్ చేసి చూపించాడు. ఫన్ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. శ్వేతను అంతా సేవ్ చేస్తారని.. ఇబ్బంది లేదని ముఖేష్ చెప్పాడు. వర్షిణిని గ్రీన్‌లోకి తీసుకురావొద్దని.. రోహిత్‌ను ఎల్లోలోకి రానివ్వొద్దని రామ్ ప్రసాద్‌కు శివ్ చెబుతాడు. ఆతరువాత వర్షిణి దగ్గరకు వెళ్లి ముఖేష్ తన గర్ల్ ఫ్రెండ్ మాట్లాడిన విషయాల గురించి చర్చించాడు.
ముఖేష్‌ను పిలవండి.. మీ ఇద్దరితో మాట్లాడాలని చెబుతాడు. ఆ తరువాత ముఖేష్ దగ్గరకు వెళతాడు. తనకు ఉదయం దేబ్జాని వెనుక పడుతున్నట్టుగా చెప్పారని వర్షిణి చెప్పింది. అలా ఎందుకు చెప్పారని శివ్ అడిగాడు. అలా ఎందుకు మీకు అనిపించిందని ముఖేష్‌ను అడిగాడు. అందరూ అంటే ఎవరని శివ్ అడిగాడు. దేబ్జానిని తనకు ఫ్రెండ్ అనుకోవచ్చు కదా అని అడిగాడు. వర్షిణి.. తన మాదిరిగా మీరు కూడా ఉంటున్నారేమోనని చెప్పాడు. తనకు దేబ్జాని మంచి సలహాలు ఇస్తోందని.. ఆమెతో మంచి బాండింగ్ ఏర్పడిందని శివ్ చెప్పాడు. ముఖేష్‌తో కూడా మాట్లాడేందుకు ట్రై చేశానని కానీ అవలేదని చెప్పాడు. శివ వచ్చాక మన గ్రూప్ మరింత స్ట్రాంగ్ అవుతుందని తనే వర్షిణికి చెప్పానని చెప్పాడు. ఈ మాటలన్నీ శివ్ తీసుకెళ్లి రామ్ ప్రసాద్, వంశీ, దేబ్జానిలకు చెప్పాడు. శివ్ కూడా ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడకు మోసేస్తున్నాడు.
స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్‌ను బిగ్‌బాస్ ప్రారంభించారు. శివ తరుఫున ఇద్దరు వర్కర్స్, రామ్ ప్రసాద్ తరుఫున ఇద్దరు వర్కర్స్ వచ్చి ఆడారు. ఒకరు డైస్ వేస్తుంటే రామ్ ప్రసాద్, శివ్, సుధీర్, రామకృష్ణ గేమ్ ఆడారు. శ్వేతను ఎందుకు సేవ్ చేస్తానని వచ్చి త్రిగుణ్‌ను అడిగాడు. అమన్ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని శివ్ చెప్పాడు. అమన్‌తో మాట్లాడటం కరెక్ట్ కాదని శ్వేతకు చెప్పానని అమన్ అన్నాడు. ఆ తరువాత టాస్క్ మళ్లీ ప్రారంభమైంది. అమన్ ఫ్లిప్పులు కొడుతున్నాడని శ్వేతతో త్రిగుణ్ చెప్పాడు. రోహిత్ కూడా అదే చెప్పాడని శ్వేత చెప్పింది. ఆ తరువాత త్రిగుణ్ టీం మొత్తం సమావేశమైంది. అమన్ దగ్గర స్టార్ ఉంటే చాలు అని త్రిగుణ్ చెప్పాడు. తను తెస్తానని శ్వేత చెప్పడంతో నీకు దమ్ముంటే తీసుకురమ్మని నరేష్ చెప్పాడు. శ్వేత వెళ్లి అమన్‌ను స్టార్ అడిగింది. అయితే ఇస్తున్నా అంటే అందరి ముందు ఇవ్వమని అడిగాడు. అప్పుడు రామ్ ప్రసాద్‌ను పిలిచి అతని ముందే శ్వేతకు ఇచ్చాడు. అందరూ అమన్ లాస్ట్ వరకూ ఇలాన చేస్తున్నాడని అంటున్నారని శ్వేత చెప్పింది. నరేష్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకొచ్చుకోమని ఝాన్సీకి రోహిత్ చెప్పాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి స్టార్లు తీసుకోమని రోహిత్ చెప్పాడు.
ఆ తరువాత స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్ గెలిచాడు. రామ్ ప్రసాద్, వంశీ, సుధీర్‌లకు బిగ్‌బాస్ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. రామ్ ప్రసాద్‌కు క్యాష్ వచ్చింది. మరికాసేపట్లో లావాదేవీలు చేసుకోవాల్సిన సమయం ముగుస్తుందని.. అప్పుడు తనకు ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో.. ఎవరి దగ్గర ఎన్ని స్టార్స్ ఉన్నాయో చెప్పాలని బిగ్‌బాస్ అడిగారు. తన దగ్గరఉన్న స్టార్స్ శివ్.. రామ్ ప్రసాద్‌కు ఇచ్చాడు. తన దగ్గర ఉన్న స్టార్ రామ్ ప్రసాద్‌కు అమన్ ఇచ్చాడు. మొత్తంగా అమన్ కూడా త్రిగుణ్ వర్గంలో చేరిపోయాడు. ఎవరి దగ్గర ఎన్ని స్టార్స్, ఎంత క్యాష్ ఉందో బిగ్‌బాస్ చెప్పమన్నారు. వంశీ దగ్గర 40 వేలు.. రోహిత్ దగ్గర రూ.30,500 ఉన్నాయని చెప్పాడు. వర్షిణి దగ్గర 3 పింక్ స్టార్స్, 1 గోల్డ్ స్టార్ ఉంది. రామ్ ప్రసాద్ దగ్గర 7 పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ ఉంది. వర్షిణి, రామ్ ప్రసాద్ ఇద్దరూ గ్రీన్‌లోకి వెళ్లారు. వర్షిణి ఎలిమినేషన్ నుంచి సేఫ్. వంశీ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంది కాబట్టి ఎల్లోకి చేరుకున్నట్టు ప్రకటించారు. ఆడియెన్స్ ఓట్లతో మాత్రమే ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ చెప్పారు. ఏడుగురిలో ఐదుగురే ఆడాలంటే ఎవరిద్దరిని తీసేయాలో తెలుసని.. కంటెండర్‌షిప్ గురించి కూడా త్రిగుణ్ స్కెచ్ గీస్తున్నాడు. శివ, త్రిగుణ్ మొహం మారిపోయాయని ముఖేష్, రోహిత్ మాట్లాడుకున్నారు. ఎట్టకేలకు వర్షిణి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది.
బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్…
బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి…
నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి…
సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను…
బాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'రామాయణ పార్ట్ 1' కోసం అందరూ ఆసక్తిగా…
సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2021 అక్టోబర్ 29న కర్ణాటక రాష్ట్రం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. వాళ్ల పాలిట దేవుడు…